కొత్త పుస్తకాలు

ఆశారాజు
పేజీలు: 221
ప్రతులకు: 9392302245
వెల: రూ 200

ఎక్కడెక్కడ నుండి తెచ్చుకోవాలో/ నీడ కోసం నాలుగు సిమెంటు రేకులు/ గోడలు లేపి చాన్నాళ్లయింది/ చినుకు వెంట చినుకు రాలి/ కూలిపోయే దశకు చేరింది/ కట్టింది మట్టితో కదా-/ పరిమళముంటుంది కాని, / పట్టు గట్టిగా వుండదు/ మీద పడుతుందన్న దిగులు లేదు కాని, / కూలిపోతే కలలు ఎగిరిపోతాయన్న భయముంది....

 

డా|| కపిలవాయి లింగమూర్తి
పేజీలు: 117
ప్రతులకు: 9032844017
వెల: రూ 50

అష్ట దిగ్గజాలు వారిపై ఉండే అపవాదులు, వారి వారి చాటువులు అంతేగాక పాఠకులు చెప్పుకునే వారి వారి కృతులలోని గుణ దోషాలు అనే విషయాలు ఆ దిగ్గజ కవుల నోటి వెంటనే వారి సంభాషణ రూపంలో ప్రేక్షకులకు అందించవలెననే దృష్టితో కూర్చినాను.

 

కూర్పు: డా. కొల్లోజు కనకాచారి
పేజీలు: 194
ప్రతులకు: 9491593871
వెల: రూ 180

ఇందులో కపిలవాయి గారి జీవనం, వారి పలు గ్రంథాల సంక్షిప్త పరిచయం, వారి శిష్యగణం పరిచయాలు, శిష్యులు, మిత్రులు చేసిన స్తుతులు, ఉదాహరణప్రాయంగా ఒకటి రెండు ముందుమాటలు (కపిలవాయి వారివి, ఇతరులు రాసినవి), వారందుకున్న బిరుదులు, సత్కారాలు, సన్మానాలు, రచనలు, వారి రచనలు ప్రచురించిన పత్రికల పట్టికలు, వారి సాహిత్యంపై పరిశోధన చేసిన వారి సమాచారమూ, ఉద్దరించ దగిన కపిలవాయి వాక్యాలు

ఉన్నాయి.

ప్రొ|| వెలమల సిమ్మన్న
పేజీలు: 148
ప్రతులకు: 9440641617
వెల: రూ 160

''యుగకర్త గురజాడ'' అనే రచన వాదనలకు, ఎంతోమంది ఆలోచనా వైఖరులకు అద్దం పడుతుంది. ఇందులో చర్చకు నోచుకున్న అనేక విషయాల్ని తమ విజ్ఞతతో ఆలోచించడానికి ఇది మంచి ఆస్కారాన్నిస్తుంది. అంతేకాక ఆచార్య సిమ్మన్న గారి విస్త్రత పఠనాన్ని, పరిశీలనని తెలియజేస్తుంది.

 

సంపాదకులు: బైస దేవదాసు
పేజీలు: 66
ప్రతులకు: 9000065433
వెల: రూ 10

'కాళోజీ జయంతి సందర్భంగా ఇచ్చిన పిలుపు మేరకు స్పందించిన కవుల కవిత్వాన్ని 4-9-2014న నేటినిజం పత్రికల్లో ప్రచురించడం జరిగింది. ఆ కవిత్వాన్ని సెప్టెంబర్‌ 9 కాళోజీ జయంతి సందర్భంగా వెలువరిస్తున్నదే ఈ ''మట్టిమనిషి ధిక్కారస్వరం'' కవితా సంకలనం.

      

సంపాదకులు: శిరేల సన్యాసిరావు
పేజీలు: 90
ప్రతులకు: 9603076777
వెల: రూ 100

'విశాఖ ' పత్రిక వారు గడచిన సంవత్సరం (2017) బాలల కథల పోటీ నిర్వహించి అందులో

ఉత్తమ కథలను పత్రికలో ప్రచురించడమే కాకుండా వాటన్నింటిని ఒక చోటుకి చేర్చి పుస్తకంగా సాహితీ లోకానికి అందించడం ఎంతో స్ఫూర్తిదాయక అంశం.

- డాక్టర్‌ మక్కెన శ్రీను

శ్రీమతి పత్తి సుమతి
పేజీలు: 60
ప్రతులకు: 8790499405
వెల: రూ 50

మంచి పుస్తకం - ''విశ్వయుద్ధంలో మనమెక్కడ'' వ్రాసిన రచయిత్రి శ్రీమతి పత్తి సుమతి గార్ని కొనియాడక తప్పదు. మంచి అవగాహనతో సుమతి మేడమ్‌ గారు అన్ని కోణాల నుంచి శాస్త్రీయంగా క్రీడల ప్రాముఖ్యతను వివరించిన తీరు చాలా అభినందనీయం. ముఖ్యంగా యువతకు ఈ పుస్తకం స్ఫూర్తిదాయకం. ప్రతీ విద్యార్థి ఈ పుస్తకం చదివి ప్రేరణ పొందుతారని నేను ఆశిస్తున్నాను.

 

డా. భీంపల్లి శ్రీకాంత్‌
పేజీలు: 117
ప్రతులకు: 9032844017
వెల: రూ 50

ఈ మొగ్గలు మూడు పాదాల కవిత్వమే అయినప్పటికీ క్లుప్తత, సరళత, సంక్షిప్తత, గాఢత దీని ప్రధాన లక్షణాలు. మొగ్గలు కవిత్వానికి ఎలాంటి అక్షర నియమం కాని, ఛందస్సు కానీ లేదు. అందరూ సులభంగా రాసే కవితా ప్రక్రియ ఈ మూడు పదాల కవిత్వాన్ని చక్కగా అభివ్యక్తీకరిస్తే తప్ప మొగ్గలు తెలుగు సాహిత్యంలో నిలదొక్కుకునే అవకాశం ఉంటుంది.

 

జి. శాంతారెడ్డి
పేజీలు: 60
ప్రతులకు: 8008177325
వెల: రూ 30

అమెరికాలో జరిగే కొన్ని విషాదాలను వింటున్నప్పుడు పేపర్లలో చదువుతున్నప్పుడు అటువంటి సందర్భాలలో శాంత వేదనా సందేశం ఏదైతే ఉందో చాలా సందర్భోచితంగా ఉంది. చదువుతుంటే నా హృదయం ఆర్థ్రమైంది. నా పాలమూరు కవితలో పాలమూరును మన కళ్లముందు చిత్రిక కట్టించింది. హోళీ పండగ వర్ణన రసవంతంగా వుంది. ఈమె రాసిన నలభైపై కవితలతో మౌనగీతాన్ని రూపుదిద్దడం సంతోషదాయకం.

 

డా|| దిలావర్‌
పేజీలు: 156
ప్రతులకు: 9866923294
వెల: రూ 100

డా||దిలావర్‌ సీనియర్‌ రచయిత. ఈ వ్యాస సంపుటిలో పదహారు వ్యాసాలున్నాయి. సమకాలీన తెలుగు సాహిత్యంలో ప్రతిభావంతంగా రాస్తున్న రచయితల పుస్తకాల గురించిన మంచి విశ్లేషణ ఈ పుస్తకంలో ఉంది. ఈ వ్యాసాలన్నీ వివిధ పత్రికలలో ప్రచురించబడినవే. అన్నింటినీ ఒకచోట చేర్చి పాఠకులకు అందించడం అభినందనీయం. ఇది విలువైన వ్యాసాల సమాహారం

బాలసుధాకర్‌ మౌళి
పేజీలు: 187
ప్రతులకు: 9676493680
వెల: రూ 120

''సుమారు నా రెండేళ్ల జీవితాన్ని అక్షరాల్లోకి అనువదించుకుంటే ఇప్పుడు మీ చేతుల్లో వున్న ఈ సంకలనం. అయినా వెలితి మిగిలే వుంది. 'ఏరోజుకారోజు ఒక అసంపూర్ణం' అనే తెలివిడి వుంది నాకు. ఒక కవిత పుట్టుకకు ఒక ప్రత్యేక సందర్భమొక్కటే కారణం కాదనుకుంటాను. కవిత ఒక పర్టిక్యులర్‌ శిల్పంలో ఒదుగుతున్నట్టనిపిస్తుంది. గాని దాని వేళ్లు ఎక్కడో మొదలవుతాయి. చిగుళ్లు ఎక్కడెక్కడికో విస్తరిస్తాయి.

       -  బాలసుధాకర్‌ మౌళి

డా|| ఉమ్మడిశెట్టి రాధేయ
పేజీలు: 214
ప్రతులకు: 9985171411
వెల: రూ 150

మా అవార్డు గ్రహీతలైన ముప్పై మంది కవులు వారి ముప్పై ఉత్తమ కావ్యాల విశ్లేషణ 'మూడు పదులు - ముప్పై కావ్యాలు''. ఇందులో మూడు దశాబ్దాల తెలుగు కవిత్వంలో సంభవించిన అనేక పరిణామాలను మనం గమనించవచ్చు. ఒక కవిగా నాకున్న అవగాహనతో ఈ విశ్లేషణా వ్యాసాలు వెలువరిస్తున్నాను.

 

దాట్ల దేవదానం రాజు
పేజీలు: 147
ప్రతులకు: 9440105987
వెల: రూ 120

ఈ గుచ్చంలో కథలన్నిటికీ కాన్వాస్‌ గోదావరే. పొడుగు వెడల్పుతో పాటు ఎత్తు కలిగిన కాన్వాస్‌ గోదావరి. దాట్ల ఒక్కో అలని చుట్టచుట్టుకు ఇంటికి తీసుకెళ్లి, మనసులో పరిచి, ఆరబెట్టి దాని మీద రాసిన కథలివి. పైగా కథా శీర్షికల్ని మిత్రులు సూచించగా వాటితో ఇతివృత్తాలు అల్లుకున్నారు. చక్కని పూరణతో అందించి, సరికొత్త అవధానానికి అంటు తొక్కారు. 

- శ్రీరమణ

వనజ తాతినేని
పేజీలు: 166
ప్రతులకు: 9985981666
వెల: రూ 125

వనజ కథలైనా, కవిత్వమైనా ఆమెలోని అన్వేషణా తృష్ణకి సంకేతాలు. ఎవరైనా ఒక వెతుకులాటలో భాగంగానే రాస్తారు. కాని, ఆ వెతుకులాటకి ఎంతో కొంత అర్థం తెలిసినప్పుడు గమ్యం మసకగా అయినా కనిపిస్తుంది. వనజ కవిత్వంలో ఆమె గాఢమైన అనుభవ పరిపక్వత ప్రతి సందర్భంలోనూ వ్యక్తమవుతుంది.

 

పుప్పాల సూర్యకుమారి
పేజీలు: 73
ప్రతులకు: 9701973843
వెల: రూ 40

అరుదైన ఈ కవితా సంపుటిలో అంబేద్కరిజం ఉంది. వందేమాతరం మాటు జాతి మాధుర్యం ఉంది. చెట్టు చైతన్యశోభ, మట్టి పరిమళాల ప్రభా ఉన్నాయి. పరాయీకరణలు, ప్రపంచీకరణలూ మనల్ని ప్రశ్నిస్తాయి. ఉగ్రవాదాలు, అహింసావాదాలు పాఠకుణ్ణి ప్రభావితం చేస్తాయి. నిర్భయలు, బడుగుల జీవితాలు, మతమౌఢ్యాలు చదువరులను ఉలిక్కిపడేలా చేస్తాయి.

- వడలి రాధాకృష్ణ

అద్దేపల్లి ప్రభు
పేజీలు: 32
ప్రతులకు: 9848930203
వెల: రూ 20

కనపడని అయిస్కాంత క్షేత్రమేదో/కాలికి చక్రాల్ని కట్టి లాగుతుంది/ఒక పొడిగాలి విసురూ/ఒక లేయెండ ఎదురూ/దేహాన్ని తడుముకుంటూ పోతాయి/ఛలో ఇబ్రహీం... కాసింత లాంగ్‌ డ్రైవ్‌ పోదాం/కుళాయి చెరువు నించి మాటల బండి /బయలు దేరుతుంది...

 

సింహాద్రి నాగశిరీష
పేజీలు: 57
ప్రతులకు: 9492249327
వెల: రూ 80

రచయిత్రి నాగశిరీష పిల్లల మనస్సులను, వారి పోకడలను అద్దంలో బింబంలా పసిగట్టిన బాలల పక్షపాతి. పాటలన్నీ స్పందించి రాసినవే... ఇందులో ఒక తల్లి, పిల్లలు విరివిగా మనకు తారస పడతారు. రెండు తీర్లా పాటలున్నాయి. పిల్లలంతా పిల్లల మాదిరిగా ఎట్లుంటారో, ఒకే తల్లే అయినా అందరు తల్లుల హృదయం పాటల్లో ఉంటుంది.

       -  భూపాల్‌

సంపాదకులు: మహమ్మద్‌ ఖదీర్‌బాబు - వేంపల్లె షరీఫ్‌
పేజీలు: 266
ప్రతులకు: 9603429366
వెల: రూ 170

దేశంలో జరుగుతున్న ఘటనలకు వర్తమాన తెలుగు ముస్లిం సమాజం ఎలా అనుకంపనం చెందుతున్నదో తనకు తానుగా జీవనం ఎలా సాగిస్తున్నదో తెలియడానికి ఆంధ్రప్రదేశ్‌ తాలూకు మానసిక ఆవరణాన్ని ఒక నిర్దిష్టమైన శాంపిల్‌గా తీసుకుని ఎంచిన కథలు ఇవి.

- సంపాదకులు

సుధామ
పేజీలు: 187
ప్రతులకు: 9849297958
వెల: రూ 150

 

సమతుల్యత పాటిస్తూ సాగిన సమకాలీన వ్యాఖ్యాన సంహిత ఈ 'మన తెలంగాణ'. అనేక ఆశల మధ్య ఆకాంక్షలతో ఏర్పడిన నూతన రాష్ట్రంలో మాటలకూ చేతలకూ మధ్యన, అలాగే వాగ్దానాలకు, వాస్తవాలకు మధ్యన, ప్రశంసలూ విమర్శలను పరిగణనలోకి తీసుకుంటూ, అవసరమైన చోట సూటిగా, మరికొన్నిచోట్ల అన్యాపదేశంగా చెప్పాల్సింది చెబుతూ, వేయాల్సిన చురకలు వేస్తూ, సుధామయం చేశారు రచయిత.

- తెలకపల్లి రవి

తెలుగు: కొత్తపల్లి రవిబాబు
పేజీలు: 24
ప్రతులకు: 9490196890
వెల: రూ 5

 

సమాజంలో సాహిత్యమూ, కళల స్థానం గురించి కార్ల్‌మార్క్స్‌, ఫ్రెడరిక్‌ ఏంగెల్స్‌లు వివిధ సందర్భాలలో వెలిబుచ్చిన అభిప్రాయాలను, వారి సంపూర్ణ రచనల నుండి, లేఖల నుంచి ఎన్నికచేసి ఒకచోట చేర్చిన సంపుటి ఇది. ఈ అంశంపై శాస్త్రీయ కమ్యూనిజం యొక్క సంస్థాపకులు చెప్పినదంతా ఈ సంపుటిలో లేకపోయినప్పటికీ కళాత్మక సృష్టిపట్ల మార్క్స్‌, ఏంగెల్స్‌ల ముఖ్యమైన భావనలను ఈ సంపుటి పాఠకులకు అందిస్తుంది.

- బి.క్రెలోవ్‌

భగ్వాన్‌
పేజీలు: 16
ప్రతులకు: 9393533336
వెల: రూ 10

 

ఒకడు - రాలుగాయి/ఒకడు - గడుగ్గాయి/ఒకడు - టపాకాయి/''మనుమలు మీకు ముగ్గురు/నాకైతే నలుగురు'' అందావిడ/అర్థంకాని ముఖంతో ఆవిడను చూసాను/ఆకాశంలో మొలిచి - ఏడుకొమ్మల బరువుతో/విల్లులా వంగిన చెట్టుమీంచి /వాన తుంపరల పూలు రాలుతున్నట్టు నవ్వి /అర్థమైందా లేదా అన్న/ప్రశ్న గుర్తు ముఖంతో నన్ను చూసింది..

- భగ్వాన్‌

పుట్టి గిరిధర్‌
పేజీలు: 63
ప్రతులకు: 9494962080
వెల: రూ 50

 

గిరిధర్‌ నానీల్లో లోకవృత్త పరిశీలనం, సామాజిక చైతన్యం, ఉహాశాలిత, నాస్టాల్జియా, శైలీనైగనిగ్యం ఇలా ఉత్తమ కవిత్వానికి ఉండవలసిన ద్రవ్యాలన్నీ ఉన్నాయి. ముఖ్యంగా భావావేశం.

- ఆచార్య ఎన్‌. గోపి

చలపాక ప్రకాష్‌
పేజీలు: 200
ప్రతులకు: 9247475975
వెల: రూ 100

 

'అబ్బా! ఏం రాసాడ్రా బాబూ'/అంటూ కొన్ని అక్షరాలు మెచ్చుకున్నాయి!/'నన్ను మలుచుకోలేదేం' అంటూ మరికొన్ని అక్షరాలు/కుళ్ళుకున్నాయి!!/కొన్ని - /కవిత్వంలో తడిసి ముద్దై/ పుష్కరాలు జరుపుకున్నాయ్‌! /కొన్ని / నిష్ప్రయోజనంగా పరుగెత్తే రోజుల్లాగ.../తరువాత చటుక్కున తిప్పేసే పుటల్లాగ.../మెదడున్నా గుర్తుంచుకోలేని వ్యర్ధంలాగ..!!?/ ఆవిరైపోయాయ్‌!!

       -  చలపాక ప్రకాష్‌

మరాఠీ మూలం: శరణకుమార్‌ లింబాళె తెలుగు: రంగనాథ రామచంద్రరావు
పేజీలు: 128
ప్రతులకు: 9440705955
వెల: రూ 60

అక్కర్‌మాశి రాయటానికి పూర్వం నేను దాదాపు అన్ని దళిత ఆత్మకథలను చదివాను. మరాఠీలో ప్రచురింపబడిన ఇతర ఆత్మకథలనూ చదివాను. వీటన్నిటిలోనూ వ్యక్తమైన జీవితం కంటే నా జీవితం భిన్నమైంది. వాటిని చదివాక నాకు ఆ నమ్మకం కలిగింది. ఈ విభిన్నతే నన్ను ఆత్మకథ రాయటానికి ప్రేరేపించింది.

- శరణ్‌కుమార్‌ లింబాళె

జాని భాషా చరణ్‌ తక్కెడశిల
పేజీలు: 67
ప్రతులకు: 9491977190
వెల: రూ 150

 హిజ్రాలది ఒక ప్రత్యేక ప్రపంచంగా రూపుదిద్దు కుంటున్నది. ఇందుకు మిగతా ప్రపంచమే కారణం. హిజ్రాలు ఇప్పుడు సంఘటితమౌతున్నారు. హక్కుల పోరాటం చేస్తున్నారు. గుర్తింపు ఉద్యమాలు నడుపుతున్నారు. ఈ నేపథ్యంలో జాని ఈ కావ్యం రాశారు. 'వై' ఒక మానవీయ కావ్యం. ఒక ఇతిహాసపు చీకటికోణాన్ని జాని వెలుగులోకి తీసుకొచ్చారు.

- రాచపాళెం చంద్రశేఖర రెడ్డి

సిహెచ్‌.వి. బృందావనరావు
పేజీలు: 104
ప్రతులకు: 9963399189
వెల: రూ 80

  పద్యానికి ఉన్న రూపసౌష్టవాన్ని పల్చన చెయ్యకుండానే వస్తుపరంగా కొత్తదనాన్ని దండిగా ప్రవేశపెట్టడం ఈ కవి సాధించిన గొప్ప సమన్వయం. ప్రతి ఖండికలోనూ ఇది కనిపిస్తుంది. ప్రధానంగా వీరి మహిళాభ్యుదయదృష్టి, మానవీయ దృష్టి అనేవి వస్తువుకు క్రొమ్మెరుంగులు దిద్దటంతో పాటు ఇవి నేటి కవితలు అనే స్పృహను పాఠకుడికి కల్గిస్తున్నాయి.

- బేతవోలు రామబ్రహ్మం

సంపాదక వర్గం: డా|| జోశ్యుల కృష్ణబాబు, బొల్లోజు బాబా మార్ని జానకిరామ్‌ చౌదరి
పేజీలు: 74
ప్రతులకు: 9908853081
వెల: రూ 50

 సమూహాల చర్యలను చరిత్ర లిఖిస్తుంది. వ్యక్తుల జీవితాలను ఉద్వేగాలను, ఆలోచనలను సాహిత్యం అక్షరబద్దం చేస్తుంది. సాహితీస్రవంతి సభ్యుల, శ్రేయోభిలాషుల మనోలోకాల స్థలకాలాదులను ప్రతిబింబించే దర్పణం ఈ ''సాగరహేల'' సంచిక. కవిత్వాన్ని ఇష్టపడే వారందరకూ ఈ పుస్తకం నచ్చుతుంది.

- బొల్లోజు బాబా

ఏనుగు నరసింహారెడ్డి
పేజీలు: 152
ప్రతులకు: 8978869183
వెల: రూ 100

 ఏనుగు నరసింహారెడ్డికి అక్షరాల కూర్పు తెలుసు. ఏ పదం ఎట్లా పలుకుతుందో పసిగట్టినవాడు. ప్రతీకలయినా, పదచిత్రాలయినా తెలిసి ప్రయోగిస్తాడు. పుస్తకం గూట్లో పదాలు తాల్చి అనుభవం అంటించి కవిత్వం వెలిగించాడు.

- డా|| నందిని సిధారెడ్డి

డా. ఎన్‌. గోపి
పేజీలు: 150
ప్రతులకు: 9391028496
వెల: రూ 150

 అక్కడ గాలి కదలికలు/ తుఫానుల్ని ఒడిలో దాచుకున్నట్టు/ కనిపించని ఇసుక/ కాస్త కాస్త జమగూడి/ ఓ పెద్ద కుప్పగా పెరుగుతున్నట్టు./ ../ అక్కడ గుండుసూది పడ్డా/ ఖణేల్‌మని చప్పుడౌతుంది./ క్షణం క్షణం ఉద్వేగానికి/ కొత్త నోళ్ళు మొలుచుకొస్తాయి.

       -  డా. ఎన్‌. గోపి

జయంతి పాపారావు
పేజీలు: 511
ప్రతులకు: 0891 - 2557961
వెల: రూ 900

ఈగ్రంథం ఒక చారిత్రక అధ్యయనం. సమాజం - చరిత్ర - సాహిత్యం - వీటిమధ్య సంబంధాలు ఏ విధంగా పరస్పరం ప్రభావితమౌతాయో, ఏ విధంగా సమాజ లక్ష్యాలకూ, నిర్మాణాలకూ ప్రజా ఉద్యమాలకూ దిశానిర్దేశం చేయటంలో ఉపకరిస్తాయో - ఆ క్రమాన్ని రీతిని ప్రమాణాలుగా తీసుకుని మన ఆధునిక తెలుగు కథా సాహిత్యాన్ని విశ్లేషించాను.

- జయంతి పాపారావు

చిత్తలూరి సత్యనారాయణ
పేజీలు: 224
ప్రతులకు: 8247432521
వెల: రూ 120

చిత్తలూరి శైలి, వ్యక్తీకరణ, ఊహ అన్నీ ఆయనవే. ఈ పదేళ్ళలో తనదయిన శైలినీ, వ్యక్తీకరణని సాధించాడు. మెరుపులు మెరుపులుగా మెరిసే కవిత్వం కాదు అతనిది. నిబ్బరంగా కథ చెబుతున్నట్టు సాగే శైలి యిది. పాఠకుణ్ణి క్రమక్రమంగా లోగొనే శక్తి ఈ కథన శైలికుంటుంది.

- కె. శివారెడ్డి

మల్లిపురం జగదీశ్‌
పేజీలు: 196
ప్రతులకు: 9440104737
వెల: రూ 150

ఈ కథలలో స్థానికత నిర్ధుష్టంగా వుంది. వస్తునిర్ధిష్టత వుంది. స్థానికత విశ్వజనీనతగా పరిణామం చెందే క్రమాన్ని ఈ కథలు సూచిస్తాయి. ఆదివాసీ ప్రజలను పాత్రలుగా మలచడంలో, ఆ ప్రజల సంబంధాలను ఆవిష్కరించడంలో రచయిత జాగ్రత్తగా వ్యవహరించారు. తాను అధ్యాపకుడు కావడం వల్లనేమో చాలా కథల్లో విద్యారంగ ప్రసక్తి వస్తుంది. ఉత్తరాంధ్ర ఆదివాసీ ప్రజల సంభాషణలు ఈ కథలలో ఆకర్షణీయమైన విషయం.

- రాచపాళెం చంద్రశేఖర రెడ్డి

డా|| ఎం. ప్రగతి
పేజీలు: 135
ప్రతులకు: 9440798008
వెల: రూ 100

స్త్రీల పనికి విలువ కట్టడం, వారిని అన్ని రకాల పెత్తనాల నుండి, భయాల నుండీ విముక్తి చేసి, వారి స్థితిగతులను అర్థం చేసుకుంటూ, సమాజంలోని అన్ని రంగాలలోనూ వారికి నిర్ణయాధికారం కల్పించి వారిని అన్ని విధాలుగా చైతన్యపరుస్తూ ముందుకు సాగాల్సిన అవసరాన్ని ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ పాఠకుడి ముందుకు తెస్తాయీ కథలు.

- వి. ప్రతిమ

డాక్టర్‌ కత్తి పద్మారావు
పేజీలు: 980
ప్రతులకు: 9849741695
వెల: రూ 1 000

విశిష్టనానీల కవిగా సోమేపల్లి వెంకటసుబ్బయ్య గారికి నేనివాళ కొత్తగా కితాబివ్వనక్కరలేదు. వచనకవితా సృజనలో కూడా ఆయనది ప్రత్యేకమైన గొంతు. స్వభావోక్తి రమ్యం ఆయన కవిత్వం. వాస్తవికత కూడా అందంగా వుంటుందనడానికి అది చక్కని ఉదాహరణ. అందమంటే అలంకారికత మాత్రమే కాదు. అంతర్‌ బహిర్‌ లోకాలను కలిపికుట్టే సూత్రం. ఆ సూత్రం పేర్లు ఆర్తి, ఆవేశం, భావుకత, వీటన్నింటి నైష్పత్తిక శక్తివల్ల కవిత్వం పఠిత హృదయాన్ని తాకుతుంది. అటువంటి కవిత్వమే ఈ సంపుటి నిండావుంది.

- డా|| ఎన్‌. గోపి

సోమేపల్లి వెంకటసుబ్బయ్య
పేజీలు: 56
ప్రతులకు:
వెల: రూ 60

విశిష్టనానీల కవిగా సోమేపల్లి వెంకటసుబ్బయ్య గారికి నేనివాళ కొత్తగా కితాబివ్వనక్కరలేదు. వచనకవితా సృజనలో కూడా ఆయనది ప్రత్యేకమైన గొంతు. స్వభావోక్తి రమ్యం ఆయన కవిత్వం. వాస్తవికత కూడా అందంగా వుంటుందనడానికి అది చక్కని ఉదాహరణ. అందమంటే అలంకారికత మాత్రమే కాదు. అంతర్‌ బహిర్‌ లోకాలను కలిపికుట్టే సూత్రం. ఆ సూత్రం పేర్లు ఆర్తి, ఆవేశం, భావుకత, వీటన్నింటి నైష్పత్తిక శక్తివల్ల కవిత్వం పఠిత హృదయాన్ని తాకుతుంది. అటువంటి కవిత్వమే ఈ సంపుటి నిండావుంది.

- డా|| ఎన్‌. గోపి

సంకలనం: డా|| తన్నీరు నాగేంద్ర
పేజీలు: 199
ప్రతులకు: 9949344032
వెల: రూ 150

రాచపాళెం సార్‌ గత ముప్పై ఏళ్లలో కనీసం 150 పుస్తకాలకు ముందుమాటలు వ్రాసినారు. అన్ని ప్రక్రియలకు చెందిన గ్రంథాలకు పీఠికలు వ్రాసినారు. 'వాటిని అన్నింటినీ కలిపి ఒకే పుస్తకంగా వేయాలంటే పెద్దది అవుతుంది. సాహిత్య విమర్శ, పరిశోధన గ్రంథాలకు వ్రాసిన పీఠికల్ని తీసుకో! పరిమితంగా ఉంటుంది' అని సార్‌ సూచించినారు. సరేనని ఈ పుస్తకాన్ని 45 పీఠికలతో ప్రచురించినాను.               

- డా|| తన్నీరు నాగేంద్ర

డా|| పి. విజయలక్ష్మి పండిట్‌
పేజీలు: 71
ప్రతులకు: 9347319751
వెల: రూ 50

'ఏకత్వ జ్ఞానం' 49 కవితాఖండికల సంపుటి. ఇందులోని కవితా ఖండికలు కవయిత్రిగారి భావుకతను మన కనుల ముందుంచుతాయి. కవితా ఖండికలు దేనికది విడివిడిగా చదివి ఆనందింపదగినవి. చక్కని శీర్షికలతో, చిక్కని భావజాలాన్ని అత్యంత సులభశైలిలో అభివ్యక్తీకరించారు రచయిత్రి. 

