2023

నీకొచ్చిన భాషలో రాయి నీ విముక్తి కోసం రాయి

గద్దర్‌ - తెలకపల్లి రవి
ముఖాముఖి

సిరిమల్లె చెట్టుకింద లచ్చుమమ్మా, అంటూ మీ అమ్మ పేరు మీద రాసినదే మీ మొదటి పాట కదా... దానికి ముందు నేపథ్యం ఏమిటి? మీరు పాటగాడు కావడం ఎలా జరిగింది?
మాది ఇక్కడికి దగ్గరే మెదక్‌ డిస్ట్రిక్ట్‌ తూప్రాను. నేను చిన్నప్పటి నుంచే పాటలు పాడేది. కట్టేది. ముఖ్యంగా మా అమ్మ జానపద పాటలు సానా బాగా పాడేది. వాటిల్ల సానా అర్థముండేది. అమ్మ వ్యవసాయ కూలీ. ఫాదర్‌ కాంట్రాక్టులు చేసేది. తమ ప్రోగెసివ్‌ కాంట్రాక్టుల కోసం మహారాష్ట్రలో ఔరంగాబాదు అదంతా పోయేటోడు. అక్కడే అంబేద్కర్‌ వంటి వాళ్ళను గురించి తెలుసుకుని వచ్చాడు. అంబేద్కర్‌ ఉద్యమం బాగా చదువుకోవాల్నెనేటోడు. అందుకే మమ్మల్ను చదివించాడు. మా ప్రాంతంలో హెచ్‌ఎస్‌సి పూర్తి చేసిన ఫస్టు ఎస్‌సిని నేనే. సరే. మా నాయన మొబిలిటీ వల్ల చైతన్యం పెంచుకున్నాడు. మా అక్కలను కూడా ఉద్యోగాలు చేసేటోళ్ళకే ఇచ్చి పెళ్ళి చేసినాడు. సబ్‌కాస్ట్‌ తేడాలు పాటించేటోడు కాదు. ఒకసారి ఎద్దును వండిపెట్టాడు. అలా చేసినందుకు తనను శిక్ష వేసి ఇల్లు గుంజుకున్నారు. అయినా భరించినాడు గాని తలవంచలేదు. నైట్‌ స్కూల్‌ నడిపేది. రాత్రిపూట దీపం జ్యోతి పరంబ్రహ్మం అని పాడించేవాడు. నేను హెచ్‌ఎస్‌సికి వచ్చేసరికి మా నాన్న చనిపోయినాడు. అమ్మనే పెంచింది. అక్కడ జీవితమే నాకు అన్నీ నేర్పించింది.

Pages

Subscribe to RSS - 2023