2023

పద్మసాని - మధురవాణి తులనాత్మక పరిశీలన

బుక్కే ధనక నాయక్‌
8187056010
మహాకవి గురజాడ అప్పారావు గారి కన్యాశుల్యం నాటకంలో మధురవాణి గొప్ప పాత్ర. ఆమె మానవత్వం కలిగిన వేశ్య. దురాచారాల్ని సహించదు. కన్యావేషంలో ఉన్న శిష్యుణ్ణి లుబ్ధావధానికి కట్టబెట్టి, సుబ్బి పెళ్ళి తప్పించడంలో ఆమె వ్యూహాశక్తి మనకి తెలుస్తుంది. పొరుగువారికి సాయపడుతూ, ఈ పాపపు లోకంలో కూడా మంచి ఉందని నిరూపించిన త్యాగజీవి ఆమె. బండి నారాయణ స్వామి గారి నవల 'శప్తభూమి'లో పద్మసాని కూడా అలాంటి ఉదాత్తమైన పాత్ర. ఆమె హండే రాజుకు ఉంపుడుగత్తె, వేశ్య. ఈమె పేదరికంలో ఉన్న బీరప్ప ఇజ్జయినమ్మల పాప ఇమ్మడమ్మను రూ.50 లకు కొని పెంచుకుంటుంది. వేశ్యవృత్తి ఇష్టం లేకపోయినా ఆ కాలంనాటి పరిస్థితులకు లొంగి, ఆ వృత్తిలో జీవనం గడుపుతుంది. తన కొడుకుని ఇంగ్లీష్‌ చదువులు చదివించి, తనకు హండేరాజు దానం ఇచ్చిన జక్కలూరు గ్రామ మాన్యాన్ని అభివృద్ధి చేసే దిశలో ఆమె ఆస్తి మొత్తాన్ని ధారాదత్తం చేసిన మానవతా మూర్తి. సమాజం నీచంగా చూసే వృత్తిలో ఉన్నప్పటికీ - తమ మానవత్వం పుష్కలంగా ఉందని ఈ రెండు పాత్రలూ నిరూపిస్తాయి.
గురజాడ రచనల్లో కన్యాశుల్కం (నాటకం) అగ్రగణ్యమైంది. కన్యాశుల్కం దురాచారాన్ని విమర్శిస్తూ రచించిన ఈ నాటకం భారతీయ భాషల్లో వెలువడిన అత్యుత్తమమైన రచనల్లో ఒకటి. బండి నారాయణ స్వామి తెలుగు నవలా రచయిత, ఉపాధ్యాయుడు. రాయలసీమ మాండలికాన్ని ఉపయోగిస్తూ రాజకీయ, ఆర్థిక, సాంఘిక అరాచకాలను వివరిస్తూ ప్రజల మధ్య సామాజిక స్ప ృహను, చైతన్యాన్ని పెంపొందించే విధంగా రచనలు చేస్తున్నారు. నారాయణ స్వామి గారి నవలల్లో శప్తభూమి నవల అత్యంత ప్రాముఖ్యమైనది.

Pages

Subscribe to RSS - 2023