- ప్రొ|| రావినూతల సత్యనారాయణ

డా|| శాంతినారాయణ
పేజీలు: 165
ప్రతులకు: 9916671962
వెల: రూ 150

శాంతినారాయణ రాసిన ప్రతీకథా వర్తమాన భారతీయ సామాజిక వ్యవస్థ ముందు ఒక ప్రశ్నను నిలబెట్టుతుంది. వ్యవస్థను నిలదీసే రచనే ఆధునిక రచన. శాంతినారాయణ ప్రశ్నించే కథలు రాయడంలో సిద్ధహస్తుడు. ఈ సంపుటంలో శాంతినారాయణ తనను తాను కథా రచయితగా వర్తమానీకరించుకున్నారు.

- రాచపాళెం చంద్రశేఖర రెడ్డి

అగరం వసంత్‌
పేజీలు: 88
ప్రతులకు: 09488330209
వెల: రూ 100

ఈ సంపుటిలోని కవిత్వ శైలి గురించి రెండు మాటలు: రూప పరంగా క్లుప్తత ఈ కవితలకు మూలధాతువు. అది రెక్కలు నుంచి వచ్చినదే. సాంద్రత మరో గుణం. వానా కాలపు వాగుల ప్రవాహోధృతి ఈ కవితల్లో కనిపించదు. శరత్కాలపు నదిలా ప్రశాంత గంభీరంగా వుంటుంది. అలా మంచి కవిత్వానికి అవసరమైన గాఢతని సైతం చూడగలం.

- డా|| ఎ. కె. ప్రభాకర్‌

బమ్మిడి జగదీశ్వరరావు
పేజీలు: 290
ప్రతులకు: 9989265444
వెల: రూ 180
 
విస్తరిస్తున్న విషానికి విత్తు ఒక్కటే! అది ఈ రాజ్యం నాటింది! ఇదేమి రాజ్యం? ఇదేమి రాజ్యం? పోలీసు రాజ్యం.. తూటాల రాజ్యం... రాజ్యాన్ని ఏలేది హింస! హింసాయుధం! హింసలేని రాజ్యాన్ని ఊహించలేం!! రాజ్యం పెంచి పోషిస్తున్న హింస... ఉద్యోగాలలోంచి కుటుంబాలలోకి జొరపడుతూ ఇంటింటా విస్తరిస్తున్న పాదే ‘హింసపాదు’
`ప్రచురణకర్తలు
పలమనేరు బాలాజి
పేజీలు: 167
ప్రతులకు: 9440995010
వెల: రూ 100
అతను కథా వస్తువుల కోసం ఎక్కువ దూరం పోనవసరం లేకపోయింది. ఇంకా చెప్పాలంటే పలమనేరు పొలిమేరలే వదలలేదు. సమాజమంతటా కమ్ముకున్న ఈ పొగను పలమనేరు గాలిలోంచే పసిగట్టగలిగాడు. ఒక్క పలమనేరునే గ్రామాలన్నిటికీ సంకేతంగా మార్చగలిగాడు. 
 వాడ్రేవు వీరలక్ష్మీదేవి
డా॥సమ్మన్న
పేజీలు: 123
ప్రతులకు: 9247873162, 8466965401
వెల: రూ 100

తెలంగాణ ఏర్పడిన తరువాత ప్రప్రధమంగా ఖమ్మం జిల్లా సాహిత్యకారులను ఇంత మందిని పరిచయం చేస్తూ గ్రంధం రావడం సంతోషదాయకం. ఇది ఎంతో మంది సృజనకారులకు ప్రేరణగా, ప్రోత్సాహకంగా నిలుస్తుంది. ఇలాంటి పనులు ప్రభుత్వమే చేపట్టి చేయాల్సినివి.

డా॥ దిలావర్‌
పేజీలు: 152
ప్రతులకు: 9866923294, 7382552236
వెల: రూ 100

అటు విశాఖపట్నం, అరకులోయ నుండి ఇటు ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూరు వరకూ పర్యటించాను. ఇక గోదావరి లోయ ప్రాంతం... పాపికొండలు...చర్ల, సత్యనారాయణపురం, వెంకటాపురం వెళ్ళాను. చట్టి, చింతూరు, మోలె`సీలేరు ప్రాంతాలు కూడా చూశాను. అందువల్ల ఆయా ప్రాంతాల్లో అడవి బిడ్డలను దగ్గరగా గమనించే అవకాశం కలిగింది. ఇలా ఆదివాసీల మధ్య తిరిగిన అనుభవం నాచేత యీ కథలు రాయించింది.

జూకంటి జగన్నాథం
పేజీలు: 336
ప్రతులకు: 9440178095, 9440169896
వెల: రూ 100

మొదటి భాగం : రూ.200/`,రెండవ భాగం : రూ.300/`,మూడవ భాగం : రూ.150/` పేజీలు: 336అవునవును పొంగిన నా నెత్తురు చివర మొలిచిన చెమట బిందువు ` నడి ఎండల్లో కూలీలను అక్కున చేర్చుకొనే చిగురాకుల కానుగచెట్టు ` వానాకాలం ప్రారంభంలో దూరంగా కురిసిన వాన చినుకులకు భూమిలోంచి విరజిమ్మిన పరీమళ ద్రవ్యాలే నా కవిత్వం అర్థాలు పరమార్థాలు ` సమాజానికీ నాకూ మధ్య నా కవిత్వం ఒక యానకం.

గుండాల నరేంద్రబాబు
పేజీలు: 60
ప్రతులకు: 9493235992
వెల: రూ 50

ఈకవిత్వం మంచితనమే తప్ప మాయలేదు, హిపోక్రసీలేదు. పాండిత్య ప్రదర్శనలేదు. తన చుట్టూ జరుగుతున్న సంఘటనల పట్ల, తన బాల్యం, తన పల్లెటూరు, తను తన అనుభవాల పట్ల అతడి ప్రతిస్పందనే ఈ కవిత్వం. తెలియని విషయాలు జోలికో, అనవసర ఊహల్లోకో వెళ్ళకపోవటం ఈ కవికున్న మంచి లక్షణం.

డా॥శాంతినారాయణ
పేజీలు: 167
ప్రతులకు: 9391343916
వెల: రూ 100

ఈ కథలన్నీ ఇవాళ రావలసిన కథలే. భారతీయ కథానికా సాహిత్య సమూహంలో ఇవీభాగమే. అనంతపురం జిల్లా వంటి కరువు పీడిత ప్రాంతం నుండి ధర్మాగ్రహంతో ఒక కథకుడు ఈ కథలలో అనేక వ్యాఖ్యాలు చేశారు. అనేక విషయాలు ప్రస్తావించాడు. వాటిలో ఆగ్రహం, ఆవేదన గూడుకట్టుకొని ఉన్నాయి. అవి నిజాయితీ సిరాతో కథల రూపం పొందాయి.

రక్షిత సుమ
పేజీలు: 48
ప్రతులకు: ప్రముఖ పుస్తకాల షాపుల్లో
వెల: రూ 50

భవిష్యత్తును చూడగలిగిన కవే నిజమైన కవి. గత వర్తమానాలను పర్యవేక్షిస్తూ భవిష్యత్‌ పథాన్ని నిర్మించగల వారి, చూడగలిగిన వారి కవిత్వం నిలబడిపోతుంది. రక్షిత సుమలో అలాంటి లక్షణాలున్నాయి. ఈ చిన్న చిన్న అడుగులతో రేపు గొప్ప కవిత్వ ప్రయాణాన్ని సునాయాసంగా చేయగలదని నా నమ్మకం.

డాక్టర్‌ వాసా ప్రభావతి
పేజీలు: 139
ప్రతులకు: 9391343916‘‘
వెల: రూ 100

ఊరగాయజాడీ’’తో ప్రారంభమై ఈ కథానికా సంపుటి ‘నాకూ ఓ మనసుంది’తో ముగుస్తుంది. ఛాందస కుటుంబాల్ని మన కళ్ళ ముందుంచుతూనే, వాళ్ళలో విప్లవాత్మక భావాల్ని మెరిపించారు రచయిత్రి. ‘కొత్తవెలుగు’, ‘అనసూయ లేచిపోయింది’ లాంటి కథానికలు అందుకు నిదర్శనాలు. పెదాలమీద చిరునవ్వుని తాండవింపజేసే కథానికలు` ‘ఊరగాయజాడీ’, ‘కామాక్షీ`కాసులపేరు’ లాంటివి.

విహారి
పేజీలు: 166
ప్రతులకు: 93913439168106713351
వెల: రూ 100

వైవిధ్యాన్ని సంతరించుకున్న ఎన్నో కథానికల్ని చదివి గుండె పండిరచుకొని, ఎక్కువ సందర్భంలో గుండె మండిరచుకుని ` భావస్పందనతో, మోయలేని గుండె బరువుతో, అనిర్వచనీయమైన అనుద్వేగంతో, అపూర్వమైన ఆత్మీయ స్పర్శతో పరామర్శించాను, పరిచయం చేశాను! చిత్తగించండి.

ఎం.నాగకుమారి, ఎం.రామారావు
పేజీలు: 90
ప్రతులకు:
వెల: రూ 60

మామూలుగా ఒక్కో పత్రికలో ఒకటి లేక రెండు కధానికల్ని చదవగలం. కానీ సంకలనంలో బహుమతి పొందిన కథానికలన్నిటితో పాటు మరికొన్ని కథానికలను కూడా చదివే అవకాశాన్ని కల్పించిన సంకలనకర్తలు అభినందనీయులు. కథానికా ప్రియులకు ఈ సంకలనం తప్పకుండా మంచి విందేనని చెప్పగలం. రచయితలకు, సంకలనకర్తలకు, ‘కథాకేళి’ పత్రికకు నా శుభాకాంక్షలు.

డా॥ అప్పిరెడ్డి హరినాథరెడ్డి
పేజీలు: 160
ప్రతులకు: 9963917187 9912565856
వెల: రూ 150

నిజానికి వారితో నాకిప్పటికీ ముఖాముఖి పరిచయం లేదు. వారి రచనల ద్వారానే పరిచయం. అరుదైన శాసనాలు, తాళపత్ర గ్రంథాలు సేకరిస్తున్నారని తెలిసి సంతోషించాను. ఇప్పుడీ గ్రంథం అలనాటి ‘శ్రీ సాధన’, ‘కౌమోదకి’ పత్రికల నుండి సమాచారాన్ని సంగ్రహించి విలువైన సమాచారాన్ని వెలుగులోకి తెచ్చినందుకు అభినందిస్తున్నాను.

గీతిక కథలు
పేజీలు: 133
ప్రతులకు: 7702600583
వెల: రూ 140

పల్లె పట్టున బాల్యం దగ్గర నుండి వృద్ధాప్యపు చివరి దశవరకూ, అడవుల్లో బతికేవారికి జరుగుతున్న అమానుష అన్యాయంనుంచి ఉప్పుపంటలోని ఆర్థిక అన్యాయస్థాయి వరకూ, ఎన్నో వైవిధ్యమున్న వస్తువులు ఈ కథలకి ఆలంబన. రకరకాల జీవన తీర్పుల్ని, పలుకుబడుల్ని, కళ్ళముందు ఉంచుతాయి ఈ కథలు.

పత్తి సుమతి
పేజీలు: 16
ప్రతులకు: 8790499405
వెల: రూ 30

ఈ దేశ ప్రగతికి చిరకాలంగా ప్రజానీకంలోని పరస్పర ద్వేషభావనలే అవరోధంగా నిలుస్తున్నాయి. ఈ విషయాన్ని శ్రీమతి పత్తి సుమతిగారు ఈ చిన్న పుస్తకంలో స్పష్టంచేసారు. వివేకానందుని ఆలోచనా సరళిని ఆయన విశ్వమానవాళికి ఇచ్చిన సందేశ సారాంశాన్ని సరళ సుబోధకంగా అందించారు రచయిత్రి.

- సీతారాం
పేజీలు: 140
ప్రతులకు: 9866563519
వెల: రూ 100

విద్యావ్యవస్థకు పట్టిన మకిలి గురించి అద్భుతమైన వివరాలు తెలిపే మంచి మోనూలోకి మీరు వెళ్తున్నారు. టీచర్ల బాధ్యతారాహిత్యాన్ని సోదాహరణంగా వినిపించే విషయసూచికలోకి ప్రవేశిస్తున్నారు. విద్యార్థులు ఆదర్శ ప్రపంచంలోకి అడుగుపెట్టకుండా ఏఏ దుష్టశక్తులు అడ్డుకుంటున్నాయో విప్పిచెప్పే పదబంధాలలోకి మీరు వెళుతున్నారు.-  ప్రసేన్‌

యాకూబ్‌ కవిత్వం
పేజీలు: 154
ప్రతులకు: 98491 56588
వెల: రూ 100

తన తొలి కవితా సంపుటిలో ఈ కవి కేవలం గ్రామీణ యువకుడే. కానీ క్రమంగా హైదరాబాద్‌ జీవితంలో సముపార్జించుకున్న ఉత్తమ విలువల మధ్య ఒక ఉన్నతస్థాయి సమన్వయాన్ని సాధించాడనే చెప్పాలి. ఈ కవితా సంపుటి ఇందుకు అత్యుత్తమ దాఖలాగా నిలుస్తుంది.- సామిడి జగన్‌రెడ్డి

వకులాభరణం లలిత
పేజీలు: 120
ప్రతులకు: ప్రముఖ పుస్తక కేంద్రాల్లో
వెల: రూ 135

స్వాతంత్య్రానంతర భారతదేశంలో సంఘ సంస్కరణోద్యమానికి అవిరళకృషి చేసిన ప్రముఖ మహిళానేత. సంఘం విస్మృతులైన దళితులను, గిరిజనులను సంస్కరణోద్యమ అజెండాలో చేర్చి సమకాలీన భారత చరిత్రలో ఒక ప్రధాన మైలురాయిగా మిగిలారు.

మువ్వా శ్రీనివాసరావు
పేజీలు: 160
ప్రతులకు: 9948099900
వెల: రూ 150

ఒక బరువు ఎత్తుకోవడం... ఒక భారం దించేయడం ఏదైనా రీకాల్‌ వేల్యూ గొప్పది. ఈ విలువను ఆనవాళ్లుగా కాక సాక్ష్యాలుగా ఆల్ఫాబెటికల్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇస్తోన్న మలిపుస్తక కవి ఈతడు.. ఇదొక పాస్ట్‌ మోడ్రన్‌ ఎగ్జిస్టెన్షియలిజం. ఇదొక సంధిగ్దస్తిత్వ పునశ్చరణాశావాదం. ఇదొక నిన్నటి డిస్టర్బ్‌డ్‌ థాట్‌ రేపటి డిజైన్డ్‌ డ్రీమ్‌.-  ప్రసేన్‌

ప్రసాద మూర్తి
పేజీలు: 138
ప్రతులకు: 8499866699, 9705468149
వెల: రూ 100

ప్రసాదమూర్తి కవి. కవిత్వం రాసే వాళ్లందరూ కవులు కావాల్సిన అవసరం లేదు. కొంతమంది మాత్రమే కవులు, కవులుగా పుట్టి, కవులుగా జీవిస్తూ, కవిత్వాన్ని వెదజల్లుతూ బతుకుతుంటారు. అదిగో అలాంటి కవి ప్రసాదమూర్తి.-  కె.శివారెడ్డి

డా.యం.పి.మద్దులేటి రెడ్డి
పేజీలు: 108
ప్రతులకు: 08592-232404, 9440591520
వెల: రూ 40

సముద్రపుటడగున ఈ పుస్తకంలో బొమ్మలతో సేకరించు సాధనాల గురించి వివరించడంతో మొత్తంగా పాఠకులు సముద్రమంతా ఒక్కసారిగా కలియతిరిగినుట్లుగా ఉంటుంది. అందరు సముద్రంలో ఈదుకుంటూ వెళ్లి అంతర్భాగంలోని అలలను, నిక్షేపాలను దర్శించినుట్లుగా ఉండే ఈ పుస్తకం చరిత్రలో ఒక అత్యవసర పఠనీయ పుస్తకంగా మిగిపోతుంది.-  యస్‌.యండి. ఇనాయుతుల్లా

పిట్ట సాంబయ్య
పేజీలు: 61
ప్రతులకు: 9849674768
వెల: రూ 30

ఈ పదాల్లో లక్ష్యం-గమ్యం గుర్తెరిగిన చురుకుదనం అంతర్లీనంగా కనిపిస్తుంది. కుల-వర్ణ-వర్గమనే మూడు సర్పాలు వేసే ఒక్క విషపు కాటు, 'అణచివేత' గురించి కలిగిన జ్ఞానం ఉన్న కవితనం ఈ కవిలో కనిపిస్తుంది. కొవ్వొత్తినైనా వెలిగించుకొని ముందడుగు వేద్దాం రండన్న పిలుపు వినిపిస్తుంది. యుద్ధం అనివార్యం అన్న అవగాహన తెలుస్తుంది.- అనిశెట్టి రజిత

కేతవరపు రాజ్యశ్రీ
పేజీలు: 108
ప్రతులకు: 8500121990
వెల: రూ 80

అది పద్యమైనా గద్యమైనా హృద్యంగా రాసే శిల్పాన్ని సొంతం చేసుకున్న కవయిత్రి కేతవరపు రాజ్యశ్రీ. ఆధునిక సాహిత్యరంగంలో మంచి కవయిత్రిగా తన స్థానాన్ని పదిలపరచుకున్న రాజ్యశ్రీ లేఖిని నుండి వెలువడిన సరికొత్త కవితా సంపుటి, ''ఆకాసాన్ని మింగాలని''.- డా|| తిరునగరి  

పున్నమి
పేజీలు: 66
ప్రతులకు: 9396610639
వెల: రూ 50

గత పన్నెండేళ్ళుగా జిల్లా కేంద్రంలో సాహితీమేఖల సంస్థ ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలు ఘనంగా జరుగుతున్న విషయం పాఠకులకు విధితమే. అలాగే ఈ జయనామ ఉగాది పర్వదినం సందర్భంగా ఉగాది ప్రత్యేక సంచికను వెలువరిస్తున్నాము.- పున్నమి

బండి సత్యనారాయణ
పేజీలు: 102
ప్రతులకు: 040 - 27678430
వెల: రూ 60

దృకథమేదయినా - తాత్వికత ఏదయినా - వస్తువును కవిత్వం చేసే విధానం తెలియకపోతే శుద్ధ వచనం మిగుల్తుంది. దృష్టంతా తీసుకున్న వస్తువు కవిత్వమవ్వాలి. ఆ దిశగా తన్నుతాను నిర్మించుకుంటూ - విస్తృతపరుచుకుంటూ, విశాలం చేసుకుంటూ వస్తున్నాడు. ఒక కవితా సంపుటికి మరొక కవితా సంపుటికి, స్పందనా గుణం - గణనీయంగా పెరిగింది.- శివారెడ్డి

డా|| పి రమేష్‌ నారాయణ
పేజీలు: 132
ప్రతులకు: 9985171411
వెల: రూ 100

రమేష్‌ నారాయణగారి అనువాదాన్ని నేను సంపూర్ణంగా చదివాను. ఆంగ్లభాషాచార్యులు ఏమంటారో నాకు తెలియదుగాని, తెలుగుభాషా విద్యార్థిగా నేను ఈ అనువాదాన్ని చదివి సంతృప్తి చెందాను. రాధేయ 'మగ్గంబతుకు' కావ్యాన్ని సామాన్య పాఠకుడిని దృష్టిలో పెట్టుకొని, ఉద్యమస్ఫూర్తితో, భావుకతకు పరిమిత ప్రాధాన్యమిచ్చి, అట్లని అది వచనమై తేలిపోకుండా జాగ్రత్తగా రచించారు.-  ఆచార్య రాచపాళెం చంథ్రేఖర రెడ్డి

అడపా రామకృష్ణ
పేజీలు: 40
ప్రతులకు: 0891-2540848
వెల:

ఈ దీర్ఘ కవిత చదివి ముగించిన తర్వాత, ఈనాడు మనం టీవీలద్వారా, వార్తా పత్రికల ద్వారా తెలుసుకుని, ఆవేదన పొందుతున్న అన్ని అవినీతి అంశాలూ ఒక్క రూపంతో వాస్తవికతా దృక్పథంతో మన కళ్ళముందు కనిపిస్తై, కవి తన భావోద్వేగంలో ఒక బలమైన ముద్ర వేస్తూ ముగింపు చేస్తారు.- డా|| అద్దేపల్లి రామమోహనరావు

కె.సుభాషిని, డా|| కె.నళిని అనిశెట్టి రజిత, శివలక్ష్మి, కొండేపూడి నిర్మల
పేజీలు: 132
ప్రతులకు: 9440254730
వెల: రూ 80

దేశమంతటా అత్యాచార బాధితుల హాహాకారాలు అగ్నికీలలై లేస్తుండగా, సమాజాన్ని అభద్రతకూ, భయభీతులకూ, అమానవీయతకూ కేంద్రం చేస్తూ ఉన్మాదాలు జాడ్యంలా వ్యాపిస్తున్న సమయమిది. శతాబ్ది మహిళకు శతవందనాలు అర్పిస్తున్న ప్రపంచాన్ని సహజ నాయిక స్త్రీ ఏలికగా పగ్గాలు పట్టి కాలంతో సమానంగా పరిగెత్తించాలి. అదే ఈ పుస్తకం ఇస్తున్న పిలుపు.

డా || ద్వా.నా.శాస్త్రి
పేజీలు: 134
ప్రతులకు: 9849293376
వెల: రూ 100

మొత్తం పన్నెండు భాషా సాహిత్యాంశాలపై పన్నెండు గంటలు ఏకధాటిగా ప్రసంగించాను. ఇంతవరకు సాహిత్యంలో ఇలా - పుస్తకం లేకుండా, కనీసం కాగితాలు కూడా లేకుండా ఇంతసేపు మాట్లాడిన దాఖలాలు లేవు.


పేజీలు: 678
ప్రతులకు: 9849083137
వెల: రూ 250

ఇందులో భాగంగానే 2012 జనవరిలో 'మహూదయం' 2013 జనవరిలో 'కె.వి.ఆర్‌. సాహిత్య వ్యాసాలు - మొదటి భాగం' అచ్చయ్యాయి. ఇప్పుడు సాహిత్య వ్యాసాలు రెండు, మూడు భాగాల్ని ప్రచురించాం.

డా || ద్వా.నా.శాస్త్రి
పేజీలు: 38
ప్రతులకు: 8500121990
వెల: రూ 50

శ్రీశ్రీ ప్రయోగించిన అనేక పదాలకు, పద బంధాలకున్న నైఘంటికార్థాలను వివరిస్తూనే, కవి  నిర్దేశిస్తున్న నిర్దిష్ట అర్థాలను కూడా ద్వానాశాస్త్రిఈ గంథ్రంలో వివరించారు.


పేజీలు: 598
ప్రతులకు: 9849083137
వెల: రూ 250

 ఇందులో భాగంగానే 2012 జనవరిలో 'మహూదయం' 2013 జనవరిలో 'కె.వి.ఆర్‌. సాహిత్య వ్యాసాలు - మొదటి భాగం' అచ్చయ్యాయి. ఇప్పుడు సాహిత్య వ్యాసాలు రెండు, మూడు భాగాల్ని ప్రచురించాం. - కె.వి.ఆర్‌. శారదాంబ స్మారక కమిటీ

డా|| కాసల నాగభూషణం
పేజీలు: 31
ప్రతులకు: 09444452344
వెల: రూ 30

ఆనాటి కాలమాన పరిస్థితుల కనుగుణంగా సుమతి శతకం వచ్చింది. అందులోని కొన్ని భావాలకు నేడు కాలం చెల్లింది. ఈనాటి కాలమాన పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఆనాటి సుమతి శతక పద్యాల రచనా విన్యాసాన్ని అందిపుచ్చుకొని నాగభూషణం గారు అనుసృజనాత్మక రచన చేశారు.- ఆచార్య వెలుదండ నిత్యానందరావు

ఆచార్య మసన చెన్నప్ప
పేజీలు: 77
ప్రతులకు: 9885654381
వెల: రూ 80

అక్షరంలో పరిమళం ఉంటుందని అతికొద్ది మంది విద్వాంసులకు మాత్రమే తెలుసు. ఆచార్య మసన చెన్నప్ప గారు విద్వాంసులు. వారికి ఆ పరిమళం తెలుసుననడంలో సంశయం లేదు. వారు చాలా గ్రంథాలు రాశారు. వారికి అక్షరపు పరిమళం తెలియును.- డాక్టర్‌ దాశరథి రంగాచార్య

డా|| కాసుల లింగారెడ్డి
పేజీలు: 112
ప్రతులకు: 8897811844
వెల: రూ 100

వచన కవిత్వం మొదట్లో శబ్దాలంకారాలతో, ఉపమాలంకారాలతో, రూపకాలంకారాలతో వెలువడుతూ వచ్చింది. వచన కవిత్వం రూపం పూర్తిగా మారిపోయిందనే గుర్తింపు చాలా మందికి తెలియడం లేదు. కేవలం చెవికి ఇంపుగా తోచే అలంకారాల నుంచి వచన కవిత్వం దూరమై సంపూర్ణమైన వచన కవిత రూపుదిద్దుకుంది. లింగారెడ్డి 'ఇడుపు  కాయితం' లోని స్వీయానుభూతులకు సంబంధించిన కవితలు ఈ స్థాయిని అందుకున్నాయి.- కాసుల ప్రతాపరెడ్డి

కరణం బాలసుబ్రహ ్మణ్యం పిళ్ళె
పేజీలు: 273
ప్రతులకు: 9502304027
వెల: రూ 180

దాదాపు రెండు వందల సంవత్సరాల కాల వ్యవధిలోనే ఆవిర్భవించి, విస్తరించి, అభివృద్ధి పొంది, ఒక వెలుగు వెలిగి కేవలం ఒకరోజులో మాత్రమే జరిగిన యుద్ధంలో సమూలంగా నేలమట్టమయిపోయి తిరిగి కోలుకోలేని విధంగా అంతరించిపోయిన బోయకొట్టముల విషాదగాధనే బాలసుబ్రహ్మణ్యం పిళ్ళె ఈ నవలలో చారిత్రక దృష్టితో చిత్రించడం ఎంతో ఆసక్తికరంగా ఉంది.- అంపశయ్య నవీన్‌

మడిపల్లి భద్రయ్య
పేజీలు: 206
ప్రతులకు: 9885830550
వెల: రూ 90

మడిపల్లి భద్రయ్య గారి జీవితానికి ఈ పుస్తకం ప్రతిబింబం లాంటిది. ఇతని మానవీయ విలువలకు నమూనా వంటిది. తన అనుభవాలతో పాటు, ఆదిలాబాద్‌ జనజీవితాన్ని కవిత్వమయం చేశాడు. తన యాస, భాష, తాను పుట్టిపెరిగిన గడ్డపై మమకారాన్ని వ్యక్తం చేశారిందులో.- డా|| ఉదారి నారాయణ

బి. గీతిక
పేజీలు: 48
ప్రతులకు: 7702600583
వెల: రూ 50

కలం కదులుతోంది/ కాగితం మీద./ ఏ కాంతి లోకాలకు/ దారులు తీస్తుందో...!        నీడలు/ అందంగానే ఉన్నాయి./ ఎలాగున్నాయో.. / వాటివెనుక నిజాలు..!        పిట్టలకి/ రెక్కలొచ్చాయి./ పుట్టిన గూటిని/ వదిలెయ్యడమే స్వేచ్ఛా..?-బి. గీతిక

రాణీ పులోమజాదేవి
పేజీలు: 194
ప్రతులకు: 9949384891
వెల:

ఈ కథా సంకలనం కాలక్షేపం బఠానీ కాదు - కాలానుగుణంగా ఎన్నో మార్పులు మానవజీవితాల్లో చోటుచేసుకున్నా, మౌలిక బంధాలకు ప్రాముఖ్యతనిస్తూ, ఛాదస్తాలకు అతీతంగా, సాధారణ సమస్యలకు పరిష్కారాన్ని ఆలోచింపజేసే, ''అవునా? మనమూ ఇంతేనా?'' అనే ప్రశ్నలను మనకు మనం వేసుకుని, క్లిష్టమైన సమస్యలను వీలైనంత సరళ సమీకరణంగా మార్చుకునే ప్రయత్నం చేయించే ప్రయత్నం.- ఎస్‌.పి. బాలసుబ్రహ్మణ్యం

పి. లక్ష్మణరావ్‌
పేజీలు: 120
ప్రతులకు: 9441215989
వెల: రూ 25

విషయ స్పష్టత ఉంది. లక్ష్య స్పష్టత ఉంది. ఇది దీర్ఘకాలిక సాధన అని తెలుసు. ఆయన ఏ ప్రక్రియలో రాసినా ఈ తెలివి, ఈ తర్కం, సామాజిక చర్య, ప్రతిచర్య కన్పడుతూనే ఉంటుంది. అటు జీవితంలోను, ఇటు కవితా సాధనలోను ఒక థకు వచ్చారు... పరిణతికి వచ్చారు.- శివారెడ్డి

దేవినేని మధుసూదనరావు
పేజీలు: 32
ప్రతులకు: 0866-2862424
వెల: రూ 11

కాబోయే పట్టభద్రులు ఈ పుస్తకంలోని అంశాలను మొదటి సంవత్సరం నుండే చదివి వాటిమీద అవగాహన పెంచుకున్నట్లయితే, వారు తేలికగా ఉద్యోగం సంపాదించటమే కాక, వారికి, వారి కుటుంబాలకు, సమాజానికి ఉపయోగపడగలరనే అభిప్రాయంతో ఈ చిరుపుస్తకాన్ని ముద్రించాం.- దేవినేని మధుసూదనరావు  

