2023

ఎర్రెర్ర జెండాగా .. ఎలుగెత్తు పాటగా ...

ప్రజల పోరు పాటగట్టి తూటాగా పేల్చినోడ
జనబాధల గాధలతో జండా ఎగరేసిినోడా
రొమ్ములోన గుండెతోటి దుమ్మురేపి బతికినోడ
నీ ఆటపాటలతో ఉత్తేజం నింపినోడ
మహా గాయకుడు, ప్రయోగశీల ప్రయోక్త, ప్రజా కళా సేనాని గద్దర్‌ అస్తమయంతో ప్రజా సాంస్క ృతిక రంగం చిన్నబోయింది. వేలపాటల వటవృక్షం నేలకొరిగింది. ఒక అగ్గిగొంతుక, ఒక నిప్పుల కంఠం చరిత్రగా మిగిలిపోయింది. అస్వస్థతతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్న గద్దర్‌ ఊహించని రీతిలో హఠాత్తుగా కన్నుమూయడం అభ్యుదయ కళాభిమానులకు అశనిపాతమైంది. ఆట పాట మాట నటన నృత్యం చిందులతో సమాజమే రంగస్థలంగా, కళావనినే సమరభూమిగా చేసుకున్న గద్దర్‌ ప్రస్థానం- ప్రజా కళాసాహిత్య రంగాల్లో ఒక సజీవ పాఠం, ఒక నిరంతర సంగీతం. తన బాటలో వందల వేలమందిని ఉత్తేజపరచిన సృజన గద్దర్‌ ప్రత్యేకత. పల్లెటూరి పాటగాడుగా మొదలై జననాట్యమండలి పతాకగా రూపొంది, ఆఖరి వరకు ఆగని అమరగానమై, అరుణరాగమై విరాజిల్లిన విప్లవ స్ఫూర్తి గద్దర్‌. రాజకీయ సైద్ధాంతిక కోణాల్లో తేడాలుండొచ్చు గానీ ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ స్వచ్ఛమైన సమరగీతమై సాక్షాత్కరించిన ఆయన ఆశయబలం విషయంలో అన్యమైన అంచనాలకు అవకాశమే లేదు.

Pages

Subscribe to RSS - 2023