2023

అలంకార గ్రంథాలు ఒక పరిశీలన

డాక్టర్‌ ఆర్‌.కుసుమ కుమారి
కావ్యానుశీలనం చేసే శాస్త్ర గ్రంథాలను కావ్యశాస్త్రాలని, సాహిత్యశాస్త్రాలని అంటారు. వీటికే అలంకార శాస్త్రాలని ప్రచారంలో ఉన్న పేరు. వీటిలో కావ్య సంబంధమైన చర్చలు ఉంటాయి కాబట్టి వీటిని దివ్య విమర్శనా గ్రంథాలని కూడా అనవచ్చు. ఇంకా వీటిల్లో లక్షణాలు, లక్ష్యభూతంగా కావ్యాల సమీక్షలు ఉండటం చేత వీటిని లక్షణ గ్రంథాలని కూడా అంటారు.
అయితే కావ్యాల సాధుత్వాసాధుత్వాలను నిర్ణయించ టానికి, పెడమార్గాన్ని పట్టే కవిత్వాన్ని సంరక్షించటానికి విమర్శన, లక్షణ రూపాలైన కావ్యశాస్త్రాలు ఉదయించాయి. ఈ గ్రంథాలు కేవలం లక్షణాలను చెప్పేవే కాకుండా కావ్య సమీక్షలు కూడా చేయబడేవిగా కూడా ఉంటాయి. వీటిలో కవిత్వదోషాదులు, కవిత గుణాలంకార రసాదులు, కవి ప్రతిభాదులు చర్చించబడి ప్రాచీన కాలంలో కావ్య విమర్శలు జరుగలేదనే లోటును ఈ అలంకార శాస్త్ర గ్రంథాలు తీరుస్తున్నాయి.
లక్షణాలు : అతి ప్రాచీనమైన కాలంలోనే అలంకార శాస్త్ర గ్రంథాలు రచించబడ్డాయి. అలంకార శాస్త్రాల్లో ప్రధానంలో చర్చించబడే అంశాలు : కావ్యనాటక లక్షణాలు, కావ్య సిద్ధాంతాలు, కావ్యభేదాలు, నాయికా నాయక లక్షణాలు. రసవి ప్రముఖ అలంకారికుల గ్రంథాల్లోని విషయాలు చూద్దాం. రూపణం, కావ్యగుణ దోషాలు, శబ్ధశక్తులు, అలంకారాదులు మొదలైనవి.

Pages

Subscribe to RSS - 2023