చక్రపాణి నరసింహమూర్తి
పేజీలు: 82
ప్రతులకు: 9440141745
వెల: రూ 0

వీరు పద్యము చెప్పుటలోనూ, గేయాన్ని మడతలు విప్పుటలోనూ సిద్ధహస్తులైనా, తొలికృతిని వర్తమాన ప్రక్రియ ఐన వచన కవిత్వంగా ఆవిష్కరిస్తున్నందుకు ఆనందిస్తున్నాను. మూర్తిగారిలోని వర్తమాన సామాజిక సాహితీ సమదృష్టిని, వచనాన్ని ప్రవచనాన్ని ప్రవచనంగా సులభ సుందరంగా చెప్పిన ఈ కవిగారి కావ్య సృష్టిని, కళారస దృష్టినీ మనస్పూర్తిగా అభినందిస్తున్నాను.- వి.పి. చందన్‌ రావు

కోడం పవన్‌కుమార్‌
పేజీలు: 109
ప్రతులకు: 9848992825
వెల: రూ 70

తన అక్షరాలకు పదునుపెట్టి, వాటినే తన రక్షణ కవచాలుగా చేసుకుని ఏకలవ్యుడిలా, అభిమన్యుడిలా ఏకకాలంలో ముందుకు సాగిపోతాడు. ఈ ఉద్యమంలో తాను వర్గవాదా, అస్తిత్వవాదా అనే యోచన చేయడు. సంక్షోభాల్ని ముందు బట్టబయలు చేస్తాడు. అందుకు తన పాఠకుల మద్దతు కోరుతాడు. తన అనుభవాన్ని వాళ్ళదిగా చేసి తనవైపు తిప్పుకుంటాడు.- ప్రొ. జయధీర్‌ తిరుమలరావు 

జనసాహితి
పేజీలు: 311
ప్రతులకు: 08592-232404, 9440591520
వెల: రూ 120

సామ్రాజ్యవాదులకూ, దోపిడీవర్గాల ఏజంట్లకూ, పచ్చి అవినీతిపరులకూ నరహంతక రాజకీయులకు కూడా గాంధీ బొమ్మ ఆత్మరక్షణ కవచంగా ఉపయోగపడుతోంది. రాజకీయ విలవలు కుప్పకూలిపోయిన నేటి పరిస్థితులకు గాంధీవాదాన్ని ప్రత్యామ్నాయ ఆదర్శంగా ప్రదర్శనకు నిలిపేవారికి జవాబుగా ఈ పుస్తకం కొంతయినా తొడ్పడవచ్చు.-  జనసాహితి

రాచమళ్ళ ఉపేందర్‌
పేజీలు: 84
ప్రతులకు: 98492 77968
వెల: రూ 45

  కథా శిల్పం గురించిన అధ్యయన శీలం కలిగిన రచయిత ఉపేందర్‌. కనుక, వస్తువు, ఇతివృత్తం... చదువరులలో గాఢమైన అనుభూతిని కలిగించటానికి ఆవశ్యకమైన శిల్పాన్ని ఎన్నుకోవటం ఆయనకు పట్టుబడిన విద్యే! ఆ గుణ నైపుణ్యమే ఈ కథల్లోను కనిపిస్తున్నది. ప్రత్యేకించి ప్రక్రియాపరంగా అచ్చమైన 'కథానిక' ని రాస్తున్నప్పుడు ఈ గుణ విశేషం మరీ కొట్టవచ్చినట్లు ద్యోతకమవుతోంది.- విహారి

పారుపల్లి వెంకటేశ్వరరావు
పేజీలు: 172
ప్రతులకు: 9848161208
వెల: రూ 180

కొన్ని యధార్థ ఘటనల్ని, కొందరు వ్యక్తుల ఆదర్శ జీవన విధానాల్ని ఆధారంగా తీసుకొని, ఔచిత్యానికి భంగం కాకుండా అసహజమైన అతిశయోక్తులు లేకుండా, కొన్ని సన్నివేశాల్ని స్వయంగా కల్పించి, మిశ్రకథగా సుజలాం సుఫలాం నవల రచించాను.- పారుపల్లి వెంకటేశ్వరరావు

- డా|| అప్పిరెడ్డి హరినాథ్‌ రెడ్డి
పేజీలు: 264
ప్రతులకు: 9963917187
వెల: రూ 200

హరినాథరెడ్డి గ్రంధం ఒక బాధ్యతను, ఒక కర్తవ్యాన్ని నేటి పరిశోధ కుల ముందుంచుతున్నది. రాయలసీమ నుంచి వచ్చిన ప్రతికలనన్నిటినీ సంపాదించి, వాటిలో వచ్చిన సాహిత్యాన్ని అధ్యయనం చేసి సాహితీ సాంస్కృతిక రంగంలో రాయలసీమ ముందు వెనుకడుగులను నిర్ణయించడమే ఆ కర్తవ్యం, ఆ బాధ్యత.- ఆచార్య రాచపాళెం చంథ్రేఖర్‌ రెడ్డి

అభినందన సంచిక
పేజీలు: 178
ప్రతులకు: 9985171411
వెల: రూ 250

'కనురెప్పల మీద వాలిన నమ్మకమైన కల'గా కవిత్వంతో మమేకమైన 58 ఏళ్ల జీవితంలో 31 సంవత్సరాల అధ్యాపకవృత్తి నిబద్ధత, మూడున్నర థాబ్ద్దాల కవిత్వ నేపథ్యం, రెండున్నర థాబ్దాల అవార్డు చరిత్ర రాధేయ సొంతం. అందుకే ఈ అభినందన సంచికాసుమాహారం.- వి.చంథ్రేఖర్‌ శాస్త్రి

జూపాక సుభద్ర
పేజీలు: 120
ప్రతులకు: 9441091305, 994831167
వెల: రూ 120

తెిలంగాణా దళిత స్త్రీల శ్రమ జీవితాలను, అణచివేతలపై వారి ప్రతిఘటనలను, న్యాయం, సహోదరత్వం సమానత్వాల కోసం వారు చేస్తున్న పోరాటాలను జీవంతో నడుస్తున్న బొమ్మలుగా రచయిత్రి ఈ కథల్లో ఆవిష్కరించిన తీరు అభినందించదగినది.- కన్వీనర్‌, దండోరా ప్రచురణలు

తిరుక్కోవెల భాస్కర్‌
పేజీలు: 42
ప్రతులకు: 8008958142
వెల: రూ 50

''పుస్తకంలోని/అక్షరాలు/ప్రమిదల్లోని దీపాల్లా/ ఉన్నాయి'' - అక్షరాలు పదాలలో ఒదిగి : పదాలు వాక్యాలుగా ఎదిగి జ్ఞానాన్ని వేదకాలం నుండి ఈనాటి వరకూ ప్రసరిస్తూనే ఉన్నాయి. జ్ఞానమంటే వెలుగే, వెలుగంటే జ్ఞానమే, కనుక, అక్షరాన్ని దీపంతో పోల్చడం సమున్నత భావ ఆవిష్కరణకు మంచి నిదర్శనం-  సుద్దాల అశోక్‌ తేజ.

- కె. విల్సన్‌రావు, కె. ఆంజనేయకుమార్‌
పేజీలు: 120
ప్రతులకు: 8297285514
వెల: రూ 75

జూన్‌ 2 అనే చారిత్రక దినానికి సాకక్షులుగా మేం కవిత్వాన్ని వెలువరిస్తున్నాం. తెలుగు ప్రజల పక్షాన మేం కవిత్వం ద్వారా నిలబడాలనుకున్నాం. రెండు ప్రాంతాల ప్రజలు చేసిన పోరాటాల పక్షాన వారి న్యాయమైన ఆకాంక్షల పట్ల గౌరవాన్ని కలిగి ఉంటూనే మా లోపల కొనసాగుతున్న అలజడికి ఓ వ్యక్తీకరణగా జూన్‌ 2ను ఎంచుకున్నాం.- కె. విల్సన్‌రావు- కె. ఆంజనేయకుమార్‌

- డా|| లంకా వెంకటేశ్వర్లు
పేజీలు: 240
ప్రతులకు: 040-27678430
వెల: రూ 150

ఇంగ్లీషువారు వచ్చిన తర్వాత గ్రామీణ వ్యవస్థ చిందరవందర అయింది. వృత్తి కులాలన్నీ విధ్వంసం కావడం ప్రారంభమైంది. ప్రపంచీకరణలో అదివరకెప్పుడూ లేనంతగా కులవృత్తుల నాశనం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ప్రాచీన కులవృత్తి వివరాలన్నీ చూస్తే, పరిణామ చరిత్ర బాగా అవగాహన చేసుకోగలం. నిజానికి పై సూత్రీకరణయే ఈ పరిశోధన మొత్తానికి ఏకసూత్రంగా నిలిచే అంశం.- డా|| అద్దేపల్లి రామమోహనరావు

దేవినేని సీతారావమ్మ ఫౌండేషన్‌
పేజీలు: 22
ప్రతులకు: 0866-2862424
వెల: రూ 11

తెలుగు పద్యంలో ఇంతటి దివ్యశక్తి దాగి ఉంది. పిల్లల్ని ఆలోచింపజేసే, ప్రశ్నించే, ఆకర్షించే, ఉర్రూతలూపే సూక్తులు, సామెతలు, పొడుపుకథల్ని కూడా ఇందులో పొందుపరిచాం. పిల్లలకు మిఠాయిపొట్లం ఈ పుస్తకం.- జయశ్రీ దేవినేని

- బి.ఎస్‌.ఎం.కుమార్‌
పేజీలు: 170
ప్రతులకు: 975085143
వెల: రూ 100

  ఈ కవిది  ఒక అసాధారణమైన మార్గం. ఈ వరకే తెలుగు సాహిత్యంలో వచ్చిన 'మో' లాంటి అనేకమంది కవులకంటే కూడా విభిన్న కవిత్వం. ఈ కవి ఇంకా రాస్తూనే ఉండాలి. రాస్తూ రాస్తూ అతని దుఃఖపు రవ్వల జడిలోని కాంతితో సమాజాన్ని తడుపుతూనే ఉండాలి.- డా|| కాంచనపల్లి

- సిద్దెంకి యాదగిరి
పేజీలు: 136
ప్రతులకు: 9441244773
వెల: రూ 80

అన్ని చలనాల చైతన్యం పొదుగుకున్న కవి సిద్దెంకి యాదగిరి. రాబోయే కాలంలో మరింత బాధ్యతగా, మరింత శక్తివంతంగా అక్షరాలు సంధించగలడని సంపూర్ణ విశ్వాసం కలిగిస్తున్నడు. మానవ వనంలో అలజడి దర్శించడం తెలుసు. ఒత్తిడిని తట్టుకొని అవమానాల్ని గెలవగల స్థిర సంకల్పం తెలుసు. రాలిన తారల కాంతితో, వేల ఇంద్రధనుస్సులు వెలిగించే ఉద్యమం గుర్తు. అక్షర కణాల్ని పిడికిట్లో బంధించి భూమ్మీద వెదజల్లే కవిత్వం గుర్తు.  - నందిని సిధారెడ్డి

- మొయిద శ్రీనివాసరావు
పేజీలు: 95
ప్రతులకు: 9908256267
వెల: రూ 50

ఏముందిందులో అనిపించే కవిత్వం ఎందరో రాస్తుంటారు. ఏదో... వుందిందులో... అని ఆలోచింపజేసే కవిత్వం రాయగలిగేది మాత్రం కొందరే. ఆ కొందరిలో ఈ కవి చోటు చేసుకోగలడనిపిస్తుంది ఈ కవితలు చదివితే. అందరూ చూడలేని భిన్న కోణాలను తాను దర్శించి మనముందు ప్రత్యేకంగా నిలుస్తాడీ కవి.- గంటేడ గౌరునాయుడు

- శేషేంద్ర
పేజీలు: 108
ప్రతులకు: 7702964402
వెల: రూ 100

ఎంత ప్రాచీన భాషలోనైనా ఎంత ప్రాచీన ఛందస్సులోనైనా అత్యంత ఆధునికతని అత్యంత నవ్యమైన సృజన శక్తిని కవి చూపవచ్చు అని చెప్పడానికి ఋతు ఘోష కావ్యం మంచి ఉదాహరణ. నేటికవులు దీన్ని చదవాలి. శ్రద్ధగా చదవాలి.- ఆచార్య పులికొండ సుబ్బాచారి

దాసోజు కృష్ణమాచారి
పేజీలు: 111
ప్రతులకు: 9989198943
వెల: రూ 150

ఈ పుస్తకంలో 70 కవితలున్నాయి. ఈ కవితల్లో కుల అస్తిత్వాన్ని గురించి ఎక్కువ ఉన్నాయి. తెలంగాణ గురించి కొన్ని కవితలు, స్త్రీవాదం గురించి కొన్ని ఉన్నాయి. చాలా రకాలు ఉన్నాయి. అయితే కవిత్వంలోని సాంద్రత, శిల్పం, శైలి గురించి నేను చర్చించను. ఎందుకంటే నేను మంత్రసాని పని చేశాను. ప్రాణం నిలబడితే చాలు, శిశువు రంగు లింగం వికలాంగమా సకలాంగమా ఆలోచించను. ఒక ప్రాణి నిలబడితే తరువాత ఆ ప్రాణి ఏ పని చేస్తుందో ఆలోచించవచ్చు అనుకున్నాను.- జ్వలిత

- సలీం
పేజీలు: 94
ప్రతులకు: ప్రముఖ పుస్తకాల షాపుల్లో
వెల: రూ 50

ఆకాశం నిలువెత్తు మోసంగాక/ మరేమిటి?/ నెత్తిమీద నీలి గుడారంలా బడాయి/ తీరా తాకి చూస్తే/ వేళ్ళకంటుకునే/ అనంత శూన్యం/ చంద్రుడూ అంతే/ పండిన మామిడి పండులా/ మబ్బుల కొమ్మల చివర్ల/ వేలాడుతుంటాడా/ కోసుకోబోతేనే/ కినిసి అంబరానికి అతుకైపోతాడు/.../- సలీం

డా|| బద్దిపూడి జయరావు
పేజీలు: 112
ప్రతులకు: 99490 65296
వెల: రూ 75

జయరావు కవిత్వంలో ఒక తీవ్రతుంది. ఆయన గుండెల్లో అగ్నిమంటలున్నాయి. మెదడులో అణువిస్ఫోటనాలున్నాయి. మాటలో సత్యనిగళత్వం ఉంది. ఈ మూడు ఆయన కవితకి ప్రవాహశీలతను తెచ్చాయి. కవిత్వంలో పర్సానిఫికేషన్‌ తగ్గించాడు. సోషలైజేషన్‌ బాగా విస్తృతం చేశాడు. చారిత్రక స్పృహను కూడా పెంచాడు.- డా|| కత్తి పద్మారావు

సంపాదకులు: పెన్నా శివరామకృష్ణ, గుడిపాటి
పేజీలు: 500
ప్రతులకు: 040-23244088
వెల: రూ 40

వారి ముందుమాటలు చదివినప్పుడు ఇంతటి అద్భుత వచనం ఎలా రాయగలుగుతున్నారనిపించేది. కానీ శివారెడ్డిలోని గొప్ప కవిని గురించే తప్ప వారిలోని సృజనాత్మకమైన వచన రచయిత గురించి ఎవరూ పెద్దగా మాట్లాడిన దాఖలాలు లేవు. అంతేగాక భిన్నకాలాల్లో వారు రాసిన ముందుమాటలు వారి వచన శైలినే గాక, ఆయా కాలాల సామాజిక, సాహిత్యచరిత్రని రికార్డు చేసే విలక్షణ సంపద కదా అనిపించింది.-  గుడిపాటి

- బా రహమతుల్లా కథలు
పేజీలు: 218
ప్రతులకు: 9490806022
వెల: రూ 100

అల్ప సంఖ్యాక వర్గంగా సమాజం చివరి అంచులకు నెట్టబడిన ముస్లిం మత మానవ సమూహాల జీవన అస్తిత్వ వేదనలను కథలుగా మలుస్తూ తెలుగు కథా సాహిత్యానికి వస్తుగౌరవం పెంచుతున్న నేటి రచయిత రహమతుల్లా. రహమతుల్లా కథల ప్రత్యేకతను, విశిష్టతను తెలియచెప్పే ఒక ప్రతినిధి కథ 'నర్గిస్‌'.- కాత్యాయనీ విద్మహే

- శైలజామిత్ర
పేజీలు: 151
ప్రతులకు: 9290900879
వెల: రూ 100

ఆత్మాశ్రయ అస్తిత్వ వేదన, సామాజిక అస్తిత్వ సంవేదన, సమ్మిళితంగా కొనసాగుతూ, అభివ్యక్తిలో సాంద్రమైన భావచిత్ర రచనకూ, శైలిలో సౌందర్యవంతమైన లయకూ ప్రాధాన్యమిచ్చే శైలజామిత్ర 'రాతిచిగుళ్ళు' మంచి స్థాయి కల కవిత్వంతో నిండి ఉంది. ఏది చెప్పినా, వచనత్వాన్ని వదిలి కవితాత్మకంగా చెప్పాలనే ప్రయత్నం అభినందనీయం.- డా|| అద్దేపల్లి రామమోహనరావు

- అక్కినేని కుటుంబరావు
పేజీలు: 221
ప్రతులకు: ప్రముఖ పుస్తకాల షాపుల్లో
వెల: రూ 100

కుటుంబరావుగారు మంచి సినిమాలు తీశారు. ఆ మాధ్యమం పట్ల ఆయనకి గాఢమైన ఆసక్తి ఉంది. అందుకే ఆ దృశ్య విభజన, దృశ్యమాలిక మనకి ప్రత్యక్షమై దోనెలో కూచుని కొల్లేటిలో తిరుగుతున్న అనుభూతిని కలగచేస్తున్నాయి. మంచి సినిమా చూసిన కొన్ని రోజుల వరకూ ఆ దృశ్యాలు మనలోనే ఉంటాయి. ఈ నవల ముగించిన కొన్ని రోజుల వరకూ కొల్లేటి దృశ్యాలు మనసుని కమ్ముకుంటాయి. కమ్ముకోవడం ఎందుకంటే కొల్లేరు ఒక జీవావరణ, జీవన, పాలనాపరమైన విషాదం ఇప్పుడు.- తల్లావఝల పతంజలి శాస్త్రి

- చలపాక ప్రకాష్‌
పేజీలు: 55
ప్రతులకు: 9247475975
వెల: రూ 40

ఈ చిరు గ్రంథంలో కొన్ని కార్టూనులను సమాజానికి అర్పిస్తున్నాడు. అవి నవ్వించడమే కాదు, ఆలోచింపజేస్తున్నాయి. సమాజంలోని చెడుగులను కడిగేస్తున్నాయి. రోగులకు తియ్యటి మందుతో చికిత్స చేస్తుంటాయి. సమాజంలోని అలవాట్లను, ఆలోచనలను శుద్ధి చేస్తున్నాడు. చలపాక సామాజిక వైద్యుడు.- టీ.వీ.

- విద్వాన్‌ చొప్ప వీరభద్రప్ప
పేజీలు: 262
ప్రతులకు: 9492450984
వెల: రూ 150

ప్రతి పాఠశాలలో ఉండాల్సిన పుస్తకమిది. పాఠశాలల్లో వారానికి ఒకటీ రెండు పీరియడ్స్‌ అయినా కథల కోసం కేటాయించాలి. ఆ సమయంలో ఈ కథల్ని వినిపించాలి. చదివించాలి. చిన్నతనంలో మోసం, ద్వేషం ఎరగని పిల్లలు, భవిష్యత్తులో కూడా చక్కగా, బుద్ధిగా మెలగాలంటే ఇలాంటి కథలు ఎంతగానో ఉపయోగపడతాయి.- గుడిపాటి

- సమ్మెట ఉమాదేవి
పేజీలు: 190
ప్రతులకు: 9849406722
వెల: రూ 150

తనదైన వ్యక్తిత్వంగల ఉమాదేవి కథలన్నింటిలో స్త్రీ మూర్తులే కథా నాయికలు. వాళ్ళు స్వాభిమానం, ఆత్మ నిబ్బరత, తనదైనా వ్యక్తిత్వం, అభిప్రాయాలు కలిగిన వాళ్ళు. ఒకరి చేతిలో నలిగేవాళ్ళు కారు. ఒకరి పంచన దీనంగా బతికేవాళ్ళు కారు. ఒకరికి భావదాస్యం చేసేవాళ్ళు కారు. అంత బలంగా స్త్రీ పాత్రలను చిత్రించి సమాజంలో స్త్రీలు ఈ విధంగా ఉండాలని ఉమాదేవి తన కథలలో ప్రబోధించింది.- ముదిగంటి సుజాతారెడ్డి

- భూతం ముత్యాలు
పేజీలు: 120
ప్రతులకు: 9490437978
వెల: రూ 75

తను, తన చుట్టూ అల్లుకుని వున్న మనుషులు మాట్లాడే సజీవ మాండలీకంలో రాసిన కథలు ఇవి. ఈ సంపుటిలో ఉన్న మొత్తం 16 కథలూ కూడా తెలంగాణాలోని తన ప్రాంతపు మాండలీకంతో మమేకమై రాసారు భూతం ముత్యాలు. మట్టి మనుషుల జీవితాలు పచ్చి పచ్చిగా మాండలీకపు సొంపుతో పాఠకుడి మనసును గాఢంగా హత్తుకుంటాయి.

- డా|| అప్పాల చక్రధారి
పేజీలు: 99
ప్రతులకు: 9441629693
వెల: రూ 60

ఈ దీర్ఘ కవితలో డా|| చక్రధారి రాజకీయ చదరంగం వికృత రూపం, ప్రజల్ని ఎలా తప్పుదోవ పట్టిస్తున్నాయో, ఎలా విష వలయంలోకి తోస్తున్నాయో కూలంకుషంగా కుంతలజలపాతంలా అశ్రుధారగా, కవిత్వం ఒక ఊపులో చిక్కగా సూటిగా మనసుకు హత్తుకునేట్టుగా వ్యక్తీకరించాడు.- డా|| దామెర రాములు

- భూతం ముత్యాలు
పేజీలు: 92
ప్రతులకు: 9490437978
వెల: రూ 100

దళిత రచయితల నుంచి కొంత విరామం తర్వాతనైనా మంచి నవల రాయడం ఆనందించదగ్గ విషయం. తెలంగాణ మాండలికంలో కథలు, నవలలు హెచ్చుస్థాయిలో రావల్సింది అని కోరుకునే అభిమానులకు ఈ నవల కొంత ఊరటని కలిగిస్తుంది. ఏది ఏమైనా తెలుగు నవలా సాహిత్యాన్ని సుసంపన్నం చేసే ప్రక్రియకు తన వంతు చేయూత నిచ్చింది 'సూర' నవల అనడంలో ఎలాంటి సందేహం లేదు.- డా|| ననుమాసస్వామి

- కన్నెగంటి అనసూయ
పేజీలు: 152
ప్రతులకు: 9246541249
వెల: రూ 150

అనసూయ గారి కథల వెనుక ఆమె ఆర్ద్ర హృదయం, సమాజ పరిశీలనా దృష్టీ, పరిణత మనస్కత, మానవీయ విలువల పట్ల ఆమెకున్న మన్నన చదువరుల మనసును హత్తుకుంటాయి, వారి ఆలోచనల్ని కదిలిస్తాయి.- విహారి

- అవధానుల మణిబాబు
పేజీలు: 54
ప్రతులకు: 9948179437
వెల: రూ 60

ఎప్పుడో వచ్చే ఒకానొక శాశ్వతవాక్యం కోసం జీవితాంతం రాస్తూనే వుండాలి. రాసీ రాసీ గుండెలరిగిపోవాలి అంటాడు కొప్పర్తి. మణిబాబు రాస్తూ వున్నాడు. అతడి కవిత్వం శాశ్వత వాక్యాన్ని ప్రామిస్‌ చేస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆశించడం పొరబాటుకూడా కాదని ఇందులో కవితలు తెలియజేస్తున్నాయి.- ఎల్‌.కె. సుధాకర్‌

- బి.ఎస్‌. రాములు కథలు
పేజీలు: 220
ప్రతులకు: 8331966987
వెల: రూ 150

గ్రామాలను రచనా కేంద్రాలుగా చేసుకుని రాములు రాసిన ఈ కథల్లో సన్నివేశాలన్నీ రోజూ జరుగుతున్నవే. వాటిని తన మనసుకెక్కించుకుని, చిన్న చిన్న కథలుగా మలచుకొని, కథనంలో నేటివిటీ నిలుపుకొని, అవసరమైనప్పుడు స్థానిక మాండలిక భాషను పొదుగుకొని రచయిత చూపిన నేర్పును మెచ్చుకోకుండా ఉండలేము. ఆ కథల్లో కలిసిపోకుండా ఉండలేము.- డా. సి. నారాయణరెడ్డి

- చిలకపాటి రవీంద్రకుమార్‌
పేజీలు: 51
ప్రతులకు: 0866-2862424
వెల: రూ 22

ఈ రోజుల్లో కథలకు కరువొచ్చి పడింది. ఆంగ్ల భాష మీద మోజుతో పిల్లలకు తెలుగు చదవడం రాక, అద్భుతమైన కథల పుస్తకాలకు దూరమై పోతున్నారు. బాల్యానందాన్ని కోల్పోవడం కన్న విషాదమే ముంది. బాలబాలికలకు! ఇందులోని 25 కథలు మనలను ఆలోచింపచేస్తాయి. ఆర్థ్రత కలిగిస్తాయి. కళ్ళు చెమర్చేలా చేసి, చివరకు ఔరా అనిపిస్తాయి. కథకు ఇంతకన్నా పెద్ద ప్రయోజనం ఏముంటుంది.- దేవినేని మధుసూదనరావు

-పత్తి సుమతి
పేజీలు: 48
ప్రతులకు: 8790499405
వెల: రూ 50

నిర్భయ సంఘటన దేశ రాజధానిలో జరిగినప్పుడు - ఒక మహిళగా నేను చాలా ఉద్వేగం, ఉద్రేకం, ఆక్రోశం, అంతులేని ఆవేదనకు గురయ్యాను. నాకు అంతగా సాహిత్య పరిజ్ఞానం లేకపోయినా 'జరగకూడనిది జరిగింది' (16-12-2013)... అత్యాచారాలు యిప్పటికీ జరుగుతూనే ఉన్నాయి...ఈ విష సంస్కృతికి అడ్డుకట్ట వేయలేని మన దౌర్భాగ్య సామాజిక పరిస్థితులకు కలతచెంది ఆ సంఘటనను రికార్డ్‌ చేయడానికి ఈ చిన్ని పుస్తకం వ్రాశాను.- పత్తి సుమతి

- డాక్టర్‌ కాళిదాసు పురుషోత్తం
పేజీలు: 390
ప్రతులకు: 919247564044
వెల: రూ 250

లోతైన పరిశోధన గ్రంథం యిది. ఈ గ్రంథప్రాచుర్యాన్ని రెండు పార్శ్వాల్లో చూడాలి. ఒకటి, యిది సాహిత్య పరిశోధనా ప్రక్రియకే పరిమితం కాకపోవడం, రెండవ అంశం, వెంకటగిరి సంస్థానచరిత్ర నేపథ్యంగా, రాజకీయ పరిణామాలకే పరిమితం కాకుండా, సమాజంలో సమాంతరంగా చోటుచేసుకొంటున్న మార్పులతో మేళవించి, సాహిత్యసృష్టిని పరికించడం యిందులోని ప్రత్యేకత.- వకుళాభరణం రామకృష్ణ

- డా|| ఎం. హరికిషన్‌, జి. వెంకటకృష్ణ, డా|| కె. సుభాషిణి
పేజీలు: 52
ప్రతులకు: 8985034894
వెల: రూ 20

రాయలసీమకు జరిగిన అన్యాయాలు సమైక్య రాష్ట్ర ముసుగులో కనపడకుండా వున్నవన్నీ యిప్పుడు దిగంబరంగా దర్శనమివ్వనున్న సందర్భంలోకి చరిత్ర నడుస్తున్నది. ఆ సందర్భాన్ని ఎత్తి పట్టుకోవడానికీ, అటువైపుగా యీ ప్రాంత రచయితలు తమ కలాల్ని పదును పెట్టుకోవటానికీ, యీ కథలు పురిగొల్పుతాయని ఆశిస్తున్నాం.  - సాహితీమిత్రలు, కర్నూలు

- డా|| కోడూరు స్వతంత్రబాబు
పేజీలు: 252
ప్రతులకు: 9440314367
వెల: రూ 150

డా|| స్వతంత్రబాబు శ్రీలత కథల్లోని అన్ని అంశాలను చక్కగా వివిధ అధ్యాయాల్లో విశ్లేషించారు. శ్రీలత జీవనరేఖలు, ఇతివృత్తం, పాత్రచిత్రణ, సాంఘిక సాంస్కృతిక అంశాలు, భాషా విశేషాలను కక్షుణ్ణంగా పరిశీలించి సఫలీకృతుడయ్యాడు.- ఆచార్య పి. నరసింహారెడ్డి

