2023

కవి పుట్టిన సమయం

పద్మావతి రాంభక్త
సూర్యుడు రక్తవర్ణాన్ని ధరించి
మండు వేసవై
నిప్పులు కురిపిస్తున్నపుడా ...
పున్నమి చంద్రుడు
కిటికీలోంచి ఇంట్లోకి పాకుతూ
దేహాల్లో వేడిని రగిలిస్తున్నపుడా ...

మొక్క పుప్పొడి తుంపరలను చల్లుతూ
ఫక్కున ఉదయాన్నే నవ్వినపుడా...
నది పరవళ్ళ పల్లవులతో
పుడమి గొంతులోంచి
నీటిపాటై ఉబికినపుడా ...

Pages

Subscribe to RSS - 2023