తాళ్ళూరి లాబెన్‌బాబు
పేజీలు: 152
ప్రతులకు: 9290490845
వెల: రూ 100

ఇది అందరూ వ్రాసే వచన కావ్యం వంటిది కాదు. దీని పంథాయే నూత్నం. విషయమే నూత్నం. విశ్లేషణమే నూత్నం. ఆధునిక ఆంధ్ర సాహిత్యంలో ఇది అతి నూత్న కావ్యం. ఇది చరిత్ర మానవ పరిణామం వివరిస్తుంది. ప్రపంచ దేశాల స్థితిగతులు, పరిస్థితులు తెలిపింది.
ఆచార్య కొలకలూరి ఇనాక్‌

డా. పి. విజయలక్ష్మి పండిట్‌
పేజీలు: 116
ప్రతులకు: 9347319751
వెల: రూ 100

'గీతాంజలి' ని మనస్ఫూర్తిగా చదివి ఆకళింపు చేసుకోవడం జిజ్ఞాసికి ఒక అపూర్వ అనుభవం. 'గీతాంజలి'ని 'అపూర్వగానం'గా తెలుగులోకి అనువదించే టప్పుడు ఆ అపూర్వ అనుభవాన్ని, ఆ భావోద్వేగాన్ని నేను అనుభవించాను. ఈ ప్రాపంచిక జీవితంలో ఆధ్యాత్మిక దాహాన్ని తీర్చి మనసుకు శాంతినిచ్చే పచ్చని చెట్లనీడలోని చలివేంద్రం 'గీతాంజలి'.
డా. పి. విజయలక్ష్మి పండిట్‌

సి.పి.బ్రౌన్‌ పరిశోధన కేంద్రం
పేజీలు: 552
ప్రతులకు: 08562-255517
వెల: రూ 500

స్థానిక చరిత్రల మీద ఎంతో పరిశోధన జరగవలసి ఉంది. అది జరగాలంటే కైఫీయత్‌లు అందుబాటులోకి రావాలి. సి.పి. బ్రౌన్‌ భాషా పరిశోధన కేంద్రం ఈ మహత్తరమైన బాధ్యతను నెత్తికెత్తుకొంది. వైయస్సార్‌ జిల్లాకు సంబంధించిన కైఫీయత్‌లను ఇప్పటిదాకా 1968 పేజీలతో ఆరు సంపుటాలను ప్రచురించింది. ఇప్పుడు ఏడవ సంపుటాన్ని పాఠకులకు అందించింది.
బేతనభట్ల శ్యామసుందర్‌

ములుగు లక్ష్మీమైథిలి
పేజీలు: 80
ప్రతులకు: 9441685293
వెల: రూ 100

ఒకవైపు దేశభక్తి, మరోవైపు గ్లోబలైజేషన్‌ వ్యతిరేకత, ఇంకోవైపు కులవృత్తులకు ఆదరణ కోల్పోవటంతో అణగారిన జీవుల వ్యధలను మనందరికీ కళ్ళకు కట్టినట్లు చూపిన ఈ దృశ్యకావ్యం 'ఊహలు గుసగుసలాడె' ద్వారా శ్రీమతి లక్ష్మిమైథిలి గారు కవిత్వంలో మరోమెట్టు పైకెక్కారు.
పొత్తూరి సుబ్బారావు

తుమ్మేటి రఘోత్తమరెడ్డి కథల చర్చాసర్వస్వం
పేజీలు: 576
ప్రతులకు: 9000184107
వెల: రూ 400

కథలను, కథాసాహిత్య విమర్శను శ్రద్ధగా అధ్యయనం చేసేవారి కోసం నా కథల మీద వచ్చిన విమర్శనంతా ఒకచోట చేర్చి అందుబాటులో ఉంచడం మంచిదని భావించి ఈ పుస్తకాన్ని తేవడం జరుగుతుంది.
తుమ్మేటి రఘోత్తమరెడ్డి

యడవల్లి సైదులు
పేజీలు: 48
ప్రతులకు: 8464027765
వెల: రూ 50

ఒకరోజు హఠాత్తుగా 100కి పైగా 'నానీ'లతో ప్రత్యక్షమయ్యాడు. వాటిని చూసి నేనెంతో సంతోషించాను. నానీల రచనాశిల్పం అతనికి పట్టుబడిందని అనిపించింది. అంతేకాకుండా అతనిలోని సామాజికస్పృహ, భావుకత, శబ్దసౌష్టవం అతని నానీలలో ప్రతిబింబిస్తున్నాయి. ఒకరకమైన తాజాదనం వాటిలో గోచరిస్తుంది.
డా|| సూర్యా ధనంజయ్‌

చల్లగాలి బాబూరావు
పేజీలు: 94
ప్రతులకు: 9941469728
వెల: రూ 80

తానున్న సమాజం తాలూకు సంక్షేమానికి బాధ్యత వహించిన కవిగా వివిధ సామాజికాంశాలను కవితా వస్తువులుగా స్వీకరించిన బాబూరావు గారు కేవలం ఆ చట్రానికే పరిమితం కాక వ్యక్తిగా తన కెదురైన అనుభవాలను, తనలోని అనుభూతులను సైతం ఎంతో ఆత్మీయంగా పాఠకులతో పంచుకుంటారు.
డా|| కాసల నాగభూషణం

సాహిత్యప్రకాశ్‌
పేజీలు: 131
ప్రతులకు: 9492530542
వెల: రూ 80

కథ మనిషి చైతన్యపరంగా ఉన్నస్థితి నుంచీ ఉన్నతస్థితికి పయనించేందుకు దోహదపడాలి. ఈ లక్ష్య సాధనకు - అటు వస్తువునీ, ఇటు శిల్పాన్నీ కథకుడు తన రచనలో సమన్యయించుకోగలగాలి. రచనపట్ల ఆరాధనా భావం, అధ్యయనశీలం కలిగిన సాహిత్య ప్రకాశ్‌కి ఈ అంశాలపై శ్రద్ద వున్నదనే ఈ సంపుటిలోని కథలు మనకు నమ్మకం కలిగిస్తున్నాయి.
విహారి

ఏనుగు నరసింహారెడ్డి
పేజీలు: 87
ప్రతులకు: 8978869183
వెల: రూ 50

అకవిత్వం కవిత్వంగా అరుపులు సంగీతంగా రాజ్యమేలుతున్న ప్రస్తుత సందర్భంలో హైద్రాబాద్‌ కవుల వేదిక ప్రచురిస్తున్న ఈ 'ములాఖత్‌' కవితా సంకలనం ఒక గొప్ప రిలీఫ్‌ నిస్తోందనడం అతిశయోక్తి కాదు. కవికి శబ్దలేమి భావలేమికి పాదులు వేస్తుంది. దరిమిలా కవిత్వంలో పద, భావ పునరుక్తి ఒక వైచిత్రిగా భ్రమపడేట్లు చేస్తుంది.
థింసా

చిలుకూరి శ్రీనివాసరావు
పేజీలు: 84
ప్రతులకు: 8985945506
వెల: రూ 80

చిలుకూరి శ్రీనివాసరావు(చిశ్రీ) కవితలో ప్రాంతీయత, ఆధునికత, అక్షర రమ్యత, అభివ్యక్తి నవీనత తొణికిసలాడుతుంటాయి. చిశ్రీ ఏ వస్తువు తీసుకున్న అందులో వైవిధ్యం ఉంటుంది. సామాజిక నేపథ్యం ఉంటుంది. ప్రతి కవికి తనదైన శిల్ప సంవిధానం ఉంటుంది. పాంచ భౌతిక ముద్ర ఉంటుంది.
ఆచార్య ఎండ్లూరి సుధాకర్‌

ఆశారాజు
పేజీలు: 109
ప్రతులకు: 9392302245
వెల: రూ 90

మనిషిని మనిషే
గుర్తుపట్టని సందర్భంలో
మనిషికి మనిషి దూరమైన కాలంలో
మనిషిని మనిషి
పట్టించుకోని సమయంలో
మనిషిని మనిషికి
పరిచయం చేయాలన్న ప్రేమతో...
ఈ 'నూతన పరిచయం'.
ఆశారాజు

ఇ.సి.ఐ.ఎల్‌. ఉద్యోగుల రచనల సంకలనం
పేజీలు: 144
ప్రతులకు: 9490098660
వెల: రూ 80

డా|| ఏ.ఎస్‌. రావు గారి ప్రేరణలను, సామాజిక అంశాలను భూమికలుగా రూపొందించుకొని, ఇ.సి.ఐ.యల్‌. కవులు, రచయితలు, ఇ.సి.ఐ.యల్‌. సాహితీస్రవంతి ఆధ్వర్యంలో నిరంతరాయంగా 7 సంవత్సరాలుగా రచనల సంకలనం ప్రచురించి, ప్రజల ముందుకు తీసుకురావటం అదర్శనీయం.
వి.ఎస్‌.బి. బాబు

ఆదివిష్ణు
పేజీలు: 388
ప్రతులకు: 9391343916
వెల: రూ 200

ఈ కథానికలు చదివితే మీకే అర్థమవుతుంది. ఆ రోజుల్లో రచయితగా ఆయన్ని మేమంతా అంతగా ఎందుకు అభిమానించేవాళ్ళమా అని! రచయితగా ఆదివిష్ణుగారి ప్రత్యేకత ఆదివిష్ణుగారిదే! ఆ విషయాన్ని చెప్పడానికి నేనెవర్ని? అందుకే చదవండి... ఆయన కథానికలే చెబుతాయి, అవి ఎంత ప్రత్యేకమైనవో. చిన్న చిన్న వాక్యాలతో కథని ఎలా పరుగెత్తించవచ్చో, కథని ఆసక్తితో చదివించేలా ఎలా మలచవచ్చో...
వేదగిరి రాంబాబు

అభిలాష
పేజీలు: 184
ప్రతులకు: 9666222737
వెల: రూ 120

అభిలాష తన స్వీయ ప్రజ్ఞ పాటవాల్ని, తన అనుభూతుల్నీ, ప్రేమానురాగాల్ని వ్యక్తిగతంగా తనకు మాత్రమే పరిమితమై ప్రేమగీతాల్ని కొత్త ''అనుపల్లవి''తో పాడుకోవడానికి చేసిన ప్రయోగం పాట గాని పాట ఇది. గీతిక గాని విరహగీతిక. వచనం గాని నిర్వచనం. లేఖగాని విరహలేఖో. ఇది ప్రతి స్త్రీ తన గుండెల్లో దాచుకొనే ప్రేమలేఖే. అది కాస్తా బట్టబయలు చేసింది.
యస్‌. హజరత్‌ అలీ

డా||కొండెపోగు బి.డేవిడ్‌ లివింగ్‌స్టన్‌
పేజీలు: 151
ప్రతులకు: 9440211120
వెల: రూ 100

నిజ జీవితంలో, చుట్టూ సమాజంలో ఏది కొరవడిందో ఏది దొరకదో - దాన్ని అన్వేషించటం - పురాణ ప్రతీకల్తో ఆవిష్కరించటం- డా|| లివింగ్‌స్టన్‌ మూడు కవిత్వ పుస్తకాల్లో ఒక శినీలిళీలి- వుంది. ఒక అంతస్సూత్రం వుంది. ఒక ఆగ్రహం వుంది, ఒక సంయమనం వుంది. తనదయిన వ్యక్తీకరణ వుంది. తన పరిభాష, తన కవిత్వ పరిభాష తను సృష్టించుకుంటూ పోతున్నాడు.  
శివారెడ్డి

అరిపిరాల సత్యప్రసాద్‌
పేజీలు: 132
ప్రతులకు: 9966907771
వెల: రూ 120

    అతడి శైలి-ఆలోచనలో కొడవటిగంటకి సాటొస్తుంది. ఆవేదనలో రాచకొండలా స్పందిస్తుంది. నిరసనలో రంగనాయకమ్మగా కనిపిస్తుంది. ఆహ్లాదంలో మల్లాదిలా మురిపిస్తుంది. ఆకట్టుకోవడంలో యండమూరికి దీటొస్తుంది. ఒకరా, ఇద్దరా- సమకాలీనంగా ఉన్నత శిఖరాలకు చేరుకున్న మహాకథకులందర్నీ అతడు కాచి వడబోసినట్లు తోస్తుంది. ఐతే అతడు ఎవర్నీ అనుకరించడు. సంపుటిలోని ప్రతీ కథా కేవలం అరిపిరాలది.
 ''వసుంధర''

యం.కె. సుగమ్‌బాబు
పేజీలు: 111
ప్రతులకు: 8096615202
వెల: రూ 60

సుగమ్‌బాబు, తాను ప్రారంభించిన 'రెక్కలు' ప్రక్రియ ఇందుకు బాగా సరిపోతుందనే సముచిత భావంతో ఈ కావ్యం రాశారు. అందుకే వివేకానందుడికి అతి ముఖ్యమైన 'మానవ అంతశ్శక్తి ప్రజ్వలన' ఆలోచనల్ని, ఇన్ని రెక్కలుగా చెప్పి పాఠకులకి అందించారు. ప్రజలకు ప్రబోధించాలనుకునేవారి శైలిలో ఎప్పుడూ క్లిష్టత ఉండదు. ప్రగతిశీల రచయితల శైలి ఎప్పుడూ సరళంగానే ఉంటుంది. వాడ్రేవు చినవీరభద్రుడు

ఈతకోట సుబ్బారావు
పేజీలు: 122
ప్రతులకు: 9440529785
వెల: రూ 80

ఇటువంటి కథలు మళ్లీమళ్లీ మనం చదవక తప్పదు. ఇటువంటి కథల్ని మనకోసం రచయితలు మళ్లీమళ్లీ రాయకతప్పదు. అన్నిటికన్నా ముందు ఈ కథల ప్రయోజనం, జీవితం మనమనుకున్నంత సజావుగా లేదని చెప్పటమే. సజావుగాలేదని మనకు తెలిసినా, ఎక్కడోమనం మనల్ని నమ్మించుకుంటూ మభ్యపెట్టుకుంటూ ఉన్నాంకాబట్టి, ఈ కథల లక్ష్యం మనల్ని మన భ్రమాన్వితసుఖం నుంచి బయటపడేయటమే.
వాడ్రేవు చినవీరభద్రుడు

బి. గీతిక
పేజీలు: 102
ప్రతులకు: 9908063266
వెల: రూ 80
నాలోలోపల్లో... ఎన్నో ప్రశ్నల్తో, ఆలోచనల్తో రగిలిరగిలీ సమాధానపడిన అంశాలూ, అంతర్మధనాలూ అన్నీ చివరికి ఈ ప్రేమ భాగాలుగా అక్షరాలై కాగితం మీద కొచ్చాయి. ఆ అక్షరాలే సాక్షి ఫన్‌డేలో ది. 28.9.2008 నుండి ది 23.8.2009 వరకూ ప్రేమ శీర్షికగా వారంవారం ప్రచురితమయ్యాయి. ఆ శీర్షికనే ఇప్పుడు ''ప్రేమలో మనం''గా నా మొదటి పుస్తకరూపంలో మీ ముందుకు తెస్తున్నాను. 
బి. గీతిక
తోటపల్లి
పేజీలు: 45
ప్రతులకు: 9963859920
వెల: రూ 20
కొత్త పదాలను సమకూర్చడంలో, వాటిని అన్వయంగా ప్రయోగించడంలో భూమన్న దిట్ట అని పాటలు విన్న, చదివిన తర్వాత తెలుస్తుంది. బంతి పువ్వుల బంగారు వన్నెలను పాటల తోట నిండా పూయించాడు. స్వతంత్ర దేశంలో నిశీధి నీడలు కమ్ముతుంటే, ఆరుపదుల అంటరాని వసంతాలు వెంటాడుతుంటే ఈ రచయిత పాటనే నమ్ముకున్నాడు. పోటీగా నిలబెట్టాడు. ఆశయాల తోవకు దివిటీగా ఎత్తిపట్టాడు. 
డా|| సి. కాశీం
పెద్దిరెడ్డి గణేష్‌
పేజీలు: 163
ప్రతులకు: 9848181117
వెల: రూ 150
ప్రతీక, అభివ్యక్తి, వస్తువు, వచన కవితకి బలమైన ఆలోచనా సాంద్రత, అన్నిటికీ మించి ఆర్ధ్రత, అతి సున్నితంగా - కాని గురితప్పకుండా, సూటిగా సంధించే వాడీ - ఇవన్నీ ఈ గణేష్‌ లక్షణాలు కాదు ఆయుధాలు, కాదు పరికరాలు. ప్రతీ కవికి తనదైన కొత్తలైన్‌ ఉంటుంది. అది పుష్కలంగా ఉన్న కవిమిత్రుడు గణేష్‌. 
గొల్లపూడి మారుతిరావు
డా|| వల్లపురెడ్డి బుచ్చారెడ్డి
పేజీలు: 385
ప్రతులకు: 9490804157
వెల: రూ 150
నేను మొత్తం 52 కథలు రాశాను. అన్ని కథలు వివిధ పత్రికలలో అచ్చయ్యాయి. 17 కథలు లభ్యం కావడం లేదు. 35 కథలతో ఈ కథా సంపుటిని ప్రచురిస్తున్నాను. కొన్ని కథలు అసంపూర్తిగా ఉన్నాయి. 
డా|| వల్లపురెడ్డి బుచ్చారెడ్డి
తెలుగు కథ రచయితల వేదిక
పేజీలు: 257
ప్రతులకు: 9390085292
వెల: రూ 99
2012లో ప్రచురితమైన కథలతో 'మా కథలు- 2012'గా ఒక సంకలనం తీసుకురావాలనీ, సమన్వయకర్తగా శ్రీ సి. హెచ్‌. శివరామప్రసాద్‌ (వాణిశ్రీ) గారిని ఎన్నుకోవడం జరిగింది. ముందుకు వచ్చిన ముప్పై మంది కథకులతో ఈ సంకలనం ప్రచురితమైంది. 
తెలుగు కథ రచయితల వేదిక
 
మినీ కవితలు
పేజీలు: 120
ప్రతులకు: 9703542598
వెల: రూ 100
1980వ థకంలో  'మినీకవిత' ఉదృతంగా వెలువడుతున్న రోజుల్లో అంతే ఉధృతంగా కవితా సృజన చేస్తూ, ఆ ప్రక్రియను సుసంపన్నం చేయడానికి కృషిచేసిన హరనాథ్‌ 'సాంస్కృతీ సమాఖ్య' వంటి వేదికలపై 'మినీకవిత'ను బలపరిచిన కార్యకర్తగానూ, మినీకవితలు విరివిగా వ్రాసిన కావ్యకర్తగానూ గుర్తింపు పొందారు.  
డా|| ఎస్వీ సత్యనారాయణ
ఎలికట్టె శంకరరావు
పేజీలు: 68
ప్రతులకు: 9346359268
వెల: రూ 30
ఈ ప్రతిజ్ఞను పైడిమర్రి 1962లో తెలుగులో రాసిండు. 1963 నుంచి పాఠ్యపుస్తకాల్లో కొనసాగుతున్నది. తర్వాత వివిధ ప్రాంతీయ భాషల్లోకి, హిందీ, ఇంగ్లీషు జాతీయభాషల్లోకి అనువాదమైంది. ప్రతిజ్ఞను పాఠ్యపుస్తకాల్లోకి తీసుకొని ఇప్పటికి యాభై ఏండ్లు అయ్యింది. కాని ప్రతిజ్ఞ రచయితగా పైడిమర్రి పేరు ఎక్కడా కనిపించదు. 
 ఎలికట్టె శంకర్‌రావు
డా|| బన్న అయిలయ్య
పేజీలు: 70
ప్రతులకు: 9949106968
వెల: రూ 100
''ప్రజాకవి కాళోజీ సాహిత్య సమాలోచన'' పేరుతో తెలుగుశాఖ, ఆంధ్ర విద్యాలయ కళాశాల, తెలంగాణా భాషా సాంస్కృతికమండలి హైదరాబాదు వారు సంయుక్తంగా ఒక జాతీయ సదస్సును నిర్వహించి ఆ సదస్సులో సమర్పించిన పత్రాలను విశేష సంచికగా ముద్రించారు. దీనికి సంపాదకులు డా|| గంటా జలంధర్‌ రెడ్డి గారు. ప్రస్తుతం పుస్తకంగా వెలువడుతున్నది ఆ సంచికలోని వ్యాసమే. కొద్ది మార్పులతో...
డా|| బన్న అయిలయ్య
 
 
బెజ్జారపు రవీందర్‌
పేజీలు: 110
ప్రతులకు: 9491046104
వెల: రూ 60
దాస్‌ కాపిటల్‌ను చదవడం ప్రారంభించాను. అందులోని పదాలు, వాక్యాలు అర్థమవుతున్నకొద్దీ, అక్షరాలు నేలజారడం ప్రారంభమయ్యాయి. కొద్దిసేపటి తరువాత అవి మనుషులుగా మొలకెత్తడం గమనించాను. క్రమంగా ఎదిగి... ఎదిగిన మనుషులు సమూహాలు, సమూహాలుగా గది తలుపులు తెరుచుకొని జనంలో కలవడం మొదలుపెట్టారు. భయంవేసి పుస్తకం చదవడం ఆపాను.
బెజ్జారపు రవీందర్‌ (నిత్యగాయాల నది)
వి.వి.ఆర్‌.
పేజీలు: 216
ప్రతులకు: 040-27177719
వెల: రూ 100
కథలు, గేయాలు, వ్యాసాలు, నాటికలు... నాలుగు రంగులవ్వగా వి.వి.ఆర్‌ అనబడే వడ్డాది వెంకట రమణారావుగారు, ఆయన కలాన్ని కుంచెలా చేసి ఆ రంగులనన్నిటినీ మిశ్రమం చేసి, హృదయంలో రంగరించి ఐదో వర్ణంగా మలుస్తూ, 'టివి చూద్దాం రండి' అనే 'సాహితీ ఛాట్‌' వంటి పంచవన్నెల చిలుకను పాఠకుల ముందుంచారు.
 పి.ఎస్‌. నారాయణ
 
ఎరుకలపూడి గోపీనాథరావు
పేజీలు: 92
ప్రతులకు: 9848293119
వెల: రూ 80
గోపీనాథరావుగారు అనంతమైన వస్తుస్పృహని దృశ్యమానం చేశారీ ''అక్షరార్చన''లో. ఆధునిక కవిత్వానికి కవి దార్శనికత, వాక్య రసాత్మకత, అభివ్యక్తి శబలత- అనే త్రివేణి- ఉత్తమత్వాన్ని కూర్చుతాయి. కవిత్వస్థాయిని ఉన్నతీకరిస్తాయి. గోపీనాథరావు గారు ఈ త్రివేణిని సాధించుకున్న ఉత్తమకవి. 
విహారి
 
వరం
పేజీలు: 52
ప్రతులకు: 9441008847
వెల: రూ 70
ఈ సంపుటిలోని రెక్కలన్నీ అత్యంత క్లుప్తమైనవి. కొంచెం పెద్ద పాదాలున్నవీ రాస్తున్నారు గానీ, ఇలా రాయడం ఒక పద్ధతి. అయితే ఇంత క్లుప్తతలోనూ, అన్ని రెక్కల్లో ఒక విధమైన సమాంతర పాదనిర్మాణం వుంది. ఈ 'సమాంతర' అనేది అనేక విధాల లయను ఇస్తుంది. 
డా|| అద్దేపల్లి రామమోహనరావు
అయినంపూడి శ్రీలక్ష్మి
పేజీలు: 60
ప్రతులకు: 9989928562
వెల: రూ 75
బ్రెస్ట్‌ క్యాన్సర్‌ అనే సెన్సిటివ్‌, కాంప్లెక్స్‌ టాపిక్‌ని ఎంతో కవితాత్మకంగానూ, మరెంతో ఈస్తటిక్స్‌ని అక్షరాలలో పొదిగించి ఈ దీర్ఘకవితని ఓ కావ్యతరువుగా నిలబెట్టిన శ్రీలక్ష్మిలోని సానుభూతికి, సహానుభూతికి, ఈ దీర్ఘకవితని అసాంతం చదివిన తర్వాత నమస్సులు చెప్పకుండా ఉండలేము.
మామిడి  హరికృష్ణ
బి. శ్యాంసుందర్‌ రెడ్డి
పేజీలు: 78
ప్రతులకు: 9393874112
వెల: రూ 99
ఈ పుస్తకంలోని కృత్యాలను పిల్లల చేత చేయించి వారిలో శాస్త్రం పట్ల అభిరుచిని, శాస్త్రీయ దృక్పథాన్ని కలిగించడమే ఈ పుస్తక రచయిత ఆశయం. ఈ పుస్తక రచయిత ఉపాధ్యాయ వృత్తి చేపట్టినప్పటి నుండి, సైన్స్‌ పట్ల విద్యార్థులకు సరియైన అవగాహన కల్పించాలనే తపనతో, తక్కువ ఖర్చుతో అనేక సైన్స్‌ ప్రయోగాలను రూపొందించి, జాతీయస్థాయిలో రాష్ట్ర స్థాయిలో అనేక విజ్ఞాన శాస్త్ర కార్యక్రమాలలో పాల్గొని, అపారమైన అనుభవాన్ని గడించారు. 
డి. గోపాలకృష్ణ
 
సాగర్‌ శ్రీరామకవచం
పేజీలు: 130
ప్రతులకు: ప్రముఖ పుస్తకాల షాపులు
వెల: రూ 100
ప్రాచీన పద్య రూపాన్ని ఆధునిక వచన కవిత్వాన్ని కలిపి నేనీ రూపాన్ని ఎంచుకున్నాను. ఒక ముక్కాణీలో నాలుగేసి పాదాలతో నడిచే మూడు వచన పద్యాలు వుంటాయి. ప్రతి వచన పద్యంలో మూడు పాదాల తర్వాత విరామం వుంటుంది. నాలుగో పాదం - పై మూడు పాదాలతో సంభాషిస్తుంది. తీసుకున్న వస్తువు విస్తృతిని బట్టి 12 పాదాల నుంచి 36 పాదాలు - చివరికి 108 పాదాల దాకా ముక్కాణీలు విస్తరిస్తాయి. 
సాగర్‌ శ్రీరామకవచం 
సింహ ప్రసాద్‌
పేజీలు: 138
ప్రతులకు: 9849061668
వెల: రూ 80

నేను సైతం' నవల కూడా పట్టుకుంటే చాలు అయిపోతే గాని మనం చదవడం ఆపలేని స్థితిని కలిగిస్తుంది. చదివించే గుణం ఆయన కలానికుంది. నవలైపోయే వరకూ మనం ఒక కుటుంబం మధ్య సంచరిస్తున్నట్లే ఉంటుంది. తన పాత్రలతో పాఠకుడు మమైకం చెందేట్టు చేయగలరు సింహప్రసాద్‌. డా. వేదగిరి రాంబాబు

మునిపల్లె రాజు
పేజీలు: 195
ప్రతులకు: 9849061668
వెల: రూ 100
భారతీయ సాంస్కృతిక పరంపర - విచ్ఛిన్నమయిపోతుందన్న ఆక్రోశం. శిలా శాసన సదృశమైన నీతి నిబంధనలు భగ్నమైపోతున్నవన్న ఆవేశమే అతని కథా వస్తువులు. గ్రామీణ జీవన వ్యవస్థ నుండీ మహానగర సంక్లిష్ట మానవ విషాదాల నుండీ - తన నిశిత పరిశీలనలో ఎదురు పడ్డ అన్ని అనుభూతులకు ఈ కథలు దర్పణాలు. 
 
సింహప్రసాద్‌
పేజీలు: 173
ప్రతులకు: 040-27177719
వెల: రూ 100
పల్లెలో పుట్టి పెరిగిన నాకు ఈ నవల చదువుతుంటే ఆశ్చర్యాన్ని కలిగించింది. ఏ పాత్రకు, ఆ పాత్ర ఏ లోపం లేకుండా కథను ఎంతో సహజంగా నడిపించారు. చేయి తిరిగిన రచయిత తప్ప ఇంత నేర్పరితనంతో పాత్రలను పోషించలేరు. అటువంటి రచనా చమత్కారం, నేర్పరితనం సింహప్రసాద్‌ గారికి దక్కింది. 
డా. వాసా ప్రభావతి
అనువాదం: దేవి
పేజీలు: 104
ప్రతులకు: 9010646492
వెల: రూ 60
మతం పేరిట, దేశం పేరిట జరిగిన అమానవీయ హింసాకాండ ఎక్కువగా అతని కథావస్తువు. 'నైరాశ్యపు అపహాస్యం' మంటో రచనల్లో ప్రకటింపబడుతుంది. తన ఎద చప్పుళ్ళు సామాన్యంగా కన్పించే కథాశిల్పం ద్వారా పాఠకుల మస్తిష్కంలోకి దూకేట్లు చేయగల సమర్థుడీ మంటో. సాదత్‌ హసన్‌ మంటో ఖచ్చితంగా ప్రపంచంలోని గొప్ప రచయితల్లో ఒకడు.
 ఉమామహేశ్వర్రావ్‌. సి
ఎస్‌.ఆర్‌. పృథ్వి
పేజీలు: 89
ప్రతులకు: 9989223245
వెల: రూ 70
ఈ పుస్తకంలో, తండ్రి సద్గుణ ప్రశంస, దుర్గుణ నిరసన- రెండూ ఉండడం చేత ఒక మంచి తండ్రి ఎలా ఉండాలో తెలుసుకొని, తండ్రులు తమ గుణ గణాల్ని సరిచేసుకునే అవకాశం ఉంది. అంత మంచి కవితా పంక్తులు ఈ పుస్తకం నిండా ఉన్నై. 
డా. అద్దేపల్లి రామమోహనరావు
ఆడిగోపుల వెంకటరత్నం
పేజీలు: 119
ప్రతులకు: 9848252946
వెల: రూ 80
వర్తమాన సామాజిక సంక్షోభాన్నీ, ఆ సంకక్షుభిత సమాజంలో నిత్యనరక గమనం చేస్తున్న మనిషి బతుకునీ - దృశ్యాలు దృశ్యాలుగా మనకందించారు అడిగోపుల వారు. ఈ అనంతమైన విస్తృతీ, వైవిధ్యం- కవితాసంపుటికి ఔన్నత్యశోభని కూరుస్తోంది. 
విహారి
పంజాల జగన్నాథం
పేజీలు: 87
ప్రతులకు: 9948531985
వెల: రూ 120
వీరి కథలు చదువుతుంటే వ్యక్తులు ఈ విధంగా ఉండాలి అని ఒక మాడల్‌ను చూసినట్టుంటుంది. ఒక నీతిబోధ వినపడుతుంది. సాంప్రదాయక సామాజిక రూపు రేఖల మధ్య కథలు నడుస్తయి. ప్రగతి కాముక ధోరణి తారసిల్లుతుంది. 'అనివార్యం' కథ ఈ విషయానికి అద్దం పడుతుంది. 
డా. బి.వి.ఎన్‌. స్వామి
 
తుమ్మూరి రామమోహన్‌ రావు
పేజీలు: 281
ప్రతులకు: 9701522234
వెల: రూ 200
ఈ అభిరుచి వల్ల మాత్రమే కాక, తన ప్రవర్తన వల్ల కూడా ఒక ఉదాహరణగా నిలబడ్డ మనిషి సామల సదాశివ అని ఈ స్మృతిసుధ మనకి మరొకమారు గుర్తుచేస్తున్నది. ఒక్కమాటలో చెప్పాలంటే, ఇందులోనే ఒక రచయిత గుర్తు చేసుకున్నట్లుగా దేశికోత్తముడు సదాశివ. 
వాడ్రేవు చినవీరభద్రుడు
 
జి. సుబ్బారావు
పేజీలు: 94
ప్రతులకు: 9866179890
వెల: రూ 100
జి.సుబ్బారావుకి కవిత్వం ఎప్పుడూ అంతరంగ వ్యవహారమే. స్పందన అనేది కవి లోపల బయలుదేరి పాఠకుని మనసులోని స్పందనగా మారిపోవాలి. అప్పుడే కొత్త కవిత పుడుతుంది. 'కొత్త కవిత' అనే శీర్షికతో ఉన్న కవితలో ఈ అంశం మనం గమనించగలం. 
డా. అద్దేపల్లి రామమోహనరావు
అనువాదం: ఎలనాగ
పేజీలు: 168
ప్రతులకు: 9866945424
వెల: రూ 150
ఒక్కొక్క కథా ఒక్కొక్క మణిపూస. సంగీత సాహిత్యాలను తన ఉచ్ఛ్వాస నిశ్వాసలుగా చేసుకున్న డాక్టరు గారు, వీటిని తన కవిత్వ పరిభాషలో అనుసృజన చేసి తెలుగు పాఠకులకు కానుకగా ఇస్తున్నారు. 
ముక్తవరం పార్థసారథి
జి. సుబ్బారావు
పేజీలు: 77
ప్రతులకు: 9866179890
వెల: రూ 75

ఈ వ్యాసాలను వివిధ సందర్భాల్లో రాయడం జరిగింది. నాకు బాగా నచ్చిన అంశాలను ఆయా సందర్భాలలో తప్పక చెప్పాలనిపించి రాసాను. ఆ కారణంగా వెనక్కి చూసుకునే అవకాశం లేక పునరుక్తమవడం జరిగిందే తప్ప, చెప్పడానికెన్నో విశేషాలు. జి. సుబ్బారావు 

జి. సుబ్బారావు
పేజీలు: 70
ప్రతులకు: 9866179890
వెల: రూ 75
జి .సుబ్బారావు, మొదటి సంపుటి 'వెలుతురు జలపాతం'తో ఆర్ద్రమైన కవిగా అవతరించారు. ఈ రెండో సంపుటి 'బియ్యపుగింజ'తో ఆయుధమై కూడా అవతరిస్తున్నారు. 
 డా. అద్దేపల్లి రామమోహనరావు
డా. కత్తి పద్మారావు
పేజీలు: 156
ప్రతులకు: 9849741695
వెల: రూ 100
ఇప్పుడు వ్రాస్తున్న గ్రంథాలన్నింటికి ఈ పుస్తకంలోని ప్రణాళికే భూమిక. యింత కాలానికి 4వ ముద్రణ తేగలిగినందుకు సంతోషిస్తున్నాను. అనేక పుస్తకాల ప్రచురణ వల్ల ఈ పుస్తక పునర్ముద్రణ ఆలస్యమైంది. సమాజ పరిణామానికి ఈ గ్రంథం కీలకమైన మార్పు నందిస్తుందని ఆశిస్తున్నాను. 
కత్తి పద్మారావు
 
ఎలనాగ
పేజీలు: 72
ప్రతులకు: 9866945424
వెల: రూ 50
ఆ ఆడకూలీ తన గుండెను/ పెనం మీద కాల్చుతుంటే/ చంద్రుడు చెట్టు వెనుక నుండి/ నవ్వుతుంటాడు-/ కంచమూ తపేలాతో/ సంగీతం కూరుస్తూ/ తండ్రి చిన్న కొడుక్కు/ సంగీతాన్ని పంచుతుంటాడు/ పెద్ద కొడుకు తన నడుముకు/ కట్టుకున్న చిరుగంటల్ని మోగిస్తూ/ నాట్యం చేస్తుంటాడు/ ఆ పాటలు మరణించవు/ గుండెలోని నాట్యమూ అంతే...
ఎలనాగ ('నాట్యం' కవితా చరణాలు)
 

పేజీలు: 162
ప్రతులకు: 9866179890
వెల: రూ 150
జి.సుబ్బారావుకి కవులందరు మిత్రులే. ఎవ్వరిమీద ఆయన పూర్వ నిర్థారిత భావాలతో పరిశీలన చేయరు. కేవలం కవిత్వంలోని గుణాలు మాత్రమే ఆయనకు కావలసినవి. ఆ మార్గంలోనే అనేకమంది కవులను, రచయితలను ఆయన పరిశీలించారు. 
డా. అద్దేపల్లి రామమోహనరావు 
కె.వి. రమణారెడ్డి (అశ్రుజల)
పేజీలు: 135
ప్రతులకు: 9885620875
వెల: రూ 150

సాహితీ వర్గాల్లో గొప్ప చర్చకు ఈ పుస్తకం దోహదం చేసింది. ఈ పుస్తకం మీద ఎందరో సాహితీ వేత్తలు తమ అభిప్రాయాలు- (అనుకూలంగా-ప్రతికూలంగా) వెలిబుచ్చారు. శ్రీశ్రీని అటు మార్క్సిస్టు దృక్పథంతోనూ, ఇటు శుద్ధకవిత్వంగానూ అర్థం చేసుకోవడానికి ఈ వ్యాసాలు తోడ్పడ్డాయి.
 అంపశయ్య నవీన్‌

మల్లవరపు చిన్నయ్య
పేజీలు: 80
ప్రతులకు: 8520091658
వెల: రూ 101

'ఆమని' పేరుతో వచ్చిన మల్లవరపు చిన్నయ్యగారి 'రెక్కలు' సలక్షణమైనవి విలక్షణమైనవి. సెలక్షన్‌లో పాఠకులే నచ్చినవి ఎన్నుకుంటారు. ఆరుపంక్తుల రచనలో కవితాత్మ 'రెక్కలు' కప్పుకుని ఉంటుంది. నాలుగు రెక్కలు తొలగించుకుని లోనికి వెళితే మిగతా రెక్కలు తీయగానే భావం జిగేల్‌మంటుంది.
 ఎండ్లూరి సుధాకర్‌

గొట్టిపర్తి యాదగిరి రావు
పేజీలు: 58
ప్రతులకు: 08297277795
వెల: రూ 50

సంక్షిప్తత కవిత ఆత్మని స్పర్శించడానికి దగ్గరి దారి అనుకునేట్టు అయితే ఆత్మ ఈ కవితల్లో కనిపిస్తుంది. ఆ సంక్షిప్తతకి సరళత్వం తోడయితే ఆ సరళత్వానికి సూటిదనం పదునయితే అది ఆస్వాదించే వాళ్ళకి తెరచిన హృదయం అవుతుంది. అలజడి అలాంటిదే!
చింతపట్ల సుదర్శన్‌

డా|| సూర్యాధనంజయ్‌
పేజీలు: 48
ప్రతులకు: 9849104187
వెల: రూ 75

డా|| సూర్య సున్నితమైన మనస్తత్వం గల వ్యక్తి. కవితాత్మక శక్తి ఈ నానీల్లో పొంగి పొరలి వచ్చినట్లు గుర్తించగలం. 'మూసీ' పత్రికలో సీరియల్‌గా ప్రచురింపబడుతున్నప్పుడే నేను బంజారా నానీల గట్టితనాన్ని చూసి సంతోషించాను. నానీల శిల్పం ఈమెకు పట్టుబడిందని తెలిసిపోయింది.
డా|| ఎన్‌. గోపి

డాక్టర్‌ చింతకింది శ్రీనివాసరావు
పేజీలు: 106
ప్రతులకు: 9912347991
వెల: రూ 110

అతి సామాన్యుల జీవితాల్లోంచి, అతి సాధారణ అంశాలనుంచి అమూల్యమైన మానవతావిలువల్ని, మానవసంబంధాల లోతుల్ని వెతికి, వెలికి తీసి, కథలుగా అల్లి, ఆద్యంతం చదివించేలా రాసే పదును ఈ పాత్రికేయ మిత్రుని కలానికి ఉంది.
జి. వల్లీశ్వర్‌

డాక్టర్‌ ఎస్వీ. సత్యనారాయణ
పేజీలు: 182
ప్రతులకు: 9848645986
వెల: రూ 100

   ఎస్వీ విమర్శలో ఒక ప్రధాన లక్షణం, విమర్శకులకు ఉండవలసిన లక్షణం రచయితల జీవిత విశేషాలను పరిచయం చేయడం. ఇది పాఠకుడికి ఆ రచయితను అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇప్పటికీ ఆధునిక రచయితల జన్మదినాలను గురించి కూడా మనం గందరగోళపడుతున్నాం. అలాంటప్పుడు ఇంతమంది రచయితలు పుట్టిన తేదీలు, ఊళ్ళు, జీవితాలు, అనుబంధాలు, ఉద్యమ జీవితాలు వంటి వాటిని తేదీలతో సహా ఇవ్వడం ఎంతో ఉపకారం.
రాచపాళెం
 

కె. శివారెడ్డి
పేజీలు: 206
ప్రతులకు: 040-24064195
వెల: రూ 80

కళ్ళు మూసుకుంటే/ దృశ్యాలు కనుమరుగౌతాయా/ చెవుల్లో దూది పెట్టుకుంటే/ శబ్దాలు అంతర్థాన మవుతాయా/ లోనికి/ రక్తంలోకి యింకిన ప్రపంచాన్ని/ ఊహల ఊపిరులలోకి/ జొరబడిన ఒక హింసను/ ఎలా ఆర్పగలవు/ దీపపు ఉనికిని పరిహరించలేవు/ తిరస్కరించలేవు
కె. శివారెడ్డి ('అంతం' కవితా చరణాలు)

రవీంద్రనాథ్‌ టాగూర్‌ అనువాదం: ఒద్దిరాజు సోదరులు
పేజీలు: 320
ప్రతులకు: 040-27678430
వెల: రూ 200

ఒద్దిరాజు కవుల నవలానువాదం ఒక విలక్షణ రచన. ఆధునిక ప్రక్రియయైన నవలానువాదానికి పూనుకోవటం వారి నవ్యతా ప్రీతినీ, విస్తారమైన సాహిత్యావలోకననూ ద్యోతకం చేస్తుంది. ఈ రచన ప్రౌఢమైన గ్రాంథిక శైలిలో కొనసాగటం సమకాలీన యుగ ప్రభావాన్ని చాటుతుంది. నాటి సాహిత్య, సామాజిక నేపథ్యాలను అవగాహన చేసుకోవటానికి ఈ గ్రంథం ఉపకరిస్తుంది.
ఆచార్య ఎస్వీ రామారావు

తోకల రాజేశం
పేజీలు: 99
ప్రతులకు: 9676761415
వెల: రూ 100

రాజేశం తీరని దాహంతో ప్రాచీన, ఆధునిక తెలంగాణ చరిత్రను, సాహిత్యాన్ని అధ్యయనం చేస్తున్నారు. అకడమిక్‌ శ్రద్ధతో పాటు శాస్త్రీయ అన్వేషణతో పాటు, సరళంగా వ్యక్తీకరించే నేర్పు - సంఘర్షనాత్మక మైన భిన్న దృక్పథాల అధ్యయనం - సమన్వయం ఈ పదిహేడు వ్యాసాల్లో కన్పిస్తుంది.
అల్లం రాజయ్య

పాయల మురళీకృష్ణ
పేజీలు: 115
ప్రతులకు: 08965-286969
వెల: రూ 90

ఇది మురళీకృష్ణ మొదటి కవితా సంపుటి- ఎక్కువ భాగం చేయితిరిగినతనం కన్పడుతుంది. ప్రాథమికంగా ఉన్న కవితలు తక్కువ- లోలోన గుణించుకుని కవిత్వాన్ని అల్లే పద్ధతేదో మురళీకృష్ణలో ఉంది. అది ఒక చిక్కని నేతగా అతని కవిత్వంలో కన్పడుతుంది. ఈ అల్లికే పాఠకుడి కళ్ళ కడ్డం పడి నిలేస్తుంది. అలా పక్షుల గుంపులా విచ్చుకుంటున్న కవితల్లోకి లాగేస్తుంది.
కె. శివారెడ్డి

పి. అనంతరావు
పేజీలు: 96
ప్రతులకు: 9640708826
వెల: రూ 70

అనంత్‌  మూడు దశాబ్దాల నుండి కవిత్వం రాస్తున్న రచయిత. శ్రామికవర్గ దృక్పధంతో సమ సమాజ ఆశయంతో రాస్తూ గుర్తింపు పొందిన కవి. ఈ కవితా సంపుటికి శీర్షికగా తీసుకున్న 'పొగ జెండా' కవిత కార్మికవర్గానికి చెందిన ఆధునిక మానిఫెస్టో. 'మా చెమట మా జీవితాల ఎజెండా!' అని నిబద్ధతతో చెప్తున్నాడు.
పెనుగొండ లక్ష్మీనారాయణ

సలీం
పేజీలు: 200
ప్రతులకు: ప్రముఖ పుస్తకాల షాపుల్లో
వెల: రూ 120

స్వచ్ఛమైన నీటికొలనులాంటి చెంచుల జీవితాల్లోకి ప్రవేశించి, వాళ్ళ మూలాల్ని పెకలించి, సాంస్కృతిక విధ్వంసానికి పాల్పడిన గుర్రపుడెక్క ఎవరో ఏమిటో చర్చించిన నవల. 'నవ్య' వారపత్రికలో 'అడవిపూలు' పేరుతో ధారావాహికంగా వెలువడిన నవల.
ప్రచురణ కర్తలు

సిర్‌గాపూర్‌ విద్యాసాగర్‌ రెడ్డి,అనువాదం: నిజాం వెంకటేశం
పేజీలు: 230
ప్రతులకు: 040-27678430
వెల: రూ 120

ఈగ్రంథంలో ఈ విశ్లేషణాత్మక అధ్యయనం జరిగింది. ఈ మూడు భాగాలలో మనిషి ఆదిమ సమాజం నుండి ఇప్పటిదాకా పయనించిన తీరు, వస్తుమార్పిడి పద్ధతి, డబ్బు ప్రవేశం, డబ్బు విశ్వరూపం, ధ్వంసమైన ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక సంబంధాలు ప్రకృతి విధ్వంసం మానవుల కనీస అవసరాలు విశ్లేషించబడ్డాయి.
నిజాం వెంకటేశం
 

డా|| సి. నారాయణరెడ్డి
పేజీలు: 168
ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తకాల షాపుల్లో
వెల: రూ 150

ఎంతసేపైనా నేనిలాగే కూర్చుంటాను-/ కదులుతున్న కాలానికి విసుగొచ్చి/ నా రెండు చేతులు పట్టి లేపేవరకు./ నేనిలా కూర్చోవడం/ అలసత్వం ఆవరించి కాదు/ ఏ యోగముద్రలోనో ఊపిరి ఒంటిగా/ దిగబడి ఉన్నందుకు కాదు/ మరెందుకు?/ పొరలు గమ్మిన ఆలోచనలకు/ పదును పెట్టడానికి.
డా|| సి. నారాయణ రెడ్డి ('సృజనయాగం' కవితా చరణాలు)

పారుపల్లి వెంకటేశ్వరరావు
పేజీలు: 112
ప్రతులకు: 9848161208
వెల: రూ 100

మనుచరిత్ర, పారిజాతపహరణం, ఉషా పరిణయం (అనిరుద్ధ చరిత్రము), విజయ విలాసం, శశాంక విజయం, సుప్రసిద్ధ తెలుగు కావ్యాలు. ఈ కావ్యాలలోని మనోరంజకమైన, రసాత్మక సన్నివేశాలతో ''మన తెలుగు కావ్యాలు, రసాత్మక సన్నివేశాలు'' అనే పేరుతో ఈ గ్రంథం రచించాను. ఈ గ్రంథంలో అయిదు కావ్యాల కథలు పూర్తిగా వున్నాయి. ఇది పంచకావ్య సంక్షిప్త కథా రచన.
 పారుపల్లి వెంకటేశ్వరరావు

ముకుంద రామారావు
పేజీలు: 117
ప్రతులకు: 9908347273
వెల: రూ 60

ముకుందరామారావు గారి కవిత్వానికి ఆధార సూత్రం, జీవితాన్ని తాత్వికంగా- ఒక్కొక్కసారి తటస్థంగా - అనుభవించడమని- నేననుకుంటుంటాను. దీనికి తోడు ఆయన తోడు తెచ్చుకున్న గొప్ప కవిత్వ పఠనానుభవం. ముఖ్యంగా చైనా, జపాన్‌ దేశపు కవుల అనుభవంలోని తేటదనం ఆయన బాగా గ్రహించారనుకుంటాను. అలాగే, కవిత్వంలో వాడే భాష తేటగా, నేరుగా అనుభవాన్ని పారదర్శకంగా చూపగలుగుతుంది.
ఇంద్రగంటి శ్రీకాంతశర్మ

శిలాలోలిత
పేజీలు: 140
ప్రతులకు: 9391338676
వెల: రూ 80

శిలాలోలిత కవిత్వమంటే స్త్రీత్వం నుంచి మనిషితనంలోకి సాగే ఒక తాత్త్విక ప్రయాణమనిపిస్తుంది. ఇంతకుమునుపు పంజరాన్నీ నేనే, పక్షినీ నేనే అన్న శిలాలోలిత ఇక్కడ విహంగమూ, విహాయసమూ తానే అయిన స్త్రీ వ్యక్తిత్వాన్ని సమర్థవంతంగా ఆవిష్కరించింది.
పసుపులేటి గీత

డాక్టర్‌ రాధేయ
పేజీలు: 192
ప్రతులకు: 9985171411
వెల: రూ 140

 విస్తృతంగా కవిత్వం పఠించి, జీర్ణించుకుని వ్యాసాలు రాసిన రాధేయ సమకాలీన కవిత్వంపై విమర్శకు పూనుకోలేదు. సూత్రీకరణలు చేసి సిద్ధాంతమేదీ ప్రతిపాదించలేదు. కేవలం కవుల అభిప్రాయాల్ని మాత్రమే విప్పి చెప్పి ఊరుకున్నారు. తను రాస్తున్న విషయానికి అనువుగా ఉన్న కవితలు స్వీకరించారు తప్పితే, కవుల స్థాయీ భేదాలు కూడా గమనించలేదు.
డా|| దేవరాజు మహారాజు
 

రేగులపాటి విజయలక్ష్మి
పేజీలు: 91
ప్రతులకు: 7396036922
వెల: రూ 90

వర్ణనలు, సామెతలు, సంభాషణలు, కొనసాగింపు, మలుపులు, కథనాలు మొత్తంగా ఇతివృత్తం చుట్టూ తిరుగుతూ పాఠకుల్ని చదివిస్తూ ఉంటాయి. ఒకానొక మధ్య తరగతి గృహిణి ఆలోచనలు కథల్లో ప్రతిబింబించాయి. అక్కడక్కడా కథల్లో తొంగిచూసే విస్మయం రచయిత్రి మానసిక స్థాయిని పట్టిస్తుంది. ముగింపులు ఆశయాల్ని ప్రతిఫలించాయి.
-డా|| బి.వి.యన్‌. స్వామి

అక్కినేని కుటుంబరావు
పేజీలు: 112
ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తకాల షాపుల్లో
వెల: రూ 75

''ఏంచెయ్యనక్కా! నేనూ చూస్తున్నా ఓ మంచి మనిషి... ఆడవాళ్లని కూడా మనుషుల్లా చూసే మగమనిషి కనపడతాడేమో అని'' అంది వేణు నవ్వుతూ.
రమాదేవి ఆశ్చర్యపోతూ అంది- ''అయితే ఇంత పెద్ద నగరంలో నీకు మగాడే కనపళ్ళేదంటావ్‌!''
''మగాడా! మగాళ్ళదేముంది? దేశంలో సగం మంది వాళ్లేగా, నాక్కావల్సింది మగాళ్ళలో మనిషి. మనిషి కాని మగాణ్ణి నేను ఇష్టపడలేను.. పడను'' అంది ప్రతి పదాన్నీ వత్తి పలుకతూ.
 అక్కినేని కుటుంబరావు ( నవల ప్రారంభ వాక్యాలు)

డా|| ద్వా. నా. శాస్త్రి
పేజీలు: 256
ప్రతులకు: 9849293376
వెల: రూ 400

అసలు ద్వానా పేరులోనే మెత్తని చమత్కారముంది. అతని పూర్తి పేరు ద్వాదశి నాగేశ్వరశాస్త్రి. ఏ అంశాన్ని తీసుకున్నా దానికి సంబంధించిన సమగ్ర పరిశీలనం, ఆ తరువాత దాని సర్వాంగీణమైన అభివ్యక్తీకరణం ద్వానాశాస్త్రిగారి రచనా ప్రవృత్తిలోని జీవగుణాలు. మరో పార్శ్వం నుంచి చూస్తే చమత్కారోక్తుల ఖజానా ద్వానా. సద్విమర్శకుడు ద్వానా ఈ ''తెలుగు సాహిత్యంలో హాస్యమృతం'' పుస్తకాన్ని తీసుకురావడం అభినందనీయం.
డాక్టర్‌ సి. నారాయణ రెడ్డి

బి.ఎస్‌. రాములు
పేజీలు: 208
ప్రతులకు: 8331966987
వెల: రూ 120

ఇందులోని కథల్లో కొన్ని 1978-1980 మధ్య రాసినవి. అవి ఇటీవలే పత్రికల నుండి సేకరించడం జరిగింది. 1998 ఏప్రిల్‌ మే నెలల్లో పూనా ఇన్‌స్టిట్యూట్‌లో నెలరోజులు శిక్షణ పొందిన తర్వాత నా కథారచనలో మార్పు గమనించవచ్చు. కథ వస్తువు ప్రజెంటేషన్‌లో శైలీశిల్పంలో, సన్నివేశ కల్పనల్లో సంఘటనల చిత్రణలో ఈ మార్పులు చోటుచేసుకున్నాయి.
బి.యస్‌. రాములు
 

రేగులపాటి కిషన్‌రావు
పేజీలు: 129
ప్రతులకు: 9640606404
వెల: రూ 120

రేగులపాటిలో హాస్యం, వ్యంగ్యం కథాగమనంలో జమిలిగా కనిపిస్తాయి. ఇన్నేళ్లుగా కథలు రాస్తున్నాడు కనుక ఆ అనుభవం కథల శిల్పంలోని మెళకువలకు నాంది అయ్యింది. కథనం కూడా గొప్పగా ఉంటుంది. చాలా సంస్కారవంతమైన వాక్యాలు మనల్ని కట్టిపడేస్తాయి.
 డా|| నలిమెల భాస్కర్‌

డా|| నీరజ జవ్వాజి
పేజీలు: 207
ప్రతులకు: 9391028496
వెల: రూ 200

పది సంవత్సరాలలో ఏడు కవితాసంపుటాలు అందించిన అరుణగారు నేడు 65వ జన్మదినం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా వారి కవిత్వాన్నంతా ఒకచోట పరిశీలించాలనే ఆలోచనకు రూపమే ఈ అవలోకనం. ఒకవిధంగా వారికిది జన్మదిన కానుక. అందుకోసం ప్రత్యేకంగా కొన్ని వ్యాసాలు రాయమని కొందరు రచయితలను, విమర్శకులను కోరడం జరిగింది. వారంతా ఎంతో సానుకూలంగా స్పందించి విలువైన వ్యాసాలను అందించారు.
- డా|| నీరజ జవ్వాజి
 

ఎమ్‌.ఆర్‌.వి.సత్యనారాయణమూర్తి
పేజీలు: 912
ప్రతులకు: 9848663735
వెల: రూ 400

 రమ్యసాహితీ సమితి తరపున నూరుమంది కథకులతో ఒక కథా సంకలనం వెలువరించాలని సంకల్పిస్తే ఆ సంఖ్య 123కు చేరింది. ఇంకా అనేకమంది కథల్ని వెయ్యలేకపోయాం. ఒక పరిమితికి లోబడటం వలననూ సంస్థ మరింత ఆర్థికభారం వహించే స్థితిలో లేకపోవటం వలననూ, ఈ సంఖ్య వద్ద ఆగాం.
- ఎమ్‌.ఆర్‌.వి.సత్యనారాయణమూర్తి

డా|| ఎ.వి. వీరభద్రాచారి
పేజీలు: 120
ప్రతులకు: 9391310886
వెల: రూ 100

మారాముకి అరవై మూడేళ్ళు వచ్చాయి. యిన్నాళ్ళు తొక్కిపట్టిన దాన్ని యిప్పుడొదులుతున్నాం. అదెలా వుంటే అలా స్వీకరించండి. అత్యంత సన్నిహితుడు, మిత్రుడు, సోదరుడు అయిన రాము కవిత్వానికి యివ్వాళ లాకులెత్తేశాం - ఆ నీటిలో ఒక వేలయినా ముంచి రుచి చూడండి; రక్తమంటుతుంది, అతని దుఃఖం, ఆవేదన, ఆక్రోశ ఆగ్రహాలు, ఆనందాలు లీలగా అయినా అందుతాయి.
- శివారెడ్డి

బి. హనుమారెడ్డి
పేజీలు: 94
ప్రతులకు: 9440288080
వెల: రూ 50

ఈ నా రచనలో కవిత్వం లేదు. సమాజం లేదు. సమాజం కోసం వ్రాయలేదు. నీటికి మానవజాతికి గల సంబంధ చరిత్ర రేఖామాత్రంగా కవిత నడిచింది. కాగితంపై పెట్టాను. విశ్వంలో 'నీటి ప్రవాహానికి' నేను పావని అని పేరు పెట్టుకున్నాను. పావని కేవలం ఒక ప్రాంతంలో ప్రవహించే నదికాదు గోళ, ఖగోళ వ్యాప్తి.
- బి. హనుమారెడ్డి

శ్రీ నాగాస్త్ర్‌
పేజీలు: 136
ప్రతులకు: 9640317108
వెల:

పాడలేను/ బంగారు మొలతాళ్ళు/వ్రేలాడుతుండగా/ రైతులపై ఉరితాళ్ళు...
నాలుగు గట్లలోని/ మడికాదు/ పొలమంటే?/ అన్నంగిన్నె...
విద్యలో ప్రభుత్వం/ విష ప్రయోగాలు/ విద్యాహక్కు చట్టం/ కార్పోరేట్‌కు చుట్టం...
- శ్రీ నాగాస్త్ర్‌

సుగమ్‌బాబు
పేజీలు: 123
ప్రతులకు: 8096615202
వెల: రూ 60

 బుద్ధుని ఒక్కొక్క పలుకు మన జీవితాలకు మేలుకొలుపు. సుగమ్‌బాబు గారు మూలన పెట్టక, దాన్ని ఒక సుమమాలగా గళాన్ని అలంకరించుకున్నారు. కలాన్ని నడిపించారు. నిజానికి వారు తమ యీ అనువాడ కవితలను ఎన్నిసార్లు తమలో తాము చదువుకున్నరో! అలాగైతేనే అక్షర రమ్యత అనేది సిద్ధిస్తుంది! నానారుచిరార్థ సూక్తినిధిత్వం నెరవేరుతుంది.
- ఆచార్య మసన చెన్నప్ప

డాక్టర్‌ డి. గాయత్రి
పేజీలు: 102
ప్రతులకు: gaya3telugu@gmail.com
వెల: రూ 81

గుండె మాటను కళ్ళెలా వినగలవో తెలియజెప్పే ప్రయత్నం గాయత్రి తన 'స్ఫూర్తిసౌరభం' కవితల ద్వారా చేసింది. గుండె మడిలో కన్నీటిపంటను పండించేందుకు కృషిచేసింది. కదిలించే కవిత్వం ద్వారా కంటినీ-గుండెనూ ఏకకాలంలో ఏడిపించింది. మానవుల మధ్య గాఢానుబంధాలు వర్ధిల్లాలని ఈ కవితలు ఆశించాయి.
- డాక్టర్‌ కె. ఆశాజ్యోతి
 

భూతం ముత్యాలు
పేజీలు: 162
ప్రతులకు: buthammuthyalu@gmail.com
వెల: రూ 100

'గుంపు' సాహితీ సంస్థ ప్రచురణలు కక్క, సిద్ధి, ముల్కి, సూర, పురుడు, ఇగురం, బేగరి కథలు మొత్తం ఎనిమిది పుస్తకాలల్లో కులవృత్తి పదాల్ని వెతికి మాండలిక పదకోశ నిర్మాణానికి ముందడుగు వేసినాడు ముత్యాలు. భాషకు కులవృత్తి జతపరుస్తూ, మాండలికం మలినం కాకుండా భద్ర పరుస్తుండు.
- వేముల ఎల్లయ్య

డా|| చింతకింది శ్రీనివాసరావు
పేజీలు: 208
ప్రతులకు: www.kinige.com
వెల: రూ 150

   విశాఖ సముద్రాన్ని తన కలంలో సిరాగా మార్చుకుని నిరంతర చైతన్య భావధారలతో పాఠకులను పలుకరించే చింతకింది శ్రీనివాసరావు ఇప్పుడీ నానీల పరిశోధన సిద్ధాంత గ్రంథంతో డాక్టర్‌ కావడం ఆశ్చర్యం! ఎందుకంటే, కాలంతో పరుగులు పెడుతూ ఎన్నో ఒత్తిళ్ళతో సతమతమయ్యే పాత్రికేయ వృత్తికారుడికి ఇంత అకడమిక్‌ డిసిప్లిన్‌ ఉండటం అభినందించదగ్గ విషయమే కదా!
- డా|| ఎస్‌. రఘు

పొత్తూరి సుబ్బారావు
పేజీలు: 105
ప్రతులకు: 9490751681
వెల: రూ 90

పొత్తూరి సుబ్బారావు గారి కవిత్వంలో వస్తువుల ఆత్మల్ని వెతికి పట్టుకొని ఆవిష్కరించే దార్శనికత్వం గోచరిస్తుంది. ఆయన కవితలో భాష, భావం సమన్వితమైంది. భావాలకు తగిన సరళ సుందర భాష ఆయనది. పొత్తూరి అంతర్వేదన ఈ కవిత్వం. కవిత్వానికి సామాజిక ప్రయోజనం ఉండాలన్న ఆధునిక కవి పొత్తూరి.
- డా|| తిరునగరి

గుంటూరు శేషేంద్ర శర్మ
పేజీలు: 251
ప్రతులకు: 7702964402
వెల: రూ 200

శ్రీ శర్మ గారు చేసిన పరిశోధనగాని వారి మేధా విశేషము గాని ఆశ్చర్య జనకములుగానున్న వనుటకు సందేహము లేదు. ఆశ్చర్యములలో నాశ్చర్యమేమనగా భారతము రామాయణమునకు ప్రతిబింబమని చేసిన ప్రతిపాదన. సంపూర్ణముగా ప్రతిబింబము కాకపోయినను శ్రీ శర్మగారు చూపించిన స్థలములలోని ప్రతిబింబత్వము నా కాహా పుట్టించినవి. శ్లోకములు శ్లోకములు చరణములు చరణములు వానియంతట వానినే భగవంతుడైన వ్యాసుడు వాడుకొనెను.
- విశ్వనాథ సత్యనారాయణ

పులి అప్పారావు
పేజీలు: 131
ప్రతులకు: 9490394857
వెల: రూ 80

పరిశోధనా గ్రంథాలు డిగ్రీ సాధించడంతోనే చీకటి గుయ్యారాల్లోకి వెళ్ళిపోతాయి. ఈ పరిశోధకుడు మాత్రం ఉద్యమకాలంలో సందర్భోచితమైన అంశాన్ని ఎన్నుకొని నిర్విఘ్నంగా పరిశోధన పూర్తిచేసి ఆ ఫలితాన్ని పాఠకుల ముందుకు తేవడం ఆనందించదగినది.
- డా|| బన్న ఐలయ్య

తంగెళ్ళపల్లి కనకాచారి
పేజీలు: 71
ప్రతులకు: 8790874028
వెల: రూ 50

   మనిషి సంఘజీవి. ఒక మనిషి మనుషుల మధ్య స్నేహవారధిని కడదామంటే ఆ మనిషిని బ్రతకనిస్తారా? మిత్రుడు కనకాచారి అందరితో కలిసిపోయే వ్యక్తి. అందుకే అతను స్నేహమనే వంతెనను నిర్మిస్తూ ఉంటాడు. 'గాయాలైనా బాధపడ్తూ ఉంటాడు' కానీ వంతెన ఆపడు.
- ఆచార్య మసన చెన్నప్ప
 

కీర్తిపాటి
పేజీలు: 47
ప్రతులకు: 9701912841
వెల: రూ 100

ప్రకృతి రక్షణలో చెట్లు చేసే మేలును, వచన, గేయ, సూక్తుల రూపంలో, పాటలరూపంలో పాఠకులకు అందించారు. మనిషి తన జన్మదిన కానుకగా చెట్టును పెట్టి, ఆ చెట్టును కాపాడే బాధ్యతను అతనే తీసుకోవాలని, అది పాఠశాల స్థాయినుంచే ఆచరణ రూపంలో తేవాలనే రచయిత ఆవేదన పరిపూర్ణ ప్రపంచ హితం కాక మరేమవుతుంది?
- ఆచార్య చిట్రాజు గోవిందరాజు

కొట్టి రామారావు
పేజీలు: 72
ప్రతులకు: 9908789405
వెల: రూ 80

కంచికి చేరని కథ' చిన్న నవల. చదివితే కొట్టి రామారావు గారు ఈ ఆలోచనల మాలికకు ఒక రూపాన్నిచ్చారనిపించింది నాకు. వాచ్యం చేయకుండా కొన్ని గంభీరమైన మనస్తత్వ అంశాల ప్రతిఫలనాలు మనకీ నవలలో కనిపిస్తాయి. అయితే పాఠకుడు ఆ ప్రతిఫలనాల మౌలిక తాత్త్వికత పట్ల ప్రేమతో తన చదువుని కొనసాగించవలసి వుంటుంది.
- విహారి

డా|| కత్తి పద్మారావు
పేజీలు: 207
ప్రతులకు: 9849741695
వెల: రూ 100

    కులం సామాజిక, ఆర్థిక దోపిడి అనే ఈ గ్రంథం ఎస్సీ, ఎస్టీ, బి.సి., మైనారిటీలను ఏకం చేసి ఒక రాజకీయ వేదిక రూపొందించడానికి ఉపయోగిస్తుందని ఆశిస్తున్నాను. అగ్ర కుల రాజకీయాధికారంలో వీళ్ళు సంపదనెలా కోల్పోతున్నారో, దోపిడీకెలా గురవుతున్నారో సప్రమాణంగా చెప్పిన గ్రంథమిది.
- డా|| కత్తి పద్మారావు

డా|| కత్తి పద్మారావు
పేజీలు: 188
ప్రతులకు: 08643-421421
వెల: రూ 100

పండ్రెండు సంవత్సరాల నాడు వ్రాసిన ఈ గ్రంథం ఆనాడు ఈ సాహితీవేత్తల్ని, సాహిత్యాన్నీ వస్తువు సిద్ధాంతంతో ప్రమేయం లేకుండా రూపాన్ని మాత్రమే చూసి విశ్లేషించడం జరిగింది. ఇప్పుడు రూపము, వస్తువు, సిద్ధాంతము, అభివ్యక్తి, భాష వంటి పరస్పర సంబంధాలను తులనాత్మకంగా విశ్లేషించటం జరిగింది.
- డా|| కత్తిపద్మారావు

కొమ్ము సుధాకర్‌
పేజీలు: 63
ప్రతులకు: 9959567419
వెల: రూ 25

పొలికేక రెప్పదెర్సిన పొద్దు/ భూమికి జీవికి సోపతి నిద్ర లేపినకల/ ఎనక్కి ముందుకు మోటగిల్ల యుద్ధం/ భూతూ నాతోటిదై కత్తిమొనపై కదిలాడీ/ కానరాని ఆయంల మెండిచ్చిన యాది/ నెత్తురొడ్డిన కనుగుడ్లు ఓ అవమానం!/ ఆదిమర్సినంత చీకటి బుగులుపొగలు...
- తడిగుండె కవితా చరణాలు

డా.సి. నారాయణరెడ్డి
పేజీలు: 181
ప్రతులకు: 040-24224458
వెల: రూ 150

గగనాల యెత్తులను/ సాగరాల లోతులను/ అందుకున్న మేధకు/ మధ్యాహ్న సూర్యబింబాన్ని/ స్పృశించి రావాలనే తపన/ మొదలయింది/ నింగి యెత్తులను అందుకున్నప్పుడు/ కడలి లోతులను చూసినప్పుడు/ తనకు ఏ అంతరాయం/ కలగలేదు/ ప్రచండ భానుగోళాన్ని/ సమీపిస్తుంటే/ మేధాబింబం/ సలసల కాగిపోయింది....
- మేధా సముజ్వలనం కవితా చరణాలు
 

పనసకర్ల ప్రకాశ్‌ (నానీ)
పేజీలు: 52
ప్రతులకు: 9346365618
వెల: రూ 50

 మొగలి చెరువు నిండా పల్లె కలువల ఘమఘమ లున్నాయి. మూడొంతుల పైదాకా నానీలు గ్రామ వాతావరణాన్ని ప్రతిబింబించేవే! కుటుంబం, నాన్న, అమ్మ, వృద్ధులు, కోళ్ళతోబాటు కొన్ని చోట్ల లోతైన తాత్వికత కూడా కనిపిస్తుంది. ఒకప్పుడు నిర్మలమైన హృదయాల ప్రజలున్న పల్లెలు ఈ నానీలు.   
- డా|| సి. భవానీదేవి

జనసాహితి ప్రచురణ
పేజీలు: 172
ప్రతులకు: 9440167891
వెల: రూ 50

ప్రజల భాషలో విద్యా, పరిపాలనా సాగక పోవటానికీ, సాంస్కృతిక సామ్రాజ్యవాదానికీ గల లంకెను మనం స్పష్టంగా అర్థం చేసుకొంటే భాషా పునరుజ్జీవనం సాంస్కృతిక జాతీయ పునరుజ్జీవనంలో అంతర్భాగంగా గుర్తించి సాంస్కృతిక సామ్రాజ్యవాదాన్ని పారద్రోలే చర్యలు తీసుకోగలుగుతాము.
- జనసాహితి

దివికుమార్‌ వ్యాసాలు
పేజీలు: 132
ప్రతులకు: 94401 67891
వెల: రూ 50

విస్పష్ట లౌకిక దృక్పధాన్ని అందించిన, అలవరుచుకున్న ప్రత్యేకతా  భగత్‌సింగ్‌ బృందపు విశిష్టతలలో భాగం. అలాగే సహాయ నిరాకరణో ద్యమాన్ని అర్ధాంతరంగా విరమించిన కాలంనాటి నుండి ఇర్విన్‌తో ఒడంబడిక కుదుర్చుకున్న దాకా గాంధీని గురించిన భగత్‌సింగ్‌ భావనలలో సాధించిన పరిణతిని... ఇవన్నీ ఈ వ్యాసాల ద్వారా మనం చూస్తాము.
- జనసాహితి

బి.ఎస్‌.రాములు, వనమాల చంథ్రేఖర్‌
పేజీలు: 176
ప్రతులకు: 8331966987
వెల: రూ 100

 అందరి కృషి కలిపి చూసినప్పుడు ఒక గొప్ప రాశిగా, వాసిగా కనపడుతుంది. సమిష్ఠి కృషిలో జిల్లా కథా సంపుటాలు ఇలా మరిన్ని తీసుకొచ్చినప్పుడు వాటివైవిధ్యం మరింత తేటతెల్లమవుతుంది. కరీంనగర్‌ జిల్లా కథల సంపుటాలు ఏటా తీసుకురావడం ఎంతో అవసరం. యువతరం రచయితలు ఇందుకు పూనుకోవడం అవసరం. మా కృషి మేరకు ప్రస్తుతానికి ఇది నాలుగో సంపుటి.
- బి.ఎస్‌. రాములు

బెల్లంకొండ సంపత్‌కుమార్‌
పేజీలు: 118
ప్రతులకు: 99085 19151
వెల: రూ 60

బెల్లంకొండ సంపత్‌ కుమార్‌ రాసిన కవితలన్నీ నిబద్ధమైనవే. నిజాయితీ గలవే. స్పష్టంగానే సరళంగానే సూటిగానే సున్నితంగానే ఉంటాయి. కవిత్వంలో చెప్పే అంశాలు ఘటనలు, సంఘటనలు, సందర్భాలు, వైరుధ్యాలు, వాదవివాదాలు, ధోరణులు, ఉద్యమాలు ఇలా ఏవైనా ఆయన భాజాలంలోంచే దృష్టిలోంచే దృక్పథంలోంచే మొలకెత్తుతాయి.
- డా. నాళేశ్వరం శంకరం

భూషికృష్ణదాసు
పేజీలు: 94
ప్రతులకు: 040-2724 0213
వెల: రూ 40

కవి ఎంతటి భావాంబర వీధుల్లో విహరిస్తున్నా అతని పాదాలు మాత్రం నేలమీదే ఉన్నాయనడానికి ఈ సంపుటిలో అనేక కవితలు ఉదాహరణలుగా నిలుస్తాయి. సమాజంలో వున్న ఆర్థిక వ్యత్యాసాల్ని అసమానతల్నీ అత్యంత సహజంగా వాస్తవిక చిత్రణతో నర్మగర్భంగా మనముందుంచారు కవి.
- శిఖామణి

వేముల ప్రభాకర్‌
పేజీలు: 160
ప్రతులకు: 9247040332
వెల: రూ 100

కొద్దిపాటి తేడాలతో ఏ ఊరి కథలైనా ఇలాగే ఉంటాయి. అమ్మ, నాన్న, అన్న, దోస్తులు, పాఠశాలలో ఉపాధ్యాయులు, పాలేర్లు, ఇంటి పనుల్లో సహాయపడేవాళ్ళు... అంతా కలిసి రచయిత పుట్టి పెరిగిన ఊళ్ళో ఒక చిన్న ప్రపంచం! ఆ చిన్న ప్రపంచంలోనే విశాలమైన ఒక ఎల్లలు లేని జీవితాన్ని ఆవిష్కరించారు రచయిత.
- డా|| దేవరాజు మహారాజు

శ్రీమతి పత్తి సుమతి, ఎమ్మెస్సీ
పేజీలు: 80
ప్రతులకు: 87904 99405
వెల: రూ 50

మహాకవి శ్రీశ్రీ జీవితం. తెలుగు సాహిత్యంలో అతను ప్రవేశపెట్టిన వినూత్న ప్రయోగాలు, కావ్యలోకంలో నెలకొల్పిన విప్లవాత్మక ప్రమాణాలు యావత్‌ విద్వత్‌లోకాన్నీ అపూర్వస్థాయిలో ప్రభావితం చేశాయి. అసలు, శ్రీశ్రీ జననమే ఒక మహా 'అణు విస్ఫోటనం'! అలాంటి మహాకవి గురించి విద్వన్మణి పత్తి సుమతి, శ్రీశ్రీని ఆయన కవిత్వాన్ని పలుకోణాల నుంచి అధ్యయం చేసి రాసిన కొన్ని అర్థవంతమైన వ్యాసాలు, హృద్యంగా ఉన్నాయి.- డా|| ఎ.బి.కె. ప్రసాద్‌

సయ్యద్‌ అమీర్‌
పేజీలు: 78
ప్రతులకు: 97000 01104
వెల:

ఈ సంకలనం పాఠకులకు సమాజం పట్ల లౌకిక భావనావసరాన్ని ఆలోచింపజేస్తుంది.  మతాలకు సంబంధించిన సంకుచిత భావజాలం నుండి బయలుపడేలా చేస్తుంది. విశాల సామాజిక భూమిక నుండి చరిత్రను అధ్యయనం చేయాల్సిన సమగ్ర దృక్పథాన్ని కలిగిస్తుంది. సింగమనేని నారాయణ

చీపెల్లి బాపు
పేజీలు: 63
ప్రతులకు: 98498 63034
వెల: రూ 50

ఈ కావ్యం మంచి-చెడుల విషయానికి వస్తే కావ్యం ఏకవస్తువు ప్రాతిపదికన ప్రారంభమవుతుంది. కాని మధ్యలో తెలంగాణతో ముడిపడి ఉన్న సామాజిక తెలంగాణ కూడా వస్తువులో సంలీనం చెందింది. తెలంగాణను తల్లిగా భావించి ఇక్కడ జరిగిన అనేక పోరాటాల పలవరింత కావ్యంలో కన్పిస్తుంది.
 డా|| సి. కాశీం

డా|| నాగసూరి వేణుగోపాల్‌ -కోడీహళ్లి మురళీమోహన్‌
పేజీలు: 264
ప్రతులకు: 97013 71256
వెల: రూ 150

ఈ పుస్తకంలో మొత్తం అరవైకి పైగా రచనలున్నాయి. ఆరు విభాగాలున్నాయి. సర్దేశాయి గారితోపాటు మరో 14 మంది రచనలు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ప్రతి విభాగం ముందు ఇచ్చిన చిన్న ఉపోద్ఘాతం మీకు ఎంతోకొంత దోహదపడుతుంది.
 డా|| నాగసూరి వేణుగోపాల్‌
కోడీహళ్లి మురళీమోహన్‌

వరకుమార్‌ గుండెపంగు
పేజీలు: 167
ప్రతులకు: 99485 41711
వెల: రూ 100

ఈ మానవ సమాజం వారు చెప్పేమాటలకు కుక్కలా తోక ఆడిస్తూ జంతువులకన్నా హీనముగా జీవిస్తున్నాడు. అయిన జంతువుల్లో ఈ దైవ భావన లేదుకదా! ఎందుకంటె మనిషి పూజించే రూపాల్లో ఎక్కువగా జంతురూపాలే. కాబట్టి ఆ జంతువులే వీళ్ళకు దేవుళ్ళు. వీరి మాటలు విని, వీరి కోర్కెలు తీరుస్తవంటా. లేని పోని ఈ మత భావన జంతువులకు పాకించిన ఘనత. ఏదిఏమైనా ఈ మనుష్యలకే చెల్లుతుంది.                            (నవలా భాగం)

రెక్కల సంపుటి
పేజీలు: 56
ప్రతులకు: 9393804472
వెల: రూ 40
తంగిరాల చక్రవర్తి రెక్కల్లో 'విసురు' అనే లక్షణం బాగా కనిపిస్తుంది. దానిక్కారణం, తన రాజకీయ విమర్శంతా ఖండితంగా, చెప్పినట్టుంటుంది. తన అభిప్రాయాల్ని నిర్భీతిగా, వేగవంతమైన శైలితో, శక్తిగల పదాలతో చెప్పడం వల్ల ఈ 'విసురు' అనే లక్షణం సిద్ధిస్తుంది. 
 డా || - అద్దెపల్లి రామమోహనరావు 
 
కొండి మల్లారెడ్డి పర్కపెల్లి యాదగిరి
పేజీలు: 97
ప్రతులకు: యువసాహితి సమితి
వెల: రూ 50

ఈ కవితలు వ్రాసే ప్రయత్నంలో కవిమిత్రుల మందరం ఏ వర్గాన్ని కించపరచకుండా చేతివృత్తుల ఆత్మగౌరవాన్ని పెంచే విధంగా వ్రాయాలనుకున్నాము. ఇంతకుముందే కొందరు కవులు కొన్ని వృత్తులను కవిత్వీకరించారు. అవికూడా మాకు ఎంతో ఉపకరించాయి. 
సంపాదకులు

 
ఎస్‌.ఆర్‌. పృథ్వి
పేజీలు: 112
ప్రతులకు: 9989223245
వెల: రూ 75
కవిత్వంలో ఎన్నో వస్తువులు వచ్చేసినై. ఐతే కవి చెప్పే ధోరణి, కొత్త భావాలు భావాంశాలు, భావాల్లోని కొత్త కోణాలూ మొదలైనవన్నీ కవిత్వాన్ని నవనవం చేస్తై. అయితే వస్తువు కొత్తది కావడం కూడా ఒక కొత్త ద్వారాన్ని తెరుస్తుంది. ఇలాంటి కొన్ని వస్తువుల్ని పృథ్వి ఈ కవితా సంపుటిలో గ్రహించాడు.
అద్దేపల్లి 
తమ్మినేని అక్కిరాజు
పేజీలు: 98
ప్రతులకు: మైత్రీ బుక్స్‌
వెల: రూ 50
బానిస మనస్తత్వాల మధ్యతరగతి వర్గాలపై జాలితో కూడిన విమర్శ అక్కిరాజు రచనల్లో కనిపిస్తుంది. ప్రజల కోసం తమ జీవితాలను తృణప్రాయంగా ఎంచి త్యాగాలకు సిద్ధపడిన, త్యాగం చేసిన వారి పట్ల ఎంతో ప్రేమ - అభిమానం కురిపిస్తుంది. 
జన సాహితి
మెరాజ్‌ ఫాతిమా
పేజీలు: 112
ప్రతులకు: 9000173860
వెల: రూ 60
ఫాతిమా కవితలు చాలామటుకు వ్యక్తిగత జీవితాగ్ని శకలాలుగా కనిపించినా అవన్నీ సామాజికమై చదువుతున్న మనల్ని ఎంతో వేదనకు గురిచేస్తాయి. రొమాంటిక్‌ పొయెమ్స్‌గా భ్రమింపజేస్తున్న ఈ కవితలన్నీ, జీవిత సహచరుల ప్రేమానురాగాలు కోల్పోయి జీవచ్ఛవాలై కళ్లల్లో వొత్తులేసుకొని ఆర్తితో దైన్యంగా వాళ్ల నుండి కాసింత తడిచూపు కోసం స్త్రీతనం చేసిన పలవరింతలుగా స్ఫురిస్తాయి.  
డా|| శాంతి నారాయణ
రామా చంద్రమౌళి
పేజీలు: 140
ప్రతులకు: రామచంద్రమౌళి
వెల: రూ 150
ఐతే.. ఏ కవైనా ఈ ఆగాధ అద్యంత రహిత శూన్యంలో ఒక అసంపూర్ణత నుండి సంపూర్ణతవైపు నిర్విరామ నిరంతర పయనం జరుపవల్సిందే.. ఆ అంతులేని యానంలో యింకో నా మజిలీ ఈ 'అంతర'.
- రామాచంద్రమౌళి
కన్నెగంటి వెంకటయ్య
పేజీలు: 37
ప్రతులకు: 9885657582
వెల: రూ 30
ప్రతీ పాటలో నిజాయితీ తొణికిసలాడుతుంది. కవితోపాటు గాయకుడు కూడా కావటం వలన వెంకట్‌ను వాగ్గేయకారునిగా చేసింది. తాను రాసిన పాటకు తానే బాణి కట్టుకొని పాడి ప్రజల్ని రంజింప చేయడం చిన్న విషయం కాదు. అనితర సాధ్యమైన సాధనతో దానిని సాధించాడు వెంకట్‌. 
దేవేంద్ర
కందుకూరి వెంకట మహాలక్ష్మి
పేజీలు: 173
ప్రతులకు: 9868237137
వెల: రూ 100
ఆమె మహానగరాల్లో జీవించడమేకాదు, పరిమిత మధ్యతరగతి సంసారాల్లో తరుచు ఎదురయ్యే మానవ సంబంధ సమస్యల్ని చూసి ఊరుకోకుండా వాటిగురించి గట్టిగా తమ కథల్లో మాట్లాడే స్వభావం కలవారు. ఉద్యోగాలు చేశారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముఖ్యంగా మధ్యతరగతి జీవితాల ఆటుపోట్లని, తమ స్త్రీ మనస్సుతో అర్థం చేసుకుని, వ్యాఖ్యానించారు. 
ఇంద్రగంటి శ్రీకాంత్‌శర్మ
ఎన్‌. వేణుగోపాల్‌
పేజీలు: 164
ప్రతులకు: 040-66843495
వెల: రూ 60
ఇటీవలి కాలంలో, ముఖ్యంగా ప్రపంచీకరణ తరువాత చాలా మార్పులు జరిగిపోయాయని, గ్రామాలలో ఉత్పత్తి సంబంధాలు మారిపోతున్నాయని ఒక అభిప్రాయం బలపడుతోంది. ఈ నేపథ్యంలో గ్రామీణ అధ్యయనాలకు మళ్లీ ఒకసారి ప్రాధాన్యత పెరుగుతోంది. గ్రామాలు గ్రామాలలో ఉత్పత్తి సంబంధాలు ముప్పై ఏళ్ల కింద ఉన్నట్లే యథాతథంగా ఇవాళ కూడా ఉన్నాయని వాదించడం అర్థరహితమే అవుతుంది. 
 ప్రచురణకర్త
అభిలాష
పేజీలు: 368
ప్రతులకు: 9666222737
వెల: రూ 225
నాలోకం నాది.. నిప్పులతో ఆటాడు.. విజయాన్ని ముద్దాడు.. తెలుసుకో నేస్తం.. గ్రహించు వాస్తవం.. ఇలా చాలా కవితలలో ఎన్నో సామాజిక సత్యాలను కుమ్మరించింది. అభిలాషకు రాసే ప్రతి అక్షరంలో రగిలే నిజాలనే వెళ్ళగక్కాలని ఆశ.... మనసులో మరిగి మరిగి మండుతున్న మనోభావాలని మాగొప్పగా బట్టబయలు చేసి చూపాలని ఆశ... మార్పు తేవాలని ఆశ.. మార్చి పారేయాలని ఆశ... మరో వేమనలా అభిలాష ఎదగాలని నా ఆశ. 
 నూర్‌ భాషా రహంతుల్లా
డా|| జె. భాగ్యలక్ష్మి
పేజీలు: 86
ప్రతులకు: అన్ని ప్రముఖ షాపులు
వెల: రూ 60
భాగ్యలక్ష్మి తమ జీవితంలోని అనుభవాలను, యాత్రా స్మృతులను తమ రచనల్లో శకలాలు శకలాలుగా పాఠకుల కళ్ళ ముందు దృశ్యమానం చేస్తారు. 'వసంతం మళ్లీ వస్తుంది' కవితాసంపుటి కవయిత్రి తాత్త్విక చింతనకు అద్దం పడుతుంది. 
 సూర్య ప్రచురణలు
శ్రీపాద స్వాతి
పేజీలు: 188
ప్రతులకు: 040-65811258
వెల: రూ 100
 ఎన్నేళ్లనుండో ఎదురుచూస్తున్న స్వల్ప ఆనంద డోలిక, చివరి క్షణంలో పుటుక్కున తెగిపోయినా ''యజ్ఞఫలం'' దక్కటంలోనే పరమార్దం వుందని చెప్పటం. మధ్యతరగతి మనుషులకే చెల్లు. ఈ నేపథ్యంతో ఆమె కథలన్నీ పరిశీలించండి. 
 - మునిపల్లి రాజుం
డా|| అద్దేపల్లి రామమోహనరావు
పేజీలు: 114
ప్రతులకు: 9849150303
వెల: రూ 100

   ప్రపంచీకరణ నేపథ్యంలో మనదేశంపై జరుగుతున్న సాంస్కృతిక దాడిని దాని వల్ల కలిగే విధ్వంసాన్నీ, పతనాన్ని, పరాధీనమై చితికిపోతున్న బతుకుల్నీ కళ్లకుకట్టినట్టు కవిత్వంలో దృశ్యమానం చేస్తున్నారు అద్దేపల్లి ఈ సంపుటిలో. ఆయన కవిత్వంలో ఆర్తి ఉంది. అన్నిటినీ మించి మనదేశం అస్తిత్వాన్ని కోల్పోతున్నదన్న ఆవేదన ఉంది.
- తాళ్లపల్లి మరళీధరగౌడు

పిడుగు పాపిరెడ్డి
పేజీలు: 133
ప్రతులకు: 9490227114
వెల: రూ 100

   ఈ కథలను పరిశీలిస్తే కథకుడిగా పాపిరెడ్డి ఎంత పరిణతి సాధించాడో మనకర్థమౌతుంది. ఈ కథలన్నింటిలోను మనుషులను విభజించే కులమతాల కతీతమైన స్వచ్ఛమైన మానవతా దృక్పథం కనిపిస్తుంది. ఉన్నత సామాజిక వర్గాల్లోని స్వార్థపరత్వాన్ని, పురుషాధిక్య సమాజంలో స్త్రీలకు జరుగుతున్న అన్యాయాన్ని, అణచివేతను, విద్యార్థులకు ఆదర్శప్రాయంగా నిలవాల్సిన ఉపాధ్యాయుల నైచ్చాన్ని, అన్యాయానికి గురైనప్పుడు ఎంత బలహీనుడైనా తిరగబడే పరిస్థితిని పాపిరెడ్డి ఈ కథలలో చిత్రించాడు.
- అంపశయ్య నవీన్‌

గాదె వెంకటేష్‌
పేజీలు: 87
ప్రతులకు: 9849722127
వెల: రూ 40

  ఉద్యమ క్షేత్రంలో నిలబడి కవిత్వం రాయడం తెలంగాణ బహుజన కులాలకు కొత్తకాదు. తెలంగాణసాయుధ రైతాంగ పోరాటం నుంచి మొదలు విప్లవ, దళితోద్యమాలే కాకుండా ప్రస్తుత తెలంగాణ విముక్తి ఉద్యమం వరకు ఈ ఒరవడి వారసత్వంగా వస్తున్నది. దీని కొనసాగింపుగానె గాదె వెంకటేషు ఒక వుద్యమకారునిగా రాసుకున్న స్పందనలే ఈ పుస్తకం నిండా పరుచుకున్నాయి.
- పసునూరి రవీందర్‌

అనిశెట్టి రజిత
పేజీలు: 304
ప్రతులకు: 9849482462
వెల: రూ 250

   తెలంగాణా పది జిల్లాల వైశిష్టతను ఈ సంకలనంలో కొంతమేరకే చేర్చగలిగినం. అయితే కొన్ని జిల్లాల నుండి ఎంత కోషిష్‌ జేసినా కవుల స్పందన లేకపోవడం వలన కవితలు రాబట్టలేక పోయినం. ఈ సంకలనం సంపూర్ణ తెలంగాణ విశిష్టతను ప్రతిబింబించలేదు. తెలంగాణా చారిత్రక, సాంస్కృతిక, ఉద్యమం విశిష్టతలు పాక్షికంగానే ప్రస్తావన కొచ్చినయి.
- అనిశెట్టి రజిత, కొమర్రాజు రామలక్ష్మి, తదితరులు

షేక్‌ కరీముల్లా
పేజీలు: 100
ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు
వెల: రూ 50

   నిత్యం అసత్య ప్రచారాలతో ఫాసిజాన్ని వ్యాప్తి చేస్తూ ముస్లిం సమాజాన్ని నేరస్థసమాజమని, ఉగ్రవాద సమాజమని ఖరారు చేస్తూ బోనులో నిలబెట్టాలని చూస్తున్నాయి. ఈ విపరీత, విపత్కర పరిస్థితులలో ఈ సమాజంలో పుట్టిన కవిగా వివిధ సందర్భాలలో స్పందించి తెలుగు దినపత్రికలకు వ్యాసాలు రాశాను. ఆ వ్యాసాల సమాహారమే ఈ పుస్తకం.
 షేక్‌ కరీముల్లా

డా||.వి.ఆర్‌. రాసాని
పేజీలు: 105
ప్రతులకు: 9848443610
వెల: రూ 60

   నా కథలు కొన్ని నాటికలుగాను, నాటకాలుగాను నాటకీకరింపబడ్డాయి. అలాంటి వాటిగురించి ఒకసారి చర్చించుకుంటున్న సందర్భంలో సాహిత్య విమర్శకులు, ఎస్వీ యూనివర్శిటీలోని తెలుగు అధ్యయన శాఖలో ఆచార్యులు, మిత్రులు డా|| మేడిపల్లి రవికుమార్‌గారు, అలాంటి నాటికలను వాటి మూలకథలతో బాటుగా ఒక పుస్తకం వేస్తే బాగుంటుందని సూచించారు. వారి సూచన కనుగుణంగానే ఈ పుస్తకం ముద్రించడం జరిగింది.
 రాసాని

డా|| దీర్ఘాశి విజయభాస్కర్‌
పేజీలు: 104
ప్రతులకు: పాలపిట్ట బుక్స్‌
వెల: రూ 70

    కావ్యం పేరు 'మహాశూన్యం' దీన్ని 'అనుభావ కావ్యం' అన్నారు డి. విజయభాస్కర్‌. అనుభావమనేది ఆలంకారిక పదం. లాక్షణికులు విభావానుభావ సాత్త్విక వ్యభిచారిభావ సముచ్చయాన్ని పేర్కొన్నారు. బౌద్ధమతం అవసానథలో శూన్యవాదం ఆ మతంలోని ఒక శాఖగా రూపొందింది. డా || విజయభాస్కర్‌ అటు బౌద్ధమతపరమైన శూన్యాన్ని, ఇటు అలంకార శాస్త్రపరమైన అనుభావాన్ని మేళవించి కవితాపరంగా ఒక వినూత్న సృష్టి చేశాడు.  
- డా||సి. నారాయణరెడ్డి

నానీలు చల్లా రాధాకృష్ణమూర్తి
పేజీలు: 39
ప్రతులకు: 9848468782
వెల: రూ 60

       ఆయన నానీలు వ్రాయడానికి నేపథ్యంలో ఆయన సుదీర్ఘమైన, గంభీరమైన జీవితానుభావాలు ఉన్నాయి. తెల్లారేసరికి పువ్వులు భళ్ళున పూసినట్లే ఉంటాయి. కానీ ఆ పూవుకు ప్రారంభం ఎప్పుడో మట్టిలోనే జీవకణ సంచలనంలోనే జరిగింది. అలా సహజ రమ్యంగా వెలువడిన నానీలే ''అక్షర హారతి'' పొద్దున్నే ఇస్తున్న హారతిలో కదిలే చిన్న చిన్న దీప కళికలే ఈ 'నానీలు'.
 ఎన్‌. గోపి

డా|| బండి సత్యనారాయణ
పేజీలు: 92
ప్రతులకు: 040-27678430
వెల: రూ 70

    రంగుల, మాయల, సాంకేతికతల, ముసుగుల, నాజూకుల, అబద్ధాల, లౌక్యాల మయపు ఆధునిక వాతావరణంలో బండి సత్యనారాయణ సరళంగా, స్పష్టంగా, తేటగా, అంకితభావంతో మనిషి సగటు జీవితపు దృశ్యాల్ని మనకళ్ళ ముందుంచాడు, ఈ కవితల ద్వారా, వ్యాపార సంస్కృతి మనిషి తనాన్ని తినేస్తున్న సందర్భంలో ప్రత్యామ్నాయ సంస్కృతికి దాఖలా ఈ సంపుటి.
 దర్భశయనం శ్రీనివాసాచార్య

యల్లాప్రగడ ప్రభాకరరావు
పేజీలు: 128
ప్రతులకు: 9908648474
వెల: రూ 120

   హిందీ భాషలో శ్రీ జగదీశ్వరానంద సరస్వతి స్వామి అర్థతాత్పర్యయుక్తమైన వ్యాఖ్యానం వ్రాయగా, దానిని తెనాలి వాస్తవ్యులు, ఆర్య సమాజీయులు అయిన ఆరుమండ్ల వెంకయ్యార్యులు ఆంధ్రీకరించారు. దాని ఆధారంగానే ప్రస్తుత - యల్లా ప్రగడ ప్రభాకరరావు 'చాణక్య నీతిమాలికలు' విరచితమైంది. ప్రవేశికలోని 3 పద్యాలు, 17 భాగాలలోని 325 పద్యాలు, అనుబంధంలోని 14 పద్యాలు కలుపుకొని మొత్తం 342 పద్యాలు, వానికి సరళమైన వచనంలో భావం ఇందున్నాయి.
- డా. ఎస్వీ రామారావు

ఎం. రాఘవాచారి
పేజీలు: 163
ప్రతులకు: 9985203376
వెల: రూ 100

    రచన పాఠకులను చేయిపట్టుకొని రచయిత తిరిగిన తొవ్వలవెంబడి తిప్పుతుంది. రచయిత చూసిన లోకపు చీకటి మూలల దగ్గర నిలబట్టి దుఃఖాన్ని, ద్వేషాన్ని వాళ్ళలోకి ప్రవహింపచేస్తుంది. ఒక వెర్రిగొంతుక విచ్చుకొని నినాదమై ఊరేగింపు ముందు నిలబడడానికి ప్రేరణ అవుతుంది. ఉదయమిత్ర కథలు ఇంతపనీ చేస్తాయి.
కాత్యాయని విద్మహే

కొండముది సాయికిరణ్‌ కుమార్‌
పేజీలు: 70
ప్రతులకు: 040-27678430
వెల: రూ 50

   కిరణ్‌ కవిత్వం చాలా చక్కటి చిక్కదనమున్న రూపం. ఎక్కడా పట్టుకోల్పోడు. వస్తు రూపాల మధ్య చక్కటి బ్యాలన్స్‌ కనపడుతుంది. అయితే, నేటి ఆంధ్రదేశంలో కుప్పలు తెప్పలుగా కుకవిత్వపు తుఫాను రేగుతున్న ఈ కాలంలో తొలకరి సువాసనల ఫ్రెష్‌నెస్‌తో కిరణ్‌ కవిత్వం వినిపిస్తున్నాడు.
 ఇక్బాల్‌ చంద్‌

దేవరాజు మహారాజు
పేజీలు: 150
ప్రతులకు: 9908633949
వెల: రూ 150

భా షలు, ప్రాంతాలు, సంస్మృతులు వేరైనా అందరూ కొన్ని మౌలిక సూత్రాలను అనుసరించి రచనలు చేసినవారే, చేస్తున్నవారే. ఒక విశాల ప్రాతిపదిక మీద, భారతీయ జీవన ఔన్నత్యాన్ని, ప్రపంచానికి చాటిచెబుతున్నవారే. విభిన్న పార్శ్వాల నుంచి జాతీయ సమైక్యతకు దోహదం చేస్తున్నవారే. వ్యక్తిత్వ వికాస పురోగమనం భారతీయ రచయిత్రుల విజయ కేతనం
ప్రచురణకర్త

 

 

 

 

ఎల్‌.ఆర్‌. స్వామి
పేజీలు: 112
ప్రతులకు: 040-27678430
వెల: రూ 60

2006 నుంచీ 2012 దాకా స్వామి రచించి ప్రచురించిన పదమూడు పెద్ద కథలు, మరో ఆరు మినీ కథలనొచ్చేమో, అవీ వెరసి పంధోమ్మిది కథల తాజా సంపుటి ఇది. రచయితగా స్వామిపరిణామక్రమాన్ని తెలియచేసే కథలివి. ఏ కథకుడి రచనయినా దేశ కాలాదులను చిత్రిస్తుంది కాబట్టి ఆ మేరకు 2006-2012 మధ్య వచ్చిన మార్పులు కూడా ఇతివృత్త పరిమితులకు లోబడి స్వామి ఈ కథల్లో చిత్రించారని గమనిస్తాము.
రామతీర్థ

సుగమ్‌బాబు
పేజీలు: 123
ప్రతులకు: 8096615202
వెల: రూ 60

 స్వీయవాదాలకు అనుగుణంగా మూలార్ధాన్ని సమన్వయం చేసిన వారు కూడా ఉన్నారు. కాని వీరందరికి భిన్నంగా సుగమ్‌బాబు ధమ్మపదాన్ని సరళ సుబోధకంగాను ధారాశోభితంగానూ, బుద్ధుని అంతరంగం మనముందు చక్కగా ఆవిష్కరింపబడే విధంగానూ కవిత్వీకరించారు.
ఆచార్యమబిసన చెన్నప్ప

ఎల్‌.ఆర్‌. వెంకటరమణ
పేజీలు: 144
ప్రతులకు: 9866158908
వెల: రూ 80

ఈ వ్యాసాలు చదువుతుంటే రచయిత జీవన దృక్పథం, సౌందర్య దృష్టి, సృజనాత్మక ఆలోచనా రీతి బోధపడతాయి. వెంకటరమణ అధ్యయనంలోని విస్తృతి ఈ వ్యాసాల్లో ప్రతిఫలిస్తుంది. తెలుగు, ఆంగ్ల సాహిత్యాల్ని చదువుకోవడం, చిత్రకళా చరిత్రను ప్రత్యేకంగా అభ్యసించడం, కొత్తగా చూసే దృష్టిని అలవరుచుకోవడం కారణంగా ఈ వ్యాసాలకు నిండుదనం వచ్చింది.
గుడిపాటి

డా|| శ్రీలత
పేజీలు: 104
ప్రతులకు: 040-27678430
వెల: రూ 50

''మృత్యుమోహనం'' కావ్యంలో శ్రీలత మరణం గురించిన ఆలోచనలు మన ముందుంచారు. జీవితాన్ని గురించి అందరూ ఆలోచిస్తారు మరణం గురించి ఆలోచించటమే అపూర్వం. అసలిలాఆలోచించడానికి కూడా ఆత్మబలం వుండాలి. ఎవరో అన్నట్టు ''జీవితంపై మనకున్న అభిప్రాయం మరణంపై ఉన్న అభిప్రాయంపై ఆధారపడి ఉంటుంది'' నిజమే శ్రీలత స్థితప్రజ్ఞత్వానికి ఈ కావ్యం మచ్చుతునక.

డా|| ద్వా.నా. శాస్త్రి

ఆత్మీయ నిర్మల (లక్కరాజు)
పేజీలు: 115
ప్రతులకు: 9949299618
వెల: రూ 200

ఈ సంపుటిలోని కవితలను పరిశీలిస్తే శ్రీమతి నిర్మల కవితా ప్రతిభ క్రమక్రమంగా అంతర్ముఖీనంగా పరిణమిస్తున్న విషయం తెలిసిపోతుంది. చుట్టూ ఉన్న సమాజాన్ని సూక్ష్మంగా పరిశీలిస్తూనే అంతరంగం పొరల్లోకి తొంగి చూసే తాత్విక దృక్పథం శ్రీమతి నిర్మలకు అలవడింది.  
సినారె

కూనపరాజు కుమార్‌
పేజీలు: 130
ప్రతులకు: 9989999599
వెల: రూ 95

నా అనుభవాలు, ఆలోచనలు అంతీర్లీనంగా ఈ కథలలో వున్నాయి. ఇది నా మొదటి పుస్తకం. మీరు అభిప్రాయాలను సూటిగా తెలియజేస్తే, నాకు ఎంతో సహాయం చేసిన వారవుతారు. ఈ పుస్తకంలోని అన్ని కథలు గత నాలుగు సంవత్సరాల నుంచీ వ్రాసినవే.
కుమార్‌ కూనపరాజు

మంత్రి కృష్ణమోహన్‌
పేజీలు: 95
ప్రతులకు: 9441028186
వెల: రూ 60

కవికి వస్తుబలంతో పాటు చక్కని శైలి కూడా వుండాలి. శైలి కవి భావ విధానంలో ఒక భాగమైనప్పుడే అతనికి బలమైన అభివ్యక్తి సమకూరుతుంది. సరిగ్గా అటువంటి ప్రయత్నంలో వున్నవాడు మన మంత్రి కృష్ణమోహన్‌, గుండెల నిండుగా ఉన్న సంవేదన వల్ల, అలవికాని అశాంతి వల్ల, సానపెట్టుకుంటున్న సాధన వల్ల, అన్నింటినీ మించి లోకంపట్లా, మనిషిపట్లా ఉన్న అపారమైన ప్రేమవల్ల ఇతని కవిత్వం ఆర్ద్రంగా, బలంగా, స్ఫూర్తిదాయకంగా, సురుచిరుమౌక్తికంగా రూపొందుతున్నది.
 డా|| ఎన్‌.గోపి

సాహిత్య నిర్మాతలు బి.ఎస్‌. రాములు
పేజీలు: 184
ప్రతులకు: 8331966987
వెల: రూ 100

 ప్రధానంగా వీరంతా సాహిత్యం, సామాజిక న్యాయం, సామాజిక మార్పు కోసమే అని నమ్మి తమ తమ రంగాల్లో కృషి చేసిన, చేస్తున్న ఉద్యమ కవులు, రచయితలు, కళాకారులు. ఈ పీఠికలను, వ్యాసాలను ఆయా రచయితలతో గల స్నేహం, ప్రేమ, గౌరవంతో పాటు దరకమే ఐక్యవేదిక ఉద్యమం, నిర్మాణం, విస్తరణ మేళవించి ఆత్మీయంగా రాసినవి.
 బి.ఎస్‌. రాములు

 

ద్వా.నా. శాస్త్రి
పేజీలు: 32
ప్రతులకు: 040-27426666
వెల: రూ 30

 ఈ రూపక ప్రణాళిక రాళ్ళబండివారిదే. ''మీరు రాయగలరు'' అని ప్రోత్సహించినదీ వారే. ఈ రూపకం విజయనగరంలో, హైదరాబాద్‌ రవీంద్రభారతిలో ప్రదర్శించినప్పుడు లభించిన ప్రశంసలు అన్నీ ఇన్నీ కావు. ఇవన్నీ కవితాప్రసాద్‌కే చెందుతాయి. ఇటీవల ప్రపంచ తెలుగు మహాసభలలో ప్రదర్శించినప్పుడు కూడా మెప్పు పొందింది.
 ద్వా.నా. శాస్త్రి

కూర చిదంబరం
పేజీలు: 45
ప్రతులకు: 984878430
వెల: రూ 30

 మనుష్యుల మధ్య ఉన్న బంధాలు, అనుబంధాలు, ప్రకృతితో సహజీవనం, జీవితంలో భాగమైన చెట్లు చేమ.. తన గురించి తాను, తన ఆలోచనలు... అన్నింటిని అందరితో పంచుకోవాలన్న తపన చిదంబరం చిన్న పదాల్లో కన్పిస్తుంది. మనస్సుకు ఆలోచనలను, ఆవేదనను, ఆనందాన్ని కలిగించే చిన్న ''సంక్షిప్తాలు'' ఇవి.
డా|| విష్ణు వందనా దేవి

డా|| దామెర రాములు
పేజీలు: 192
ప్రతులకు: 09866422494
వెల: రూ 70
భాషలో, భావంలో కొత్తదనం, సూటిదనం, స్పష్టత వున్నాయి. వస్తువులో వైవిధ్యం, వ్యక్తీకరణలో సారళ్యం మిళితమై రాములు కవిత్వాన్ని

 పాఠకులకు సుబోధకం చేశాయి. అందువల్లనే ఈ కవిత్వం మరింత మంది పాఠకులకు చేరువ అవుతుంది. తమ లోలోపలి ప్రపంచాలని శుభ్రం చేసుకోడానికి తోడ్పడుతుంది. 
గుడిపాటి
కూర చిదంబరం
పేజీలు: 156
ప్రతులకు: 9848787284
వెల: రూ 70

 

సా దారణంగా కనిపించే సంఘటనల్లో మనకు తెలియకుండానే అసాధారణాంశాలుంటాయి. వాటిని కథకులు మాత్రమే చూడగలరు. అక్షర రూపంలో పెట్టగలరు. కూర చిదంబరంగారు సరిగ్గా అదే పనిచేశారు. మనం చూస్తూ కూడా ఉపేక్షించే విషయాల్ని కథలో చదివినప్పుడు విస్తుపోతాం. విస్మయానికి లోనవుతాం. ఇలాంటి అంశాలే చిదంబరం గారి కథలో కనిపిస్తాయి. 
- గుడిపాటి
విడదల సాంబశివరావు
పేజీలు: 53
ప్రతులకు: 9866400059
వెల: రూ 80

 

 నాటక ప్రదర్శనను కొన్నివేలమంది మాత్రమే తిలకించగలరు. కానీ, ముద్రిత నాటక రాజమును కొన్ని లక్షలమంది చదువుతారు. సమాజం పాఠకుడి కళ్ళముందు సాక్షాత్కరిస్తుంది. అప్పుడు అతనిలో చైతన్యం వెల్లివిరుస్తుంది. ఈ వాస్తవాన్నిప్రజలకు తెలియజేయడమే నా నాటక రచనల ప్రచురణ ప్రధాన లక్ష్యం. రంగస్థల నటుడుగా కొన్ని వేల ప్రదర్శనలిచ్చిన నేను రచయితగా ప్రజల అంతరంగంలోనికి తొంగి చూసే ప్రయత్నం చేస్తున్నాను.
     విడదల సాంబశివరావు
ఈతకోట సుబ్బారావు
పేజీలు: 46
ప్రతులకు: 9440529785
వెల: రూ 50

 

మొత్తంగా పఠిత గుండెను ఆర్ద్రం చేసే ఏకసూత్రత ఈ కవితలో చూస్తాం. కనుకనే ఈ దీర్ఘకవితను పాఠశాలలో, కళాశాలల్లో చదివి వినిపిస్తే మంచి స్పందన వుంటుంది. జీవన సంరంభంలో పడి కొట్టుకుపోయే మధ్యతరగతి పాఠక జనంచెంతకు దీనిని తీసుకెళితే కవి నిర్దేశించుకున్న లక్ష్యం నెరవేరుతుంది.
గుడిపాటి

 

జి. వెంకటకృష్ణ
పేజీలు: 24
ప్రతులకు: 8985034894
వెల:

 

''ఖచ్చితంగా... ఖచ్చితంగా మానవజాతి హింస అనే సంకెళ్ళలో వుంది. దాని విముక్తికై చేసే పోరాటాలే యుద్ధాలూ వుద్యమాలూ, ఆరాచకాలూ అన్నీ... మనలాంటి దేశంలో అయితే ఆ విముక్తి పెద్ద పోరాటాల వైపు పోనీకుండా చేసి, చిన్న చిన్నగా ఆపేసేవే దేవరగట్టు లాంటివి''
- స్ఫూర్తి ప్రచురణకర్తలు
కట్టా వెంకటేశ్వరరావు
పేజీలు: 44
ప్రతులకు: 8096615202
వెల: రూ 50

 

ఇప్పుడు కట్టా వెంకటేశ్వరరావు (సంక్షిప్తనామం 'కవేరా') రెక్కలు ప్రచురిస్తున్నాడు. ఇంతకు ముందు కథలూ, వ్యాసాలూ, నవలలూ, కవితలూ రాసిన 'కవేరా' ఇప్పుడు రెక్కలు రాశారు. ఈ రెక్కలులో చాలా వరకు, సుగుమ్‌బాబు పంథాలోనే జీవన తాత్విక ఆలోచనలు ప్రధానంగా రాశారు. 
- అద్దేపల్లి రామమోహన్‌రావు
డా|| వాడపల్లి శ్రీరామమూర్తి
పేజీలు: 56
ప్రతులకు: 9440584343
వెల:

ఇది వారి రెండవ కథా సంకలనం. సమాజంలోని కొన్ని కోణాలను చూపే దర్పణం. కథలకి ప్రాధమిక అవసరం - చదివించగలగడం. అది ఈ కథలలో కొంతవరకు వుంది. భాష బాగుంది సజీవంగా... సులభంగా అర్ధమయ్యేలా! చిరుమాండలీకంతో. కాని కథలలోని పాయింటుని శక్తివంతంగా ప్రదర్శించగలిగితే చదివించే గుణం మరింత పెరుగుతుంది.
ఇచ్చాపురపు రామచంద్రం

 

జగన్నాథశర్మ
పేజీలు: 196
ప్రతులకు: విశాలాంధ్ర బుక్‌హౌస్‌
వెల: రూ 60

 

తరతరాలుగా ప్రాచుర్యం పొందుతున్న ఈ కథలు నీతిదాయకాలు. ఉగ్గుబాలతో పాటే రంగరించి పిల్లలకు చెప్పాల్సిన అమూల్యమైన కథలు. పిల్లలు విచక్షణా జ్ఞానానికి పదును పెట్టే కథలు. జీవిత సత్యాలను గొప్పగా ఆవిష్కరించే కథలు. పిల్లల వ్యక్తిత్వ వికాసానికి దోహదపడే కథలివి. నాడు విష్ణుశర్మ మొదలుకొని నేడు జగన్నాథశర్మ దాకా ఎందరెందరో మహారచయితలు ఈ పంచతంత్ర కథలను తమదైన శైలితో తీర్చిదిద్ది అటు పిల్లలను, ఇటు పెద్దలకు రసవత్తరంగా అందించారు.
వల్లూరు శివప్రసాద్‌
వేదగిరి రాంబాబు
పేజీలు: 196
ప్రతులకు: ప్రముఖ పుస్తకాల షాపులు
వెల: రూ 100

 

హైదరాబాద్‌ చరిత్ర మీద ఎన్నో పుస్తకాలు వచ్చాయి. వస్తున్నాయి. ముస్లిం చారిత్రకులు ఈ చరిత్రను ఒక విధంగా చెప్తే, హిందూ హిస్టోరియన్స్‌ ఈ చరిత్రను మరోవిధంగా చెప్పారు. కానీ చరిత్ర అన్నది ఎప్పుడూ ఒకటిగా ఉంటుంది మారదు. మనం ఎంతో చరిత్ర వున్న వాళ్ళం. ఈ చారిత్రావగాహన మన ఆలోచనలకు పదును పెడుతుంది. కుతుబ్‌ షాహీ చరిత్ర మీద ఒక సమగ్ర అవగాహనను అసఫ్‌జాహీల చరిత్ర మీద రేఖా మాత్ర అవగాహనను కలిగించడానికి ఈ గ్రంథం తోడ్పడుతుంది. 
డా|| వేదగిరి రాంబాబు
డా|| వేదగిరి రాంబాబు
పేజీలు: 174
ప్రతులకు: 9391343916
వెల: రూ 100

 

ఆయా జిల్లాలలోని రచయిత(త్రు)లు, విమర్శకులు, సాహిత్యాభిమానులందరూ ఈ సదస్సులలో పాల్గొన్నారు. కథానికల గురించి విరివిగా చర్చలు సాగాయి. అంతటితో ఊరుకోకుండా ప్రతిజిల్లాలోనూ - ఆ జిల్లాలో వందేళ్ళ కథానిక మీద పోటీలు పెట్టాను. అలా పోటీలు పెట్టడం వల్ల చాలామంది ఆ జిల్లాల కథానికా పరిణామాన్ని ఆలోచిస్తారని బహుమతిగా ఇవ్వడమే కాకుండా, వాటన్నింటినీ కలిపి ఇప్పుడు సంకలనంగా తెస్తున్నాం.
ప్రచురణ కర్త
గోపగాని రవీందర్‌
పేజీలు: 149
ప్రతులకు: 27678430
వెల: రూ 90

 

ఈ పరిశోధన గ్రంథంలో మూడు అధ్యాయాలున్నాయి. మొదటి అధ్యాయంలో గేయ ప్రాదుర్భావ నేపథ్యాన్ని, గేయం రకాలనీ, ప్రాముఖ్యతని వివరిస్తూ, గేయకవుల వర్గీకరణ చేశాడు. ప్రముఖ తెలంగాణ గేయ కవులను సంక్షిప్తంగా పరిచయం చేస్తూ వీరిలో సుద్దాల అశోక్‌తేజ ప్రత్యేకతను వివరించాడు. పాటను ప్రజావాణిగా పలికించి పీడితజన పక్షపాత గీతానికి జానపద బాణీనద్ది పండిత, పామరుల అభిమానాన్ని అశోక్‌తేజ చూరగొన్నాడని నిర్థారించాడు.
బన్న అయిలయ్య
కథానికలు
పేజీలు: 134
ప్రతులకు: ప్రముఖ పుస్తకాల షాపులు
వెల: రూ 60

 

ఏర్చికూర్చిన కథానికల పూలగుత్తే మనచేతిలో ఉన్న ఈ పుస్తకం. దీనిలోని ఒక్కొక్క కథానికా పుష్పం సహజ సుందర శిల్పవికాస రూపం. ఒక్కొక్క కథానికా వస్తువు సమకాలిక సామాజిక / వైయక్తిక సంక్లిష్టతా వలయంలో నుంచి లాగి మానవ జీవన శకలంగా రూపు గట్టించినది. ఈ విధంగా వస్తు శిల్పకళాకృతులను దాల్చిన ఈ కథానికలు ఈనాటి సమాజానికి అత్యంతావశ్యక మయినవి. 
పోరంకి దక్షిణామూర్తి

పేజీలు: 560
ప్రతులకు: ప్రముఖ పుస్తకాల షాపులు
వెల: రూ 200

 

ఈ నాలుగు పరిశోధనలకీ నేను నా జీవితంలో నాలుగు సంవత్సరాలని వెచ్చించటం జరిగింది. వీళ్ల జీవితాల్ని ముందు నేను సామాజిక కోణం నుంచి చూసి, తరువాత సీరియల్స్‌గా రచించి, ప్రచురించి, అప్పుడు గ్రంథస్థం చేయటం జరిగింది. అందుకే ఈ గ్రంథానికి తెలుగు సాహిత్యంలో ప్రత్యేక స్థానముందని భావిస్తున్నాను. ప్రత్యేక సామాజిక బాధ్యతతో నేను ఈ పరిశోధనలు చేశాను. 
డా - వేదగిరి రాంబాబు
కవిత్వం కె. గీత
పేజీలు: 108
ప్రతులకు: 9395500555
వెల: రూ 129

 

ఇది నా మూడవ కవితా సంపుటి. 2001 ద్రవభాష, 2006లో శీతసుమాలు దేనికవే ప్రత్యేక సందర్భాలు. అయినా ఇప్పుడు 'శతాబ్ది వెన్నెల' ఒక వైవిధ్యమైన ప్రవాస సందర్భం. ఈ కవితలన్నీ దాదాపుగా కాలిఫోర్నియా వచ్చేక రాసినవి. ప్రవాస జీవితం ఒక అనుకోని, అరుదైన మలుపు నా జీవితంలో. అయితే ఇక్కడ జీవితంలో కొత్త ఆనందాలతో బాటూ, సమాజంలో ప్రత్యేక భాగస్వామ్యత లోపించిన నిర్లిప్తత, వెనకటి జీవితంలో ఉన్నవేవో కోల్పోయిన, కోల్పోతున్న చేదు అనుభవాలు కూడా కలగడం రెండో పార్శ్వం.
కె.గీత
అనుభావ కావ్యం డా|| దీర్ఘాశి విజయభాస్కర్‌
పేజీలు: 104
ప్రతులకు: పాలపిట్ట బుక్స్‌
వెల: రూ 70

 

డాక్టర్‌ విజయభాస్కర్‌ నాటకాన్ని ఒక కథలా ప్రారంభించి కావ్యంలా ముగిస్తాడు. ఆ లక్షణం వల్లనే ఆయన నాటకాల్లోని ఎన్నో మాటలు ఉత్తమమైన కవితా పంక్తుల్లా రసజ్ఞల మనసుల్లో నిలిచి ఉన్నాయి. ఒక ఆధ్యాత్మిక దర్శనం, సామాజిక నిబద్ధత, సామాన్యుని అభ్యుదయం కోసం నిరంతర తపన, విజయభాస్కర్‌ రచనలోని జీవశక్తులు. ఈ అంశాలే కవితాత్మకంగా మరింత బలపడి ఈ కావ్యంలో సాక్షాత్కరిస్తాయి. 
పాలపిట్ట బుక్స్‌
కె.వి.ఆర్‌., శారదాంబ స్మారక కమిటీ
పేజీలు: 798
ప్రతులకు: 98490 83137
వెల: రూ 300

 

ఈ వ్యాసాలు షుమారుగా మూడు నాలుగు థాబ్దాల కాల వ్యవధిలో రాసినవి. అందువల్ల వ్యాసాల భాషలో, శైలిలో ఒకింత మార్పు కనిపిస్తుంది. తొలిథకు చెందిన వ్యాసాలు కొంత గ్రాంథిక శైలిలో ఉండడం గమనిస్తాం. సాధారణ పాఠకులకు అర్థంగాని సంస్కృత పదాలేకాదు, ఈనాడు వ్యవహారంలో లేని అరుదైన తెలుగు పదాలను కూడా కొన్ని వ్యాసాలలో ప్రయోగించి ఉన్నారు. 
వి. చెంచయ్య
పొన్నం రవిచంద్ర
పేజీలు: 334
ప్రతులకు: విశాలాంధ్ర
వెల: రూ 900

 

'సినిమాని, సాహిత్యాన్ని ఎంతగానో ప్రేమించే రవిచంద్ర 8 థాబ్దాల తెలుగు సినిమా ప్రయాణంలో వివిధ థలను, ఘట్టాలను పేరెన్నికగన్న మైలురాళ్ళను చారిత్రక కోణంతోనూ, సమకాలీన దృక్పధంతోనూ విశ్లేషించిన తీరుకు నిలువుటద్దం - ఈ 
మామిడి హరికృష్ణ
సి. వేణు
పేజీలు: 124
ప్రతులకు: 9900896123
వెల: రూ 116

 

50 ఏళ్ళ క్రితమే తరచు కరువు బారిన పడే రాయలసీమ రైతుల వెతల్ని కథలుగా మలిచిన రచయితలలో వేణుగారు ముఖ్యులు. వానొచ్చె గంగు లాంటి కథలు అందుకు తార్కాణం. చిత్తూరు జిల్లా రచయితల సంఘం ప్రచురించిన కథా, గేయ సంకలనాలలో వేణుగారి కథలు గేయాలు చోటు చేసుకున్నాయి. 
ప్రచురణ కర్తలు
ప్రముఖుల అభిప్రాయమాలిక కాట్రగడ్డ కృష్ణచంద్‌
పేజీలు: 76
ప్రతులకు: 08931-231834
వెల: రూ 40

 

ఆ భావాలకు ప్రభావితులైన కాట్రగడ్డ కృష్ణచంద్‌గారు, రామస్వామిగారి కృషిపై - వివిధ ప్రముఖులు వేర్వేరు సందర్భాలలో చెప్పిన అంశాలను వివిధ గ్రంథాల నుండి సేకరించి సంకలించి ఒక చిన్నపుస్తకంగా క్రోడీకరించారు. ఇది విలువైన పుస్తకం అనడంలో సందేహంలేదు. 
డా|| మానేపల్లి
సమకాలికజీవితం సమాజం సందర్భం వాడ్రేవు చినవీరభద్రుడు
పేజీలు: 476
ప్రతులకు: 9177392903
వెల: రూ 250

 

దాదాపు పుష్కరకాలంలో (2000-2012) వాడ్రేవు చినవీరభద్రుడు అనేక అంశాల పట్ల చాలా లోతుగా, తాత్వికంగా, సృజనాత్మకంగా, రసాత్మకంగా సమాజం పట్ల ప్రేమతో, సాహిత్య, సామాజిక, తాత్విక, చారిత్రక విషయల మీద గొప్ప సమన్వయంతో రాసిన వ్యాసాల సంకలనమే ఈ పుస్తకం.
ప్రచురణ కర్త
27 ప్రసిద్ధ తెలుగు నవలల విమర్శనాత్మక పరిచయం వి. రాజారామమోహనరావు
పేజీలు: 156
ప్రతులకు: విశాలాంధ్ర
వెల: రూ 75

పఠనాపరంగా, ప్రయోగపరంగా, ఉద్యమస్ఫూర్తి వల్ల, సృజనాపరమైన కొత్త దృక్కోణం వల్ల, వస్తువు వల్ల, రచనాపరమైన నైపుణ్యంతో... ఇలా రకరకాలుగా ఎంతో ప్రాచుర్యం పొందిన ప్రసిద్ధ తెలుగు నవలలు ఎన్నో ఉన్నాయి. అలాంటి నవలల్లో కొన్నింటిని అమెరికాలో వెలువడే తెలుగునాడి మాసపత్రిక కోసం విమర్శనాత్మక పరిచయాలుగా నేను రాశాను. ఆ రచనల సంపుటే ఈ పుస్తకం

ప్రచురణ కర్త
నాయుని కృష్ణమూర్తి
పేజీలు: 216
ప్రతులకు: వియన్నార్‌ బుక్‌వరల్డ్‌
వెల: రూ 80

 

ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం ఎక్కడా కనిపించడం లేదెందుకు? ఎవరికీ భుజాల మీద తలలు ఉన్నట్లు లేదే! తలలకు బదులు టివిలు, సినిమాతెరలు, కంప్యూటర్లు కనిపిస్తున్నాయెందుకు? మనుషుల మధ్య దూరమింత పెరిగిపోయిందేమిటి? ఎదురెదురుగా నిలబడి మాట్లాడుతున్నా మధ్యలో మహాసముద్రాలు కనిపిస్తున్నాయే! అటు చూడండి! ఆ అమ్మాయి ముఖం మీద ఆసిడ్‌పోసి పారిపోతున్నాడు ఎవడో! ఇంతటి గందరగోళంలో సతమతమవుతున్న మనస్సులోంచి ఎగదన్నుకొచ్చింది నవల. 
నాయుని కృష్ణమూర్తి
డా|| వేదగిరి రాంబాబు
పేజీలు: 127
ప్రతులకు: 9391343916
వెల: రూ 50

 

తల్లిదండ్రులచాటున ఉన్నంతకాలం జీవితం ఓ పాటలా సాగిపోతుంది. ఆ తర్వాత వ్యక్తిగత జీవిత వ్యధలు, వింతానుభూతులు, అనుభవాలు.. ఇలా సాగిపోతుంది జీవితం. ఇరవయ్యేళ్ళలోపు తమ జీవితాన్ని కొన్ని పాటలతో ముడివేసి, పాటలతో ముడిపడివున్న జీవితాన్ని చెబుతూ, ఫ్లాష్‌బాక్‌లోకి తొంగిచూస్తూ అలనాటి ఆటపాటల జీవితాన్ని అందంగా మనముందుంచారు  డా|| రాంబాబు. 
ప్రచురణకర్త
డా||.వి.ఆర్‌. రాసాని
పేజీలు: 105
ప్రతులకు: 9848443610
వెల: రూ 60

 

నా కథలు కొన్ని నాటికలుగాను, నాటకాలుగాను నాటకీకరింపబడ్డాయి. అలాంటి వాటిగురించి ఒకసారి చర్చించుకుంటున్న సందర్భంలో సాహిత్య విమర్శకులు, ఎస్వీ యూనివర్శిటీలోని తెలుగు అధ్యయన శాఖలో ఆచార్యులు, మిత్రులు డా|| మేడిపల్లి రవికుమార్‌గారు, అలాంటి నాటికలను వాటి మూలకథలతో బాటుగా ఒక పుస్తకం వేస్తే బాగుంటుందని సూచించారు. వారి సూచన కనుగుణంగానే ఈ పుస్తకం ముద్రించడం జరిగింది. 
కె. ఆనందాచారి
పేజీలు:
ప్రతులకు: 040-27660013
వెల: రూ 20

 

జీవిత కథనంపై కవనం పట్టుగా నడపడం కష్టమైనా ప్రక్రియా పరమైన ప్రతిభ చూపించి ఆద్యంతం తూకం తూగు కొనసాగించాడు. సమకాలీన పరిణామాలను 

చెబుతూ వర్తమానంలోకి దూకించడం ఇలా పలురకాల పద్ధతులను పాటించడం వల్ల ఇది సాధ్యమైంది. సందోర్భచితమైన శైలి కావడం వల్ల కొన్ని చోట్ల భావుకత మరికొన్ని చోట్ల అచ్చమైన భౌతికత కూడా మేళవించగలిగాడు. 
తెలకపల్లి రవి
డా.వి.ఆర్‌. రాసాని
పేజీలు: 59
ప్రతులకు:
వెల: రూ 60

పల్లెల్లో జరుపుకునే జాతరలు, దేవరలు, పండుగలు, తిరునాళ్ళు వంటి జన బాహుళ్యం చేరే కార్యక్రమాలు, పెండ్లిండ్లు, పేరంటాలు, సమర్తలు, సీమంతాలు వంటివి, అలాగే వెన్నెల రాత్రుల్లో ప్రదర్శించే కోలాటలు, గొబ్బి, జక్కి, చెక్కభజన, కులుకు భజన, పలకల భజన, చిటితాళ భజన వంటి వినోదాలు- ఇవన్నీ వేడుకలే. అలాగే హిందువులు, ముస్లిములు ఏ తారతమ్యాలు లేకుండా పాల్గొనే ఉరుసు ఉత్సవాలు, క్రిస్‌మస్‌ సంబరాలు వేడుకలే. ఆయా సందర్భాలలో పాడేవన్నీ వేడుక పాటలే. ఈ పుస్తకంలో ఒక్కో వేడుకకు ఒక్కో పాటను ఉదహరించడం జరిగింది
రాసాని

ముక్తవరం పార్థసారథి
పేజీలు: 288
ప్రతులకు: 9177618708
వెల: రూ 250

అన్నీ బహుమతుల్లాగే, నోబెల్‌ కూడా, వివాదాలకు అతీతమైనదేమీ కాదు. పలుసార్లు అర్హులకురాలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఉదాహరణకు : సాహిత్యంలో లియోటాల్‌స్టాయ్‌, ఆంటన్‌ చెహోవ్‌, హైన్రిష్‌ ఇబ్బెన్‌, థామస్‌ ఆర్డీ, జోసెఫ్‌ కోన్రాడ్‌, మార్క్‌ట్వేన్‌, మాక్సింగోర్కీ , జేమ్స్‌ జాయస్‌, మార్సెల్‌ ప్రూస్ట్‌, వర్జినియా వూల్ఫ్‌, హెచ్‌.జి.వెల్స్‌, సామర్సెట్‌ మాం లు నోబెల్‌ బహుమతికి అనర్హులనుకున్నారు స్టాక్‌ హోం అకాడెమీ జడ్జీలు. ఈ కథల నాణ్యత నిర్ణయించాల్సింది మీరే.
ముక్తవరం పార్థసారథి

 

డి. రామచంద్రరాజు
పేజీలు: 176
ప్రతులకు:
వెల: రూ 150

ప్రస్తుతం కుప్పలు తెప్పలుగా వ్యక్తిత్వ వికాసం పేరిట వస్తున్న పుస్తకం కాదిది. తెలుగు నేలలో ఉద్భవించిన జీవనసారం. అనుభవాల సాగరం. పేదరికంలో పెరిగినవాడు కష్టాల కొలిమిలో జీవితాన్ని రగిలించుకొన్నవాడు నలుగురి తలలో నాలుకలా నిలిచినవాడు ఎన్నో ప్రతికూల పవనాలకు ఎదురొడ్డి సవాలు విసిరినవాడు జీవితాన్ని జయించిన ఒక విజేత అనుభవాల అంతర్వాహిని... ఈ ''కాలం మరణించింది...''
నూకా రాంప్రసాదరెడ్డి

 

Dr. Raj Bahadur Gour
పేజీలు: 54
ప్రతులకు: 9346689306
వెల: రూ 25

Re-publishing a book of this kind, after sixty years, is of enormous educative value for the present and future generations. In the changed political conditions, as well as the rise of narrow communal and reactionary ideas and movements, it would be enlightening to re-read the history as told by an important actor on the stage of the past.
B. Narasing Rao

పలమనేరు బాలాజీ
పేజీలు: 140
ప్రతులకు: 9440995010
వెల: రూ 70

'ఇద్దరి మధ్య' చదువుతున్నప్పుడు ఎక్కడా కుంటు పడలేదు. నడక దెబ్బతినలేదు - ఒక సమతూకంతో - దానిదయిన సంగీతంతో ఈ కవితలన్నీ నడిచాయి. చాలా ఇంపుగా కనిపించాయి, ధ్వనించాయి - వాటి ముద్రల్ని అవి వదిలిపోతాయి - పుస్తకం చదివి అవతల పెట్టిన తర్వాత కూడా, వాటి స్పర్శ, వాటి ధ్వనులు మనల్ని వీడవు. అవి వాటిదయిన వ్యక్తిత్వంతో బతుకుతాయి
కె. శివారెడ్డి 

నాగిశెట్టి
పేజీలు: 43
ప్రతులకు:
వెల: రూ 50

 సమకాలీన సమాజంలోని క్లిష్ట పరిస్థితులు ఈ నానీల్లో ప్రతిబింబిస్తున్నాయి. తను పుట్టిన పల్లె, పెరిగిన సమాజం, తనచుట్టూ వున్న స్థితిగతులు ఈ నానీల్లో కన్పిస్తాయి. పల్లెలు, వ్యవసాయం, అవినీతి, ఆడపడుచుల వ్యథలు, ప్రకృతి వినాశనం ఇటువంటి సమస్యలన్నీ కవితా వస్తువులైనాయి. పుట్టి పెరిగిన వాతావరణం బలమైన కవిత్వం రాయడానికి నాగిశెట్టికి తోడ్పడుతోంది.
సోమేపల్లి వెంకట సుబ్బయ్య

 

డా|| వి.ఆర్‌. రాసాని
పేజీలు: 192
ప్రతులకు: 9848443610
వెల: రూ 120

వి.ఆర్‌. రాసాని బసివినులుగా మార్చబడిన ఎందరో స్త్రీల జీవితాలను స్వయంగా పరిశీలించి ఈ నవలను రాశాడు. ఆయన నివసిస్తున్న తిరుపతిలోనూ దాని చుట్టూ వున్న పలు ప్రాంతాల్లోనూ ఈనాటికీ బసివినులుగా ముద్ర పడిన స్త్రీలెందరో ఉన్నారని తను వాళ్ళతో మాట్లాడి, వాళ్ళ జీవితాలను క్షుణ్ణంగా పరిశీలించాకే తనీ నవలను రచించానని వి.ఆర్‌. రాసాని నాకు చెప్పాడు. ఈ కారణం చేతనే ఈ ముద్ర నవల ఇంత వాస్తవికంగా, ఇంత బలంగా రూపొందిందని నాకనిపించింది.
అంపశయ్య నవీన్‌
 

రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి
పేజీలు: 144
ప్రతులకు: 27760723
వెల: రూ 100

''సామెతల గురించి కూడా'' సామెతల్లో వాసకెక్కిన ఊళ్ళు సామెతల్లో వ్యతిరేక పదాలు, మనపండగలు సామెతలు, సామెతల్లో లోకరీతి మొదలైన వ్యాసాలు కూర్చారు. అలాగే ఈ వ్యాసాలలో పొడుపు కథల్ని గురించి, 'పాల మురిపాలు'లో పాలను గురించీ చెప్పలేనన్ని చుక్కలు''లో చుక్కల గురించి, మన కోసం కాగితంలో కాగితం గురించి, ''చేటు చేసే సోమరితనం''తో సోమరితనం గురించి - ఇలా ఎన్నో విషయాలు ''పదాల పరిమళాలలో గుభాళిస్తున్నాయి.
డా|| రెడ్డి రాఘవయ్య
 

వేమనపై విమర్శ వ్యాసాలు సి.పి. బ్రౌన్‌ భాషా పరిశోధన కేంద్రం,
పేజీలు: 244
ప్రతులకు: 08562 - 255517
వెల: రూ 160

 తెలుగు సాహిత్య చరిత్రలో అనేక కోణాలు ఇంకా అపరిష్కృతంగానే ఉన్నాయి. అందులో వేమన జీవితం ఒకటి. ఈ సంకలనంలోని వ్యాసాలలో వేమన జీవితం గురించి కాలం గురించి, స్థలం గురించి, వేమన భావజాలం గురించి, తాత్త్వికత గురించి అనేక ఆలోచనలు మన ముందుంచుతున్నాయి. ఈ ఆలోచనా వైవిధ్యాన్ని పాఠకుల ముందుంచడమే మా ఉద్దేశం.
ఆచార్య రాచపాళెం చంద్రశేఖర రెడ్డి


 

జి. నరసింహమూర్తి
పేజీలు: 168
ప్రతులకు: 8977987266
వెల: రూ 100

ఈ సంపుటిలోని 26 కథానికల్లోనూ వస్తు వైవిధ్యం కనిపిస్తుంది. శిల్ప చాతుర్యం  మెరుస్తుంది. సనాతన సాంప్రదాయాల్నీ, కుల మత వర్గ వైషమ్యాలనీ తన అనుభవాల కొత్తకోణంలో చిత్రీకరించిన 'పాతతోవకు కొత్తగమ్యం', 'దేవుడే హంతకుడు', 'దగ్థజీవితం' లాంటివి ఆయన అభ్యుదయ సాంఘిక సంస్కరణాభిలాషతో పాటు, అవి సమాజానికి మేలుకొలుపు!. కథానికలన్నీ తనదైన కొత్త వస్తువుతో ఆవిష్కరింపబడి నవ్యతతో హృదయాన్ని హత్తుకుంటాయి.
డా|| వేదగిరి రాంబాబు
 


పేజీలు: 201
ప్రతులకు: 9441420962
వెల: రూ 125

రచయిత అంతరంగం తాత్విక భావజాలం శ్రీ మహేశ్వర్‌ గారి కథలలో సహజంగా ద్యోతకమవుతుంటాయి. కొందరి కథలు చదువుతుంటే వారి వ్యక్తిత్వం, మనసు ఇలాంటిది అని చదువరికొక భావన, ఒక రూపం కూడా అందుతూ ఉంటాయి. అలాంటి స్ఫురణను అందిస్తాయి ఈ కథలు. కథల్లో శిల్పం ఆకుచాటు పిందెలా భాసిస్తుంది. శైలీ అంతే..
పేపర్‌ బ్యాక్‌
 

పోపూరి రామారావు
పేజీలు: 136
ప్రతులకు: ప్రజాశక్తి బుక్‌హౌస్‌ అన్ని బ్రాంచీలు
వెల: రూ 10

భా రత దేశంలో గల లక్షలాది గ్రామాలలో ఎడ్లపాడు కూడా ఒకటి. అటువంటి గ్రామానికి భావి తరాలకు ఉపయోగపడే చరిత్రప్రత్యేకంగా ఏముంటుంది? ఇది ఎడతెగని ప్రశ్నగా కొంతకాలం వేధించింది. గ్రామానికి గల పూర్వ చరిత్రను, పార్టీ చరిత్రను, వ్యక్తుల కృషిని, సాధించిన ఫలితాలను మేళవించి ముందుకెళ్తే ఒక రూపం కల్పించగలను అనిపించి, ఈ కార్యక్రమానికి ఉపక్రమించటం జరిగింది.

 పోపూరి రామారావు
 

సప్రం గణేష్‌బాబు
పేజీలు: 80
ప్రతులకు: 8977348821
వెల: రూ 60
కవిత్వం
ఇతని కవిత్వంలో ఆర్థ్రత వుంది. చెప్పే తీరులో భావనాశక్తి వుంది. పాఠకుణ్ణి వైరుధ్యంతో కాకుండా నచ్చజెప్పే ధోరణి వుంది. దాదాపు ప్రతి కవితలోనూ మానవత్వం కోసం అభ్యర్థన వుంది.
-డా|| అద్దేపల్లి
దాసరాజు రామారావు
పేజీలు: 136
ప్రతులకు: 9618224503
వెల: రూ 50
కవిత్వం

 

ఇందులోని కవితలను ఒకే ఒక్క వస్తుకేంద్రంగా చెప్పాలను కున్నప్పుడు ఇవన్నీ మనిషిలోని మనిషితనం పరాయీకరింపబడడం గురించి పడిన ఆవేదనను, మనిషి అస్థిపంజరంలోకి సజీవ సంచలన రక్తమాంసాలను మళ్ళీ ప్రోది చేసి మనిషితనాన్నీ, మంచితనాన్నీ ఆవిష్కరించాలన్న గాఢమైన ఆకాంక్ష. 
వరవరరావు
డా|| రామావత్‌ కుసుమ కుమారి
పేజీలు: 630
ప్రతులకు: 9866022347
వెల: రూ 525

సాహిత్యం ఎప్పటికప్పుడు ప్రజా భావజాలాలను విశ్లేషించి నిర్మాణశీల దిశానిర్దేశం చేస్తుంది. అంతే కాకుండా సాహిత్యం, చరిత్ర చెప్పని ఎన్నో సత్యాలను చెప్తుంది. అందువల్ల సాహిత్యాన్ని కూడా సమాజశాస్త్ర పరిశోధనా విధానంలోనే శాస్త్రీయంగా, పరిశోధించాలనీ జయంతి పాపారావు నాకు చెప్పి నా పరిశోధనకు దిశానిర్దేశం చేశారు. 

డా|| రామావత్‌ కుసుమ కుమారి
పేజీలు: 140
ప్రతులకు: 9866022347
వెల: రూ 150

 ఒక పరిశోధన చేయాలంటే దానికి ఎంతోమంది సహకారం కావాల్సి ఉంటుంది. లేదంటే పరిశోధనను కొనసాగించలేం. అందులోను ఉద్యోగం చేస్తూ చేయడం అనేది చాలా కష్టం. నా ఈ పరిశోధన ''గుంటూరు జిల్లా బంజారా గేయాలు - పరిశీలన'' అనే ఈ అంశం మీద మైనర్‌ రీసెర్చి ప్రాజెక్టును చేపట్లి విజయవంతంగా పూర్తిచేయడం జరిగింది.  డా|| రామావత్‌ కుసుమకుమారి

అన్నపరెడ్డి బుద్ధ ఘోషుడు
పేజీలు: 136
ప్రతులకు: 9949145650
వెల: రూ 15
బౌద్ధ ధమ్మపత్రిక

మానవీయ ఆచరణకు అనుగుణ్యమైన ధర్మచింతనను సమాజ ప్రధాన స్రవంతిలోకి ప్రవహింపజేసిన వ్యక్తులనెన్నడూ ప్రజలు మర్చిపోరు. అటువంటి అరుదైన వ్యక్తులలో అగ్రగణ్యుడు అశోకుడు. ఆ మహనీయుడు ప్రజల హృదయాల్లో, దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచివుంటాడు. ఆ మహనీయునికి బుద్ధభూమి అక్షర నివాళి అర్పిస్తుంది.   

-  గోలి సీతారామయ్య
లాడె ధనుంజయ
పేజీలు: 128
ప్రతులకు: 9618241994
వెల: రూ 100
కవితా సంకలనం
ఈ 'ఆనవాళ్ళు' జ్ఞాపకాల ఆనవాళ్ళు. ఈ జ్ఞాపకాలు బాల్యంలో మనస్సులో ముద్రపడిన పల్లె స్మృతులు. ఇందులో దాదాపు శతార్ధ శతాబ్ది కవులూ, షష్టిలబ్ది పూర్తి కవితలూ ఉన్నాయి. అన్ని కవితలు పల్లె చుట్టూ సంచరించాయి. ఇందరి కవుల వేరు వేరు కవితల సంకలనం కాదు 'ఆనవాళ్ళు' అందరూ పల్లెను మధురంగా స్మరించుకొన్న, గుర్తుంచుకొన్న, గుర్తుకు తెచ్చుకొన్న కవితలే !
 
- కొలకలూరి ఇనాక్‌
అల్లూరి (పెన్మెత్స) గౌరీలక్ష్మి
పేజీలు: 157
ప్రతులకు: 9948392357
వెల: రూ 100

నేలవిడిచి సాము చేయకుండా తనకు తెలిసిన సమాజాన్నీ, మనుషుల తత్వాన్నీ వారి జీవన స్థితిగతుల్నీ, అనుభవశాలిగా, లోకాధ్యయనశీలిగా చక్కగా చిత్రించారు గౌరిలక్ష్మి. మనకి బాగా తెలిసిన నవలా వస్తువే మన ఆలోచనల్ని కుదుపుతూ సాగటం ఈ రచనలోని గణ విశేషంగా చెప్పుకోవాలి. మీరూ ఈ నవలా పఠనానందాన్ని పొందండి.   - విహారి

పెద్దాడ వెంకటేశ్వర్లు
పేజీలు: 153
ప్రతులకు: 9959478245
వెల: రూ 100

ఈ సంపుటిలో 22 కథలున్నాయి. కథాంశాలూ, ఎన్నుకున్న సన్నివేశాలూ విభిన్నం. చాలా కథల్లో - అదే పేరుతోనో, మరో పేరుతోనో తటస్థపడే వెంకటేశం పాత్రలో రచయిత వ్యక్తిత్వం తొంగిచూస్తుంది. కల్పనలో స్వానుభవాల నేపథ్యం స్పష్టమౌతుంది. కథలే కుటుంబం చుట్టూ తిరిగినా- ఆ కుటుంబంలో మననీ పాత్రని చేస్తాయి. సన్నివేశాలు - కథ మనదే అనిపింపజేస్తాయి.

వసుంధర
వరిగొండ కాంతారావు
పేజీలు: 168
ప్రతులకు: 9441886824
వెల: రూ 100

శ్రీ కాంతారావు గారు కథకుడు. ఆ తరువాతనే కవి. వారి రచనలో వ్యంగ్యత. అధిక్షేపము, సున్నిత హాస్యము జీవము పోసుకొని పాఠకుడికి సంభ్రమాశ్చర్యాలు కలిగిస్తూనే, ఒక పక్క కాస్త ఇబ్బంది పెట్టేదిగా నున్నట్టు అనిపించినా మనసుకు హత్తుకుంటుంది. ఇందువలన పాఠకుడు రంజకుడు అవుతాడు. ఇది కాంతారావు గారు రచనా శైలి.  - డా|| టి. శ్రీరంగస్వామి

యన్‌. సుబ్రహ్మణ్యం
పేజీలు: 106
ప్రతులకు: 9949364241
వెల: రూ 20

2012 నవంబరు 25న కామన్‌ స్కూల్‌ విధానాన్ని, మాతృభాషలో విద్యాబోధనను డిమాండ్‌ చేస్తూ  'పిల్లల సమగ్ర వికాసానికి తోడ్పడే ప్రభుత్వ పాఠశాలల్ని పరిరక్షించుకొందాం' అన్న నినాదంతో - ప్రైవేటీకరణను పెంచుతున్న ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా జిల్లా సదస్సు జరుగుతున్న సందర్భంగా పలువురు విద్యావేత్తలు చేసిన ఉపన్యాసాలను, రాసిన వ్యాసాలను, సంకలనంగా తెచ్చేందుకు పూనుకుంటున్నాం.  - ప్రచురణకర్తలు

రంగనాథ రామచంద్రరావు
పేజీలు: 112
ప్రతులకు: 9290050229
వెల: రూ 60

కథలు

రామచంద్రరావు మానవతా విలువలన్నా, వాటిని పెంచే మన సంస్కృతి, సంస్కారమన్నా ఎంత ప్రేమో ఈ కథానికలన్నీ మనకి చెప్పకనే చెప్తాయి. అందరూ చదవాల్సిన కథానికలు. చదివి మరచిపోవాల్సిన కథానికలు కావు. మనల్ని మనం చెక్‌ చేసుకోవడానికి తోడ్పడే కథానికలు.

 --వేదగిరి రాంబాబు

డా|| కత్తి పద్మారావు
పేజీలు: 182
ప్రతులకు: 984974169
వెల: రూ 100

ప్రత్యామ్నాయ సంస్కృతి

వైదిక బ్రాహ్మణ సంస్కృతిని ఎదిరించి పోరాడిన చార్వాక, బౌద్ధ, జైన తత్త్వ శాస్త్రాలను ఈ గ్రంథం వివరించింది. అంతేకాక సాంస్కృతిక విప్లవాన్ని ముందుకు తీసుకెళ్ళిన వీర శైవం, భక్తి కవులు, అంబేద్కర్‌, పూలే, పెరియార్‌ ఉద్యమాలన్నింటిని ఈ గ్రంథం సిద్ధాంత భూమికతో వెలువరించింది. ప్రత్యామ్నాయ జీవన విధానాన్ని, ప్రణాళికని ఈ గ్రంథం మన ముందుంచింది.